క్రీడాభూమి

కీపర్‌గానే పార్థీవ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ టెస్టు మ్యాచ్ ఆడిన పార్థీవ్ పటేల్ ఇంగ్లాండ్‌తో గురువారం నుంచి మొదలయ్యే నాలుగో టెస్టులో కీపింగ్‌కు మాత్రమే పరిమితమయ్యే అవకాశాలున్నాయి. మహేంద్ర సింగ్ ధోనీ టెస్టులకు గుడ్‌బై చెప్పిన తర్వాత రెగ్యులర్ వికెట్‌కీపర్‌గా తన స్థానాన్ని పదిలం చేసుకున్న వృద్ధిమాన్ సాహా గాయపడడంతో పార్థీవ్ జట్టులోకి వచ్చాడు. అయితే, లోకేష్ రాహుల్ కూడా ఫిట్నెస్ సమస్యలను ఎదుర్కొంటున్న కారణంగా మొహాలీ టెస్టులో అతను ఓపెనర్‌గానూ సేవలు అందించాడు. సుదీర్ఘ విరామం తర్వాత టెస్టుల్లోకి అడుగుపెట్టినప్పటికీ, మొదటి ఇన్నింగ్స్‌లో 42, రెండో ఇన్నింగ్స్‌లో 67 చొప్పున పరుగులు చేసి అందరినీ మెప్పించాడు. కాగా, రాహుల్ గాయం నుంచి పూర్తిగా కోలుకోవడంతో, అతను నాలుగో టెస్టు ఆడతాడని సమాచారం. అదే జరిగితే, పార్థీవ్‌కు ద్విపాత్రాభినయం చేయాల్సిన అవసరం ఉండదు. అతను మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు దిగుతాడు.