మంచి మాట

సర్వార్థ సాధకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరకోశం అనుసరించి ‘పుష్యయుక్తా పౌర్ణమాసీ పౌషీ మాసేతు యత్రసా! నామ్నాస పౌతిః’ పుష్యమీ నక్షత్రంతో కూడిన పౌర్ణమిగల మాసం పుష్యమాసం. ఈ మాసానికి పుష్యా అని, పౌషః అను పేర్లు కూడా ఉన్నాయి. ఈ మాసానికి ‘తిష్య’ అనే మరో పేరుంది. పౌషే తైష సహాస్యౌద్వౌ’ పుష్యమీ నక్షత్రానికి తిష్య అనే పేరుండడంవలన తైషమాసంగా పిలువబడుతున్నది. ‘తిష్యః’ అంటే బలము. ఆ విధంగా, పుష్య, తిష్య సహస్యము కారణంగా పుష్యమాసం బలవత్తరమైనది.
పుష్యమీ నక్షత్రం కార్యసిద్ధిని కలిగిస్తుంది. పుష్ట, పుష్టి, పోష అనునవి పుష్యమి నక్షత్రానికి సమానార్థకాలుగా గ్రహించవచ్చు. ఈ అర్థాన్ని ఋగ్వేదము, సాయనాచార్యులవారి భాష్యము ధృవీకరిస్తున్నాయి. పుష్యమీ నక్షత్రం సిద్ధి ప్రదాయకం. తిష్యం అంటే మంగళప్రదమైనది. అలా పుష్యమీ నక్షత్రం మరో పేరైన తిష్య నక్షత్రంతో కూడిన పుష్యమాసం సర్వార్థ సాధకమైనదీ, మంగళకరమైనదీను.
పుష్యమాసం హేమంత ఋతువులో రెండవది. ఈ మాసంలో సూర్యుడు ధనూరాశి నుండి మకరరాశిలోనికి ప్రవేశిస్తాడు.
మార్గశిర, పుష్యమాసములు రెండూ శీతము (చలి)తో లోకమును వణికిస్తాయి. పుష్యమాసంలో చలి విపరీతంగానే వుంటుంది. అయితే మకర సంక్రమణంతో కొంత వెసులుబాటు కనిపిస్తుంది. రవి ధనుసంక్రమణం పూర్తిచేసుకుని మకరరాశిలో ప్రవేశించడంతో దక్షిణాయనం పూర్తయి ఉత్తరాయణం మొదలవుతుంది. రాత్రి పొడవును పెంచి పగటి సమయాన్ని తగ్గించడం దక్షిణాయన స్వభావం. కాగా, పగటి నిడివిని పెంచి రాత్రి నిడివిని తగ్గించడం ఉత్తరాయణ లక్ష్యం. ఈ విధంగా ఉత్తరాయణం పగటి (వెలుగు) ప్రాభవానికి నిదర్శనం. వెలుగు జీవనయానానికి ప్రాణం. ఆధ్యాత్మ ప్రగతికి, జీవన గతికి మార్గం. ఇలా సమస్త జగతికి వెలుగులు విరజిమ్మే మకర సంక్రాంతి ఉత్తరాయణ ఆరంభానికి ఆలవాలమైనది పుష్యమాసం.
శ్రీ ఆదిశంకరాచార్యుల తరువాత విధర్మీయుల పాలనలో శతాబ్దుల కాలం భారతీయ సనాతన ధర్మాన్ని కాలరాస్తున్న కాలంలో వివేకానందుడు అవతరించి హిందూ ధర్మ ప్రాశస్త్యాన్ని పునరుజ్జీవితం చేసిన మహనీయుడు. వివేకానందుని జన్మదినం ఈ పుష్యమాసంలోనే దేశ ప్రజలంతా పర్వదినంగా పాటిస్తారు.
ధనూరాశి నుండి మకరరాశిలోనికి రవి సంక్రమణ దినమే మకర సంక్రాంతి. ఈ రోజు యావద్భారతదేశం ముఖ్యమైన పండుగగా జరుపుకుంటారు. తెలుగు ప్రాంతంలో సంక్రాంతి మూడు రోజుల పండుగ.
గోదాదేవి శ్రీరంగనాథుని చేపట్టిన రోజు భోగి. ఆ జగజ్జనని, జగన్నాయకుని చేరి భోగములందిన రోజు. అన్ని వైష్ణ్వాలయాల్లో ఈ రోజున గోదా రంగనాధుల కల్యాణం వైభవోపేతంగా ప్రతిఏటా నిర్వహిస్తారు.
మకర సంక్రాంతి న పితృయజ్ఞం విధిగా చెప్పబడింది.
పుష్యమాసంలోనే ఈ జనవరి 23వ తేదీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మతిథి. ప్రభుత్వంతోపాటు ప్రజలంతా ఆ మహానేతకు నివాళులర్పిస్తారు. కర్ణాటక సంగీత ప్రపంచమంతా తిరువాయూర్ (తమిళనాడు)లో స్వరాభిషేకంతో నివాళులర్పిస్తారు. తెలుగుదేశంలో వివిధ ప్రాంతాలలో సంగీత సభలు ఆరాధనోత్సవాలు నిర్వహించి తమ భక్తి ప్రపత్తులు తెలుపుకుంటారు.
ఇలా పుష్యమాసమూ సర్వసిద్ధి ప్రదాయకంగాను మంగళప్రదాయకంగాను జరుపుకోవడం భారతదేశంలో అనాదిగా వస్తున్నదే. క్షణం కూడా ఆలోచన లేకుండా ఉండే మనస్తత్వం ఉన్న మనిషి ప్రతి మాసానే్న కాదు ప్రతి క్షణాన్ని అతి పవిత్రమైనదిగాను భావించి మంచి పనులు చేయడానికి కాలయాపన చేయకుండా ఉండేందుకే ఈ పండుగలను, పర్వాలను పూర్వులు క్రమపద్ధతిలో పెట్టారని- దానివల్ల మనుష్యులందరూ సౌభాతృత్వంతోను, సామరస్యంగాను, సమబుద్ధితో మెలగాలనే వారి ఆలోచనను మనం సాకారం చేద్దాం.

- ఎ.ఎస్. రావు