శ్రీకాకుళం

పాఠ్యాంశంగా ఫూలే జీవిత చరిత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, ఏప్రిల్ 11: సమాజ సేవకు సంస్కరణలు అమలుకు కృషి చేసిన జ్యోతిరావు ఫూలే జీవిత చరిత్రను భావితరాలకు తెలియజేసేలా విద్యార్థులకు పాఠ్యాంశంగా చేర్చాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ విప్ కూన రవికుమార్ పేర్కొన్నారు. స్థానిక అంబేద్కర్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన జ్యోతిరావు ఫూలే 190వ జన్మదిన వేడుకలకు ముఖ్యఅతిథిగా పాల్గొని, మాట్లాడారు. ఫూలే జీవిత చరిత్ర ఒక పాఠ్యాంశంగా చేర్చాల్సిన అవసరం ఉందన్నారు. బడుగు బలహీన వర్గాలకు పూలే సేవలు వివరించాల్సిన అవసరం ఉందన్నారు.
రాష్ట్రంలో బిసిల సంక్షేమం కోసం సబ్‌ప్లాన్ రూపొందించిన ఘనత సిఎం చంద్రబాబుదే అని తెలిపారు. రూ.370 కోట్లు బిసిల ఆర్థికాభివృద్ధి కోసం బడ్జెట్‌లో ప్రభుత్వం కేటాయించినట్టు గుర్తు చేశారు. బిసిల కోసం చేపడుతున్న పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడానికి జిల్లాలోగల సంఘ నాయకులు కృషి చేయాలన్నారు. జిల్లాలో బిసి కులస్థులు ఎక్కువగా ఉన్నట్టు తెలిపారు. జనాభా ప్రాతిపదికన జిల్లాలకు బడ్జెట్ కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరినట్టు పేర్కొన్నారు. ఈ ఏడాది రాష్ట్రంలో ఆరు జిల్లాల్లో జ్యోతిరావు ఫూలే పేరున కమ్యూనిటీ భవనాలు నిర్మించడానికి ప్రభుత్వ నిర్ణయించినట్టు వెల్లడించారు. ఒక్కొ భవనానికి రూ. 5 కోట్లు నిధులు కేటాయిస్తున్నట్టు వివరించారు. బిసి విద్యార్థులకు కార్పోరేట్ స్థాయి విద్యను అందించడానికి వసతిగృహాలను గురుకుల పాఠశాలలుగా మార్చనున్నట్టు తెలిపారు. ఎంపి రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ విద్యతోనే అభివృద్ధి సాధ్యం అవుతుందని మహిళలందరూ విద్యావంతులు కావాలన్నదే ఫూలే ఆశయమన్నారు. దేశంలో 54శాతం బిసిలు ఉన్నారని దీనిపై ఒక కమిషనర్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెల్లనున్నట్టు వివరించారు. కలెక్టర్ లక్ష్మీనృసింహం మాట్లాడుతూ బిసిల అభివృద్ధికి సంబంధించి జిల్లాలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వ పథకాలపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాల్సిన సహకార సంఘాలపై ఉందన్నారు. ఈ సమావేశంలో జెడ్‌పి చైర్ పర్సన్ చౌదరి ధనలక్ష్మి, ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, టిడిపి జిల్లా అధ్యక్షురాలు గౌతు శిరీష, డిసివో శ్రీహరి, సాంఘీక సంక్షేమాధికారి ధనుంజయరావు తదితరులు ఉన్నారు.

