రుచి

పాల తాలికలు, (బెల్లం) తాలికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బియ్యం పిండి మెత్తనిది- 2 కప్పు లు, ఏలకుల పొడి- 2 చెంచాలు, కొబ్బరికోరు- 1/2 కప్పు, బెల్లం- 2 కప్పులు, జీడిపప్పులు- 24, బాదం పొడి- 2 చెంచాలు, పాలు- లీటరు, కిస్‌మిస్‌లు- 24, నెయ్యి 2 చెంచాలు.
ముందుగా 4 కప్పుల నీరు మరిగించి బియ్యం పిండి పోసి ఉడికించి దింపి కణికలు మాదిరి ఈ పిండి చేసుకొని పళ్ళెంలో ఉంచండి. పాలు మరిగించి బెల్లం వేసి కరగనిచ్చి అందులో ఏలకుల పొడి వేసి పైన చేసిన తాళికలు వేసి ఉడకనివ్వాలి. పది నిముషాలు ఉడికాక, కొబ్బరికోరు, బాదం, కిస్‌మిస్‌ను నేతిలో వేయించుకుని పెట్టుకోవాలి. బాదం పొడి చేర్చి కలిపి, దీన్ని దింపి బాణలో పొయ్యండి. అడుగంట కుండా తాళికలు విడిపోకుండా జాగ్రత్తగా వండాలి. ఇదీ బెల్లం తాళికలు అయితే పాలకి బదులు బెల్లం పాకం లో తాళికలు వేసి ఉడకనిచ్చి, ఏలకులు, కొబ్బరి, బాదం పొడి, జీడిపప్పులు వేసి కలిపి దింపండి.