సరైనోడే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘సరైనోడు’ చిత్రం ఈమధ్యే విడుదలై ఘనవిజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా హిందీలో డబ్ అయి జెట్ స్పీడ్‌తో దూసుకుపోతోంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రకుల్‌ప్రీత్‌సింగ్, కేథరిన్ ట్రెసా హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా హిందీ వెర్షన్ సోనీ టీవీలో ప్రసారం చేసింది. అదే రోజు యూ ట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన 24 గంటల్లో 6.1 మిలియన్ వ్యూస్, నాలుగు రోజుల్లో 16 మిలియన్ల వ్యూస్‌తో క్రేజ్ తెచ్చుకుంది. ముఖ్యంగా బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్ నటిస్తున్న ‘ట్యూబ్‌లైట్’ సినిమా రికార్డుల్ని బద్దలు కొట్టడం విశేషం. ఇంతవరకూ యూట్యూబ్‌లో ఏ భారతీయ సినిమా నమోదు చేయని రికార్డుల్ని సరైనోడు క్రియేట్ చేయడం విశేషం. మాస్, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా టాప్ 20 లిస్ట్‌లో నిలిచాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ నటిస్తున్న దువ్వాడ జగన్నాధం సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఈ సినిమాకు సంబంధించి బిజినెస్ వర్గాల్లో సంచలనం రేపుతోందట. జూన్ 23న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.