క్రీడాభూమి

తొలి వనే్డలో పాక్‌పై కివీస్ గెలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెల్లింగ్టన్, జనవరి 25: పాకిస్తాన్‌తో మూడు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌ను న్యూజిలాండ్ శుభారంభం చేసింది. 70 పరుగుల తేడాతో విజయం సాధించి, 1-0 ఆధిక్యాన్ని సంపాదించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 280 పరుగులు చేసింది. హెన్రీ నికోలస్ (82), మిచెల్ సాంట్నర్ (48), మాట్ హెన్రీ (48) బ్యాటింగ్‌లో రాణించారు. పాక్ బౌలర్లలో మహమ్మద్ అమీర్ 28 పరుగులకు మూడు వికెట్లు పడగొట్టాడు. అన్వర్ అలీ 66 పరుగులిచ్చి మూడు వికెట్లు కూల్చాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ 46 బంతుల్లో 210 పరుగులకే కుప్పకూలింది. బాబర్ ఆజం (62), మహమ్మద్ హఫీజ్ (42) తప్ప మిగతా వారెవరూ క్రీజ్‌లో నిలవలేకపోవడంతో పాక్‌కు ఓటమి తప్పలేదు. కివీస్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ 40 పరుగులిచ్చి నాలుగు వికెట్లు సాధించాడు. ఇలియట్ 43 పరుగులకు మూడు వికెట్లు కూల్చాడు.