మెయిన్ ఫీచర్

సైలెంట్ కిల్లర్స్.. యాంటీ బయాటిక్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గకుండా చూసుకోవాలి. ఇందుకోసం సమతుల ఆహారం తీసుకుంటే ఎంతో మంచిది. విటమిన్లు అన్నీ అందేలా పండ్లు, మొలకెత్తిన విత్తనాలు, కాయగూరలు తదితర వాటిని తీసుకుంటే వ్యాధుల బారిన పడకుండా ఉండగలుగుతాం. కొంతమంది నాలుగు బత్తాయి పళ్లు తీసుకుని మళ్లీ వారం రోజుల వరకు పండ్లు జోలికి వెళ్లారు. కాని సీజనల్‌గా, చౌకగా లభించే పళ్లను ప్రతిరోజూ తీసుకుంటే జబ్బులు మన దరిచేరవు.

‘‘్ఫలానా ఊరు బస్ రావటానికి ఎంత సమయం పడుతుంది...’’
‘‘ఓ అరగంట..’
‘‘అమ్మో అరగంట వెయిట్ చేయటమా! అంత ఓపిక లేదు బాబూ...’’అనేసి ఏ ఆటోనో, లిఫ్టో పట్టేస్తారు. స్పీడు యుగంలో గంటల తరబడి వెయిటింగ్‌లంటే ఓపిక నశించే మాట నిజమే.
కాని ఆరోగ్యం, మందుల వాడకం విషయంలో స్పీడుకు కాస్తంత బ్రేక్ వేయాల్సిందే.. ముఖ్యంగా యాంటి బయాటిక్స్ వాడకం విషయంలో.. పిల్లలకైనా, పెద్దలకైనా కొద్దిపాటి అనారోగ్యం వచ్చిందంటే వీలైనంత త్వరగా తగ్గిపోవాలని ఆరాటంతో యాంటి బయాటిక్స్‌ని ఆశ్రయించే ధోరణి మన దేశ ప్రజలకు ఎక్కువట. గ్రామీణ ప్రాంతాలలో విరివిగా వాడుతున్నారు. శరీరరంలో ఉండే వ్యాధి నిరోధక శక్తిని హరించే ఈ మందులు సైలెంట్ కిల్లర్స్‌గా పనిచేస్తాయ. జీవితాంతం ప్రతి వ్యక్తి తాను సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాడు. ముదిమి వయసులోనూ మరొకరితో పనిచేయించుకోకుండా చలాకీగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకోవటంలో తప్పులేదు. అందుకు శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గకుండా చూసుకోవాలి. ఇందుకోసం సమతుల ఆహారం తీసుకుంటే ఎంతో మంచిది. విటమిన్లు అన్నీ అందేలా పండ్లు, మొలకెత్తిన విత్తనాలు, కాయగూరలు తదితర వాటిని తీసుకుంటే వ్యాధుల బారిన పడకుండా ఉండగలుగుతాం. కొంతమంది నాలుగు బత్తాయి పళ్లు తీసుకుని మళ్లీ వారం రోజుల వరకు పండ్లు జోలికి వెళ్లారు. కాని సీజనల్‌గా, చౌకగా లభించే పళ్లను ప్రతిరోజూ తీసుకుంటే జబ్బులు మన దరిచేరవు.
అంతా తమకు తెలుసునన్న అత్యుత్సాహంకొద్దీ వైద్యుల ప్రమేయం లేకుండా వాడేవారూ కోకొల్లలు.. ఎక్కువ కాలంపాటు చీటికిమాటికి యాంటి బయాటిక్స్‌ను అసంబద్ధంగా వాడటంవల్ల డ్రగ్ రెసిస్టెంట్ బాక్టీరియా పెరిగిపోతుంది. శారీరక కణాల వెలుపల జీవించలేని వైరస్ ఆరోగ్యవంతమైన కణాల్ని ఆక్రమించటం ద్వారా శరీరంలో అనారోగ్యం చోటుచేసుకుంటుంది.
సాధారణంగా వచ్చే జబులు, దగ్గు, థ్రోట్ ఇన్‌ఫెక్షన్స్, బ్రోంఖయిటిస్, ఇయర్ ఇన్‌ఫెక్షన్స్ వంటి వాటికి వైరస్ మూలం. వీటికి యాంటి బయాటిక్స్ వల్ల అంత ఫలితం వుండదు. డాక్టర్‌ని సంప్రదించటం, ఉపశమనంకోసం గృహచికిత్సలు అనుసరించటం మంచిది.
సులువుగా లొంగే కొన్ని ఇన్‌ఫెక్షన్లు సైతం యాంటి బయాటిక్స్ ఫెయిలైనపుడు మొండికేస్తాయి. అనారోగ్యం రోజుల తరబడి కొనసాగుతుంది. ఈ కారణంగా ఖరీదైన, టాక్సిక్ మందుల వినియోగం పెరుగుతుంది.
యాంటి బయాటిక్స్ వాడకం తప్పనప్పుడు ప్రయోజనకరమైన వాటిని మాత్రమే ఎంచుకోవాలి. వ్యాధి ఒకటే అయినా అందరికి ఒకే రకం మందులు పనిచేస్తాయనే రూల్ లేదు. ఎప్పుడో అనారోగ్యం కలుగుతుందని యాంటి బయాటిక్స్‌ని ఎడాపెడా కొనేయటం సరికాదు. వైద్యులు చెప్పిన కోర్స్ పూర్తయ్యాక ఇంకా మిగిలుంటే వాటిని డిస్పోజ్ చేయటమే ఉత్తమం. కోర్స్ పూర్తవకుండానే మందుల వాడకాన్ని మధ్యలో మానేస్తే శరీరంలో బాక్టీరియా కొంత మిగిలిపోయి ఇన్‌ఫెక్షన్ మళ్లీ తిరగబెట్టే అవకాశం వుంది. కనుక డాక్టర్ చెప్పిన ప్రకారం మందులు పూర్తయ్యేవరకు వాడాలి. అలాగే చికిత్సలో జాప్యం జరుగకుండా చర్యలు పాటించాలి. లేదంటే బాక్టీరియా మరింత వృద్ధి జరిగి వ్యాధి మొండికేసే ప్రమాదం వుంది.

- పి.నాగలక్ష్మి