అంతర్జాతీయం

సౌర వ్యవస్థలో నవగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధారాలతో సహా కనుగొన్న కాలిఫోర్నియా శాస్తజ్ఞ్రులు

లాస్ ఏంజెలిస్, జనవరి 21: సౌర వ్యవస్థ అనగానే మనకు గుర్తుకొచ్చేది సూర్యుడు, దాని చుట్టూ తిరుగుతున్న ఎనిమిది గ్రహాలు. శాస్ర్తియ పరిశోధనల్లో ఇప్పటి వరకు తేలింది ఇదే. కాని, కొంతకాలం ఆగితే మన సౌర వ్యవస్థలో సూర్యుని చుట్టూ తొమ్మిది గ్రహాలు తిరుగుతున్నాయని పాఠ్యాంశాల్లో చదువుకుంటాం. అవును, మన సౌర వ్యవస్థలో తొమ్మిదో గ్రహం చేరే అవకాశం ఉంది. ఈ తొమ్మిదో గ్రహం ద్రవ్యరాశి భూమి ద్రవ్యరాశికన్నా పదింతలు ఎక్కువగా ఉందని, ఇది సూర్యుని చుట్టూ ఒకసారి తిరగడానికి 20వేల సంవత్సరాల వరకు పడుతుందని శాస్తజ్ఞ్రులు తాజాగా తేల్చారు. ఈ తొమ్మిదో గ్రహం సూర్యుని నుంచినెప్ట్యూన్ ఉన్న దూరంకన్నా సుమారు 20 రెట్ల దూరంలో ఉంది. ఇది సూర్యుని చుట్టూ ఒకసారి తిరగడానికి 10 వేల సంవత్సరాల నుంచి 20 వేల సంవత్సరాల వరకు పడుతుందని పరిశోధకులు చెప్పారు. అమెరికాలోని కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజికి చెందిన పరిశోధకులు కొన్‌స్టాన్‌టిన్ బాటిజిన్, మైక్ బ్రౌన్ మేథమెటికల్ మోడలింగ్, కంప్యూటర్ సిములేషన్స్ ద్వారా ఈ కొత్త గ్రహం ఉన్నట్లు కనుగొన్నారు. అయితే వారు దీనిని నేరుగా చూడలేదు. ‘ప్రాచీన కాలం నుంచి కేవలం రెండు నిజమైన గ్రహాలను మాత్రమే కనుగొనడం జరిగింది. ఇది మూడోది అవుతుంది’ అని బ్రౌన్ చెప్పారు. సౌర వ్యవస్థలో తొమ్మిదో గ్రహంగా చేరుతుందని భావిస్తున్న ఈ గ్రహ ద్రవ్యరాశి ప్లూటో ద్రవ్యరాశికన్నా అయిదు వేల రెట్లు ఎక్కువ ఉందని తెలిపారు. ఒక గ్రహంగా పరిగణించడానికి సరిపడ ద్రవ్యరాశి ఉంది కాబట్టి ఇది నిజమైన గ్రహమేనన్న విషయంలో చర్చకు తావేలేదన్నారు. మరుగుజ్జు గ్రహాలుగా మనకు తెలిసిన చిన్న వస్తువులకు భిన్నంగా ఈ తొమ్మిదో గ్రహం తన చుట్టుపక్కల గల పరిసరాలపై గురుత్వాకర్షణ బలాన్ని కలిగి ఉందని వివరించారు. నెప్ట్యూన్‌కు అవతల కూపర్ బెల్ట్‌గా పిలుస్తున్న చోట ఉన్న మంచు వస్తువులు, శిథిలాల క్షేత్రానికి సంబంధించి ఇప్పటి వరకు అంతుబట్టని ఎన్నో అంశాలను అవగాహన చోసుకోవడానికి ఈ తొమ్మిదో గ్రహం దోహదపడుతుందని పరిశోధకులు పేర్కొంటున్నారు. మన సౌర వ్యవస్థలోని గ్రహాల సంఖ్య గురించి మనకు అసంపూర్ణంగానే తెలుసనే దానికి గత 150 ఏళ్లలో తొలిసారి గట్టి ఆధారం దొరికింది’ అని బాటిజిన్ పేర్కొన్నారు.