రుచి

ఉసిరి .. ఆరోగ్య సిరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనిషికి మొక్కకు వున్న అనుబంధం విడదీయరానిది. ఆయుర్వేదానికి మొక్కకు వున్న బంధం మరింత గట్టిది. ఆయుర్వేదానికి మూలమైన సంహితల్లో వందలకొద్దీ మొక్కల గురించి ప్రస్తాన వుంది. వేల సంవత్సరాల నాడే భారతీయులు ప్రకృతి ప్రసాదించిన వనమూలికల గుణాలు గుర్తించారు. ఔషధ మొక్కల్లో ఉసిరి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆమ్ల, నెల్లిక్క, నేల ఉసిరి.. ఇలా అనేక పేర్లతో పిలిచే ఈ చెట్టు మన ఊళ్ళల్లో ఒకప్పుడు ఇంటింటా వుండేవి. దీని ఔషధ గుణాలు ఇప్పుడిప్పుడే తిరిగి ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. గిరాకి పెరగటంతో దీన్నొక పంటగా కూడా చేస్తున్నారు. రోగాల నివారణకు, చికిత్సకు రెంటికీ ఉసిరి ప్రసిద్ధి పొందింది. రోగ నిరోధక శక్తి పెంపొందిస్తుంది.
ఉసిరి చెక్క ఎన్ని సంవత్సరాలు నీళ్ళలో నానినా చివికిపోదు. ఉసిరితో చేసిన కొయ్య ఒరను బావి అడుగున ఉంచడం కేరళలో ఆనవాయితీ. దీనివల్ల నీటికి చల్లదనం, పరిశుభ్రత సమకూరతాయని నమ్మకం. ఎంబ్లికా అఫిసినాలిస్ (శాస్ర్తియ నామం) అనే ఈ మొక్క భారతీయ వైద్యంలో ప్రాచీన కాలంనుంచీ వాడుకలో వుంది. దీనిలో విటమిన్ సి (అస్కార్చిక్ యాసిడ్) అత్యధిక పరిమాణంలో వుంటుంది. నిల్వ ఉంచినా, వండినా వైద్య గుణాలు కోల్పోదు. స్కర్వీవ్యాధి చికిత్సలో ఆమ్ల అత్యుత్తమ ఫలితాలు ఇస్తుంది. మంచి యాంటీ ఆక్సిడెంట్‌గా కూడా పనిచేస్తుంది. జీర్ణరసాల ఊటను తగ్గించి, మ్యూకస్ విడుదలను పెంచి మూడు ఫలాలను కలిపి ఆయుర్వేదంలో త్రిఫలగా పేర్కొంటారు. మూడు కలిపిన చూర్ణం ఆకలిని పెంచుతుంది. ప్రేవులను శుద్ధి చేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకాన్ని పోగొడుతుంది.
ఉసిరి చెట్టులోని అన్ని భాగాలూ ఏదోలా మేలు చేసేవే అయినా, కాయనే ఎక్కువ ఔషధాలలో వాడతారు. చక్కటి కండపుష్టి కలిగించడమే కాకుండా ఒంటికి చలవ చేస్తుంది. పళ్ళను గట్టిగా వుంచి చిగుళ్ళు నెత్తురు కారకుండా కాపాడుతుంది. శ్వాస సంబంధమైన క్షయ, ఆస్త్మా, దగ్గుల చికిత్సకు ఇది ప్రయోజనకారిగా ఉంటుంది. భారతీయ ‘గూస్‌బెర్రీ’గా పాశ్చాత్యులు పేర్కొనే ఆమ్ల గుండె మీద కూడా పనిచేసి బీపిని అదుపులో చేయడానికి ఉపకరిస్తుంది. రక్తంలో కొవ్వును తగ్గిస్తుంది. ఇందులోని ‘సి’ విటమిన్ క్లోమ గ్రంథిని ప్రేరేపింపజేసి
ఇన్సులిన్ విడుదలను పెంచుతుంది. తద్వారా యాంటీ డయాబెటిక్‌గా కూడా పనిచేస్తుంది. ఒక కప్పు గ్యూర్డ్ పళ్ళరసంతో ఒక టేబుల్ స్పూన్ ఆమ్లరసం కలిపి రోజూ క్రమం తప్పకుండా రెండు నెలలు తీసుకుంటే బ్లడ్ సుగర్‌ను తగ్గిస్తుందని గుర్తించారు. మధుమేహం వ్యాధివల్ల కంటిచూపు దెబ్బతిన్న సందర్భల్లోనూ ఈ చికిత్స ఉపకరిస్తుంది.
ఆమ్లాలోని సుగుణాలు వయోభారాన్ని నివారించి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. దేహ శక్తి సామర్థ్యాలను పునరుద్ధరించి గుణాలపై చాలా పరిశోధనలు జరిగాయి. మానసిక సామర్థ్యాన్ని కూడా ఇది పెంచుతుంది.
‘చవన్‌ప్రాశ్’లో ప్రధానంగా వాడేది ఉసిరినే. ఈ మూలికా లేహ్యం పూర్తిగా సహజ సిద్ధమైంది. దేహంలోని ప్రతిభాగాన్ని ఉత్తేజపరుస్తుంది. ఆమ్లాతో టానిక్‌లు కూడా తయారుచేస్తున్నారు. ఆరోగ్యదాయక, ఆనందమయి జీవితానికి ఆమ్ల లేహ్యాలు, టానిక్కులు ప్రతి ఒక్కరూ రెగ్యులర్‌గా వాడవచ్చు. హెర్బల్ షాంపులలో, ఫేస్ వాష్, తలనూనెలు, హెయిర్ డైలలోనూ ఉసిరిని కలుపుతున్నారు. ఎండబెట్టి చేసిన పొడిని నోటి దుర్వాసన నిరోధానికి వౌత్ ఫ్రెష్‌నర్‌గా వాడుకోవచ్చు. ఉసిరికాయలు నేరుగా తినటానికి, పచ్చళ్ళకు బాగుంటాయి. మరగబెట్టి చల్లార్చిన ఉప్పునీటిలో వేసి కొద్దికాలం నిల్వ చేసుకోవచ్చు. ఉసిరి చెట్టు నుంచి కొన్ని రకాల రంగులు తయారుచేస్తున్నారు. ఈ రంగులను వస్త్ర పరిశ్రమలో ఉపయోగిస్తారు.
.......................
భూమికకు రచనలు
పంపాలనుకునే వారు
రచనలను
ఈ మెయిల్‌లో స్కాన్ లేదా
పిడిఎఫ్ ఫార్మాట్‌లో bhoomika@andhrabhoomi.netకు మెయిల్ చేయవచ్చు.
లేదాఈకింది చిరునామాకు
పంపగలరు.
మా చిరునామా :
ఎడిటర్, భూమిక
ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్
సికిందరాబాద్- 03

- బి.మాన్‌సింగ్ నాయక్