ఆంధ్రప్రదేశ్‌

ఎర్ర స్మగ్లర్ సంగీత చటర్జీకి రిమాండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాకాల, మార్చి 29: కోల్‌కత్తాకు చెందిన ఎర్రచందనం స్మగ్లర్, లేడీ డాన్ సంగీత చటర్జీని అరెస్టు చేసిన చిత్తూరు పోలీసులు బుధవారం పాకాల కోర్టులో హాజరుపరిచారు. చిత్తూరు నుంచి డి ఎస్పీ లక్ష్మీనాయుడు ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు మధ్య పాకాలలోని న్యాయమూర్తి దేవేంద్రరెడ్డి నివాసం వద్దకు తీసుకువచ్చారు. అనంతరం ఆమెను న్యాయమూర్తి ముందు హాజరుపరచగా 14రోజుల పాటు రిమాండ్‌ను విధించారు. ఈసందర్భంగా కేసుకు సంబంధించిన పూర్వపరాల నకలు కాపీని న్యాయమూర్తి సంగీత బెనర్జీకి అందజేశారు. అనంతరం పోలీస్ బందోబస్తు మధ్య ఆమెను చిత్తూరు సబ్ జైలుకు తరలించారు. సి ఐ రామలింగయ్య, ఎస్‌ఐలు వంశీధర్, క్రిష్ణయ్య, భాస్కరన్‌లు బందోబస్తు నిర్వహించారు. కాగా ఎర్రచందనం స్మగ్లర్ సంగీత చటర్జీని చూడాలన్న ఆసక్తితో స్థానికులు కోర్టు వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు.

చిత్రం.. ఎర్రచందనం స్మగ్లర్ సంగీత చటర్జీ