Others

కల్పన కాదు.. ఐతిహాసిక నవల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాజ్ఞసేని
(నవల)
రచన: బ్రహ్మశ్రీ త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్య పండితుడు
వెల: రు.400/-
ప్రతులకు: నవోదయ- ఇతర ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు
*
బ్రహ్మశ్రీ త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యం పండితుడు లోగడ మహాభారత నామకోశమును రచించారు. ఇది చాలా సంక్లిష్ట కార్యము. దాదాపు పనె్నండు సంవత్సరములు శ్రమించినట్లు వారు చెప్పారు.
తర్వాత వారు మహాభారత గాథను పరిశోధనాత్మకంగా అధ్యయనం చేశారు. ఈ శ్రమ వృధాకాకూడదని దానినొక నవలగా మలుచుకున్నారు. అదే ‘యాజ్ఞసేని’ అయింది. ఇదొక బృహత్ గ్రంథము- లోగడ ఆంధ్రభూమి దినపత్రికలో కొంతకాలం ధారావాహికంగా వచ్చింది. ద్రౌపదిపై లోగడ మూడునాలుగు నవలలు వచ్చాయి. ఒరియాలో హిందీలో కన్నడంలో కూడా ఆయా రచయిత ద్రౌపది పాత్రకు కేంద్ర బిందువుగా చేసుకొని రచనలు చేశారు. ఇప్పుడు బ్రహ్మశ్రీ సుబ్రహ్మణ్య పండితుడు చేసిన ఈ రచన కథకాదు కల్పనకాదు యథా మూలకముగా రచింపబడిన ఐతిహాసిక నవల.
చరిత్రక నవల, ఐతిహాసిక నవల కవల పిల్లలు- వీటికి వాడే భాష- శైలి సాంఘిక నవలకన్నా భిన్నంగా ఉంటుంది. కథాకథనంలో ఐతిహాసిక సారళ్యం (ఎపిక్ సింప్లిసిటీ) ప్రదర్శించాలి. ఒక సుప్రసిద్ధ పౌరాణికాంశాన్ని నవలగా వ్రాసినప్పుడు ఆ జాతియొక్క సెంటిమెంటును ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకొని రచించారు. ఎక్కడా వక్రీకరణ అవమానము కూడదు. అందువల్ల చారిత్రక, ఐతిహాసిక నవలా రచనలు అసిధారావ్రతాలు. ఉన్నది ఉన్నట్లు చెపితే ‘ఇందులో మీ కొత్తదనం ఏముంది?’ అంటారు. ఏమైనా కొత్త విషయాలు చెపితే ‘ఇవి మూలాతిక్రమణ చేసిన కల్పనలు’ అంటారు. ఎలా వ్రాసినా విమర్శలు తప్పవు. ముఖ్యంగా ఇప్పుడు రీడింగ్ హాబిట్ తగ్గుతున్న కాలంలో ఒక నవలను అందునా ఐతిహాసిక నవలను చదివించడం అంటే మిక్కిలి శ్రమతో కూడుకున్న పని. మనోల్బణము. త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యం పండితునికి పరిశోధనాత్మక దృష్టి మాత్రమేకాక కథాకథన శిల్పము కూడా తెలుసు. అందుకే మూల కథను మార్చకుండా ఏమార్చకుండా పాఠకుల పఠనీయతకు భంగం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ద్రుపద రాజపుత్రి ద్రౌపది బాల్యము, వివాహము, రాజసూయ యాగము, వనవాసము వంటి ఘట్టములన్నీ రచయిత వివరంగా వర్ణించుకుంటూ వెళ్లారు. మయసభలో ద్రౌపది నవ్విందా? లేదా? ఇదొక వివాదాంశము. దీనిపై భిన్నాభిప్రాయాలున్నాయి. వ్యాస భారతము దాక్షిణాత్యులకు ఏ ప్రతి అందిందో తెలియదు. అందువల్ల సంస్కృత మూలము కవిత్రయ భారతములో కొన్ని మార్పులకు చేర్పులకు లోనైంది.