దళితుల ఆరాధ్యుడు జ్యోతిరావు ఫూలే
శ్రీకాకుళం(రూరల్), ఏప్రిల్ 11: దళితుల ఆరాధ్యుడు జ్యోతిరావుఫూలే అని భారతీయ జపతాపార్టీ రాష్ట్ర కార్యదర్శి పైడి వేణుగోపాలం అన్నారు. బిజెపి పట్టణ శాఖ ఆధ్వర్యంలో సోమవారం నగర కార్యాలయంలో మహాత్మజ్యోతిరావు ఫూలే 190వ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1827 ఏప్రిల్ 11న జన్మించిన జ్యోతిరావు ఫూలే దళితుల అణచివేతకు, దోపిడీకి, కులవివక్షతకు వ్యతిరేకంగా పోరాడిన ధీరుడని అన్నారు. అనగారిన వర్గాలకు విద్య అవసరాన్ని గుర్తించిన తొలి వ్యక్తి అన్నారు. ఫూలే భార్య సావిత్రిభాయిని దేశంలో తొలి మహిళా ఉపాధ్యాయునిగా చేసి బాలికల కోసం ప్రత్యేక పాఠశాలను ఏర్పాటు చేసిన సంఘ సంస్కర్త అని కొనియాడారు. నగర అధ్యక్షుడు చల్లా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఫూలే రాసిన గులాం గిరి పుస్తకంలో కులవ్యవస్థ, బ్రాహ్మణ పురోహిత వర్గం, ఇతర కులాలపై చేస్తున్న ఆధిపత్యంపై వివరించారన్నారు. సేద్యగాని చర్నాకోల్ పుస్తకంలో రైతుల అవస్థలపై విశదీకరించారన్నారు. సత్యసోదక్ సమాజ సంస్థను స్థాపించారని తెలిపారు. జ్యోతిరావుఫూలేను గురువుగా డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ప్రకటించుకున్నారని తెలిపారు. బిజెపి దళితుల అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో దుప్పల రవీంద్రబాబు, సంపతిరావు నాగేశ్వరరావు, రెడ్డి నారాయణరావు, ఉత్తరావల్లి మోహనరావు, కద్దాల ఈశ్వరమ్మ, సంపతిరావు వెంకటరమణమూర్తి, పైడి సత్యం, వడ్డి మురళీమోహన్, వి.సత్యన్నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.

అయోడిన్ ఉప్పునే ఉపయోగించాలి
శ్రీకాకుళం(టౌన్), ఏప్రిల్ 11: ప్రజల్లో అయోడిన్ లోపం ఏర్పడితే గాయిటర్ వ్యాధి బారిన పడే అవకాశం ఉందని, ప్రజలు అయోడిన్ కలిగిన ఉప్పునే వాడాలని భారత ప్రభుత్వ నోడల్ అధికారి రోనుమాథుర్ పిలుపునిచ్చారు. సోమవారం ఈ మేరకు స్థానిక జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయ సమావేశ మందిరంలో ఆయన జిల్లా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు, హెల్త్ సూపర్లవైజర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గాయిటర్ వ్యాధి అధికంగా స్ర్తిలు, పిల్లల్లో ఉంటున్నట్టు భారత ప్రభుత్వ వైద్య మండలి గుర్తించిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్‌లో సర్వే నిర్వహించగా 17 శాతం మంది అయోడిన్ లోపం కలిగివున్నట్టు తేలిందన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఒక సర్వే నిర్వహించి ఎనిమిది శాతం మంది మాత్రమే ఈ వ్యాధితో బాధపడుతున్నట్టు పేర్కొన్నట్టు చెప్పారు. జిల్లాలో సుమారు 30 గ్రామాల్లో ఒక్కో గ్రామానికి 90 మంది నుండి శాంపిల్స్ తీసి వారు వాడే ఉప్పలో అయోడిన్ శాతాన్ని లెక్కగట్టాలని ఆయన కోరారు. తద్వారా అయోడిన్ లోపంతో బాధపడుతున్న వారికి సరైన చికిత్సను అందించడం ద్వారా గాయిటర్ వ్యాధినుండి కాపాడవచ్చని తెలిపారు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ సాంకేతిక నిపుణులు నాగరాజ్, కన్సల్టెంటు రమేష్ పాల్గొన్నారు.