అక్షర

సేవా వ్యాపకాలు.. సజీవ జ్ఞాపకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జ్ఞాపకాల్లో...మన జానమద్ది
గౌరవ సంపాదకులు ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి,
విద్వాన్ కట్టా నరిసింహులు,
సంపాదకులు: కొండూరు జనార్దనరాజు;
సహ సంపాదకులు: యలమర్తి మధుసూదన, డా.మూల మల్లికార్జునరెడ్డి
104 పుటలు, వెల: రు.150;
ప్రతులకు: జానమద్ది విజయభాస్కర్,
1/1845, గాంధీనగర్, కడప-516004

తెలుగు భాషా సాహిత్యాల ఉద్ధారకుడు, కారణ జన్ముడు సి.పి.బ్రౌను. ఆయన సాహిత్య సేవా కార్యస్థానాలలో కడప అత్యంత ప్రధానమైనది. ఎందువల్లనంటే బ్రౌను దొరగారు ఒక పండిత మండలిని అక్కడ ఏర్పాటుచేసి తెలుగు సాహితీ యజ్ఞాన్ని నిర్వర్తించారు. ఆరుద్ర బంగోరె కడపకు వచ్చినప్పుడు జానమద్ది హనుమచ్ఛాస్ర్తీ వారితో చర్చించి బ్రౌను సాహితీ యజ్ఞ స్థలాన్ని నిర్ధారించారు. బ్రౌను బంగళా శిథిలాల స్థల యజమాని సి.ఆర్.కృష్ణస్వామికి కలెక్టర్‌తో చెప్పించి 20 సెంట్ల స్థలాన్ని విరాళంగా రాబట్టి బ్రౌను స్మారక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసారు.
ఆరుద్ర, బంగోరె, కొత్తపల్లి, మంగమ్మ మరి కొందరు బ్రౌను సాహితీ వౌలిక పరిశోధకులయ్యారు. జానమద్దివారూ బ్రౌనుపై స్ఫూర్తిమంత గ్రంథం వ్రాశారు.
కానీ బ్రౌనుకు అప్పుపడ్డ తెలుగువారి ఋణ బాధను కడపలోని సి.పి.బ్రౌను స్మారక గ్రంథాలయం పెట్టి చాలామట్టుకు తీర్చడానికి కారణ ప్రతినిధి అయినవారు జానమద్ది హనుమచ్ఛాస్ర్తీగారు మాత్రమే. బ్రౌను శాస్ర్తీగా ఆయన సుపరిచితులు.
ఆయనకు ఇతర సేవా రంగాలూ ఉన్నాయి. గ్రంథాలయ రంగం, జీవిత చరిత్ర రచనా వ్యాసంగం, కన్నడాంధ్ర అనువాద రచనా పార్శ్వం, స్థల చరిత్రాభిమానం, సాహిత్య సంస్థల్లో సంచలనాత్మక పాత్ర నిర్వహణం, స్థాయిగల సాహిత్య సాంస్కృతిక సభల నిర్వహణం, పరిశోధక సహాయక సేవలు, గాడిచర్ల స్ఫూర్తితో వయోజన విద్యారంగం సేవలు, ఇలా మరికొన్ని ఒక సంవత్సరం తక్కువగా తొంభై ఏళ్ల జీవితంలో డెబ్బై ఏళ్ల సామాజిక సేవలుండడం ఆషామాషీ కాదు. ఇన్ని సేవా వ్యాపకాలున్న జానమద్ది వారిని గురించిన పెద్దల మిత్రుల జ్ఞాపకాల కలనేతలూ కలబోతలూ కలిసి ఈ ‘జ్ఞాపకాల్లో...మన జానమద్ది గ్రంథం.
జానమద్దివారు కాలధర్మం చెంది ఒక సంవత్సరం ఇంకా కాకముందే కడపవాసులు ఆయనపై కృతజ్ఞతతో ప్రేమతో ఇలా ఒక స్మరణీయ సంచికను తెచ్చారంటే ఆ నగర సాంస్కృతిక వారసత్వ పరిమళం అటువంటిది కదా అని ఆనందం కలుగుతోంది.
ఈ సంచికలో ఆధార్ సిన్హా రాసిన ‘విజిట్ టూ ఏ లైట్ హౌస్-హూజ్ కీపర్ హేజ్ గాన్ ఎవే’ ఆంగ్ల వ్యాసం కళ్లు చెమర్చేలా ఉంది. జానమద్ది కుమార్తె స్వర్ణలత నాన్నంటే కవితలో ఇన్ని భావవాచకాలు నామవాచకాలైతే/ఇన్ని నామాలకు ఏకైక రూపమిస్తే..నానే్న కదా’ అనడం సత్యప్రకటన అయింది.
డెభ్బై మూడురచనల్లో సేవా భాగస్వాములవీ, అధికారులవీ, స్ఫూర్తి పొందిన వారివీ సాహితీ ప్రముఖులవీ, అభిమానులవీ ఉన్నాయి. జానమద్ది బహుముఖ కాంతులు ఈ సంచికనుంచి వెల్లివిరుస్తున్నాయి. సేవా నిబద్ధ బుద్ధి జానమద్ది అమరులని దీనిలోని రచనలు ఒక్క గొంతుతో ధ్వనిస్తాయి.

-సన్నిధానం నరసింహ శర్మ