ద్రౌపది కన్యారాశికి సంకేతము. ఇదొక నక్షత్ర శాస్తమ్రు. ఉత్తర ఫల్గుణీ నక్షత్రమే అర్జునుడు. ఇదొక మహావిషయము. ఇప్పుడు నక్షత్ర శాస్తమ్రు దాదాపు మరుగున పడింది. ఐతిహాసిక గాథ మాత్రమే మిగిలింది. ద్రౌపది కథ వ్రాసినప్పుడు సుబ్రహ్మణ్యం పంతులు మూలములోని ఉపాఖ్యానముల జోలికి పోలేదు. అనగా సందర్భోచితంగా చాలా కథలు వస్తాయి. ఎన్నో నీతి విషయాలు శాస్త్ర చర్చలు వస్తాయి. అది పురాణ లక్షణము. ఇక్కడ నవలా కథనానికి మూలకథ ఎంత అవసరమో దానినే సుహ్మ్రణ్యంగారు ప్రధానంగా స్వీకరించారు. అంటే ఇది నవలయే కాని యధామూలక ఆంధ్ర మహాభారతానువాదము కాదు. అట్టి అనువాద గ్రంథాలు మరికొందరు రచించారు. మరలని దేల రామాయణం బన్నచో- అని విశ్వనాథవారు ప్రశ్నించుకున్నట్లే మరలనిదేల ఈ భారతం బన్నచో అని ప్రశ్నిస్తే ఇవ్వాళ స్వరాజ్యాన్ని సురాజ్యంగా మార్చుకోవడానికి ఒక అస్వతంత్ర జాతి తన అస్తిత్వాన్ని నిలుపుకోవడానికి ప్రాచీన సాంస్కృతిక సాహిత్య వారసత్వం నిలుపుకోవలసిన అవసరం ఉంది. అందుకే చారిత్రక ఐతిహాసిక నవలలు పుంఖానుపుంఖాలుగా రావాలి. ఐతే అందుకు ప్రతిభతోబాటు పాండిత్యం కూడా అవసరం. వర్తమాన కాలంలో సృజనాత్మక శక్తి ఉన్నవారిలో పాండిత్యం పాలు తక్కువ. వ్యుత్పన్నత ఉన్నవారు సృజనాత్మక రచనలు చేయలేకపోతున్నారు. ఇదొక సంక్లిష్ట సంధి యుగము.
ఈ నవల పాంచాల దేశపు రాజధాని అయిన కాంపిల్య వర్ణనతో, యాజ్ఞసేని స్వయంవర ప్రకటనతో ఆరంభవౌతుంది. ఈమె పూర్వజన్మలో నీలాయని అనే రాజు కూతురు. దైవాంశ సంభూతురాలు. వివాహ సమయానికి ఇరువది రెండో సంవత్సరము వయస్సు వున్నట్లు శ్రీ సుబ్రహ్మణ్యంగారు నిరూపించారు. బహుశా ప్రపంచ చరిత్రలోనే ద్రౌపది పడినంత అవమానాలు, కష్టాలు మరే స్ర్తి అనుభవించి వుండదు.
చిట్టచివరి స్వర్గారోహణ పర్వంలో నేటి బదరీనాథ క్షేత్రం వద్దనున్న మానే అనే ప్రదేశం వద్ద, సరస్వతీనది పుట్టినచోట యోగం సడలి పడిపోతుంది. ఈమధ్యలో గాలి కథనంతా శ్రీ సుబ్రహ్మణ్యంగారు నవరస భరితంగా ఒక వచన కావ్యంగా తీర్చిదిద్ది ఎంతో సఫలీకృతులయ్యారు. అంటే పరోక్షంగా వచన మహాభారతాన్ని పూర్తిగా చదివిన సంతృప్తి మనకు ఈ నవల వలన లభిస్తుంది.

-ప్రొ.ముదిగొండ శివప్రసాద్