క్రీడాభూమి

మహిళా బాక్సర్లకూ గుర్బాక్స్ శిక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 7: సుమారు మూడు దశాబ్దాలుగా పురుషుల బాక్సింగ్ రంగానికి వివిధ హోదాల్లో సేవలు అందిస్తూ, ప్రస్తుతం కోచ్‌గా ఉన్న గుర్బాక్స్ సింగ్ సంధూ ఇకపై మహిళలకు కూడా కోచ్‌గా వ్యవహరిస్తాడు. ఇటీవలే ఏర్పడిన భారత బాక్సింగ్ సమాఖ్య (బిఎఫ్‌ఐ) బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఈ విషయాన్ని ధ్రువీకరించింది. అసిస్టెంట్ కోచ్‌లు, సపోర్టింగ్ స్ట్ఫాతో కూడిన 14 సభ్యుల బృందం గుర్బాక్స్‌కు సహకరిస్తుందని తెలిపింది. పురుషు విభాగంలో మహమ్మద్ అలీ కమార్, జైదేవ్ బిస్త్, భాస్కర్ భట్, సాగర్ మల్ ధయాల్, జగదీశ్ సింగ్, ఛోటే లాల్ యాదవ్, ఇన్‌కోమ్ అసిస్టెంట్ కోచ్‌లుగా ఉంటారని బిఎఫ్‌ఐ తెలిపింది. అదే విధంగా మహిళల విభాగంలో ఉష, రేణు గోరా, సంధ్యా గురుంగ్, దీపా చాను, మందాకినీ చాను, భారతి, అకోక్ అసిస్టెంట్ కోచ్‌లుగా వ్యవహరిస్తారని పేర్కొంది.