రాష్ట్రీయం

రూల్సు మారాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిబంధనల్లో మార్పు జిల్లా మంత్రి నేతృత్వంలో కమిటీ జీవో విడుదల

హైదరాబాద్, నవంబర్ 26: డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల మంజూరుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం నియమ నిబంధనలు మార్చింది. జిల్లా స్థాయి కమిటీ లబ్ధిదారులను ఖరారు చేస్తుంది. జిల్లా మంత్రి చైర్మన్‌గా ఉండే ఈ కమిటీలో జిల్లాలోని శాసన సభ్యులు సభ్యులుగా ఉంటారు. జిల్లా కలెక్టర్ కన్వీనర్‌గా ఉంటారు. అంతకు ముందు నిబంధనల్లో జిల్లా మంత్రి, శాసన సభ్యులు 50:50 దామాషాలో ఇళ్లను కేటాయించాలని నిర్ణయించారు. ఈ విధానం పట్ల అభ్యంతరాలు వ్యక్తం కావడం, కొందరు కోర్టుకు వెళ్లడంతో నియమ నిబంధనలు మార్చారు.
వరంగల్ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత తెలంగాణ భవన్‌లో జరిగిన విలేఖరుల సమావేశంలో ఈ అంశం గురించి విలేఖరులు ప్రశ్నించగా, పారదర్శకత పాటిస్తూ లబ్ధిదారులను ఎంపిక చేసే విధంగా నియమ నిబంధనలు ఉంటాయని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ మేరకు నిబంధనలు మారుస్తూ శుక్రవారం గృహ నిర్మాణ శాఖ జీవో విడుదల చేసింది. లబ్దిదారుల ఎంపికకు సంబంధించి గతంలో విడుదల చేసిన జీవోకు సవరణలు చేస్తూ కొత్త జీవో విడుదల చేశారు. ఒక్కో నియోజక వర్గానికి కేటాయించిన ఇళ్ల లబ్ధిదారుల జాబితాను ఈ కమిటీ రూపొందిస్తుంది. ఎస్సీ, ఎస్టీ మైనారిటీ కోటాను పాటించాలి. గ్రామ పంచాయితీలో, నగరంలో వార్డుల్లో లబ్ధిదారుల నుంచి కలెక్టర్ దరఖాస్తులు ఆహ్వానిస్తారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకం నిబంధనల మేరకు అర్హుల జాబితా రూపొందిస్తారు. గ్రామ స్థాయి, వార్డు స్థాయిలో స్క్రూటినీ తరువాత జాబితాను తహిల్దార్‌కు పంపిస్తారు. తహిల్దార్ స్థాయిలో స్క్రూటినీ తరువాత జాబితాను కలెక్టర్‌కు పంపిస్తారు. అనంతరం తహిసిల్దార్ ఫైనల్ చేసిన జాబితా తిరిగి గ్రామ సభకు, వార్డు కమిటీకి చేరుతుంది. అనంతరం లాటరీ విధానంలో లబ్ధిదారులను ఎంపిక చేస్తారు.