ఆంధ్రప్రదేశ్‌

2019 నాటికి సంపూర్ణ పారిశుద్ధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంత్రి అయ్యన్నపాత్రుడు

విశాఖపట్నం, డిసెంబర్ 29: 2019 నాటికి రాష్ట్రంలోని గ్రామాలన్నింటినీ ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్ది, సంపూర్ణ పారిశుద్ధ్యం సాధించాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు పిలుపునిచ్చారు. మంగళవారం విశాఖ జిల్లా పరిషత్‌లో పారిశుద్ధ్యంపై రాష్ట్ర స్థాయి వర్క్‌షాపును నిర్వహించారు. ఇందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంపూర్ణ పారిశుద్ధ్యానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నాయన్నారు. జాతిపిత గాంధీజీ 150 జయంతి నాటికి రాష్ట్రంలో సంపూర్ణ పారిశుద్ధ్యం సాధించే దిశగా అడుగులు వేయాలన్నారు. ఇందుకోసం ప్రజలను చైతన్యవంతులను చేయాలన్నారు. ఇందుకు మండల, జిల్లా స్థాయి అధికారులు ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకొని ప్రజలు శతశాతం వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించుకునే విధంగా ప్రోత్సహించాలన్నారు. ప్రతి పంచాయతీలోనూ ప్రజలు, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేయాలన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి కిమిడి మృణాళిని మాట్లాడుతూ వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించుకునేందుకు ప్రజల ఆలోచనా సరళిలో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం తొలుత కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల గురించి ప్రచారం చేపట్టినపుడు ప్రజల నుంచి స్పందన అంతంత మాత్రమే ఉండేదన్నారు. నేడు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసుకుంటున్న విషయాన్ని గుర్తు చేశారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఎండిడబ్ల్యుఎస్ డైరెక్టర్ డాక్టర్ నిపుణ్ వినాయక్, యూనిసెఫ్ వాష్ ఆఫీసర్ ఎస్‌ఆర్ నల్లి, పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి జవహర్‌రెడ్డి, రాజస్థాన్ విద్యుత్‌బోర్డు మేనేజింగ్ డైరెక్టర్ ఆర్‌టి డోగ్రా, తదితరులు మాట్లాడుతూ సంపూర్ణ పారిశుద్ధ్యానికి చేయాల్సిన కృషి గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్ లాలం భవానీ, విశాఖ, విజయనగరం, తూర్పుగోదావరి, నెల్లూరు కలెక్టర్లు ఎన్ యువరాజ్, ఎంఎం నాయక్, అరుణ్‌కుమార్, జానకి, 13 జిల్లాల జెడ్పీ సిఇఒలు, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు పాల్గొన్నారు.