రాష్ట్రీయం

మోదీ డబ్బు.. కేసీఆర్‌కు పేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ రైతులకు ‘డబల్ దమాఖా’ అమలవుతోంది. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘పీఎం-కిసాన్’ పథకం, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది నుండి అమల్లోకి తీసుకువచ్చిన ‘రైతుబంధు’ పథకం వల్ల రైతులకు లబ్ధి జరుగుతోంది. అయితే ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్రం ప్రవేశపెట్టిన పీఎం-కిసాన్ పథకానికి పెద్దగా ప్రచారం జరగలేదు. ఇదే సమయంలో తెలంగాణలో గత ఏడాది నుండి రైతుబంధు పథకం ద్వారా రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ అవుతోంది. ఎకరాకు నాలుగువేల రూపాయల చొప్పున రైతుకు ఎంత భూమి ఉంటే అంత లెక్కకట్టి బ్యాంకుల్లో వేస్తున్నారు. ఈ పథకానికి విస్తృతమైన ప్రచారం జరగడంతో ఇప్పుడు పీఎం-కిసాన్ పథకం ద్వారా రైతుల ఖాతాల్లో జమ అయిన డబ్బు కూడా కేసీఆర్ వేస్తున్నారని రైతులు భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంకానీ, బీజేపీ పార్టీకానీ పీఎం-కిసాన్ పథకానికి ప్రచారం పూర్తిస్థాయిలో చేసుకోలేదు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జాతీయ స్థాయిలో ప్రవేశపెట్టిన పీఎం-కిసాన్ పథకం ద్వారా ప్రతి రైతుకు ఏడాదికి ఆరువేల రూపాయలు లభిస్తాయి. ఒక్కో విడతలో రెండువేల రూపాయల చొప్పున ఈ డబ్బు ఏడాది కాలంలో మూడు విడతల్లో రైతుల బ్యాంకు అకౌంట్లలో వేస్తారు. పీఎం-కిసాన్ పథకానికి సంబంధించి తెలంగాణలో ఇప్పటికే తొలివిడత రెండువేల రూపాయలు రైతుల అకౌంట్లలో పడుతోంది. తాజా సమాచారం ప్రకారం 15 లక్షల మంది రైతులకు 306 కోట్ల రూపాయలు బ్యాంకుల్లో జమ అయ్యాయి. పీఎం-కిసాన్ పథకం అమలు చేసేందుకు రైతుల ఆదాయం చూస్తున్నారు. పేదలకు వర్తించే ఆదాయం మాత్రమే కలిగిన రైతులకు మాత్రమే పీఎం-కిసాన్ అమలు అవుతోంది. ఐదెకరాలలోపు భూములు కలిగిన రైతులు ఆధార్ కార్డు, రేషన్ కార్డులను అధికారులకు ఇవ్వాల్సి ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో 25 లక్షల మంది రైతుల పేర్లు ఈ పథకం కింద ఇప్పటి వరకు నమోదు అయ్యాయని అధికార వర్గాలు వెల్లడించాయి.
తెలంగాణ ప్రభుత్వం 2018-19 సంవత్సరానికి రైతుబంధు కింద 12 వేల రూపాయలు విడుదల చేసింది. ఒక రైతుకు ఒక ఎకరానికి నాలుగు వేల రూపాయల చొప్పున ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని వేల రూపాయలు లెక్కకట్టి బ్యాంకుల్లో జమ చేశారు. ఒక రైతుకు 10 ఎకరాలు ఉంటే ఒక సీజన్‌కు 40 వేల రూపాయలు, రెండు సీజన్లకు కలిపి 80 వేల రూపాయలు లభిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు అమలు చేస్తుండటంతో, పీఎం-కిసాన్ పథకం ద్వారా తమ అకౌంట్లలో జమ అవుతున్న డబ్బు కూడా రాష్ట్ర ప్రభుత్వమే వేస్తుందన్న భావనలో రైతులు ఉన్నారు. ఇతర రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వ పథకం పీఎం-కిసాన్ మాత్రమే అమలు అవుతుండటంతో కేంద్రానికి, బీజేపీకి పేరు వస్తోంది. తెలంగాణలో పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంది.