AADIVAVRAM - Others

ఆదిత్యుడు... ఆరోగ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యోగాలో సూర్య నమస్కారములకు ప్రత్యేకత ఉంది. ‘సర్వ రోగాలకు ఒకటే మందు - సూర్య నమస్కారములు’ అని నానుడి ఉంది.
1.ప్రణామాసనము
2.ఉత్థిత హస్తాసనము
3.పాద హస్తాసనము
4.శ్వసంచలననాసనము (కుడి)
5.పర్వతాసనము
6.సాష్టాంగ నమస్కారాసనము
7.్భజంగాసనము
8.పర్వతాసనము
9.ఆశ్వసంబల నాసనము (ఎడమ)
10.పాదహస్తాసనము
11.ఉత్థిత హస్తాసనము
12.ప్రణామాసనము
కొన్ని ఆసనాలు రీపిట్ అవుతాయి. అవి 8వ ఆసనము నుండి 12వ ఆసనము వరకు.

24 నిముషాల్లో...

ఆరోగ్యం - సంతోషం - ప్రశాంతత.
యోగా: ఆరోగ్యానికి సోపానం.
సంతోషానికి ఇదో మెట్టు.
ప్రశాంతతకు చివరి మజిలీ.
యోగేన చిత్తస్య పదేనవా చాం
మలం శరీరస్య చ వైద్యకేన/ యోపా కరోత్తం ప్రవరం మునీనాం/
పతంజలిం ప్రాంజలిరా న తోస్మి.
ఎవరు యోగా ద్వారా మానసిక మలినాన్ని తుడిచివేశారో - ఎవరు వ్యాకరణంతో భాషనూ - ఆయుర్వేదం ద్వారా దేహాన్నీ శుద్ధి చేశారో అట్టి మునివర్య
పతంజలి యోగికి ముకుళిత
హస్తాలతో వందనాలు.

ప్రమాణాసనము
ఆసన విధానం - 1.రెండు పాదాలను జతచేసి నిటారుగా నిల్చోవాలి.
2.రెండు చేతులను ప్రక్కలకు చాచి, చేతులను పైకెత్తి అరచేతులు జత చేయాలి.
3.జత చేసిన చేతులను ఛాతీ ముందుకు తీసుకొని నమస్కార ముద్రతో దైవానికి ప్రణామం చేయాలి.
ఉపయోగం
ప్రశాంతత కలుగుతుంది. ఆ కారణంగా ఏకాగ్రత.

పాదహస్తాసనము

ఆసన విధానం: 1.రెండు పాదములు దగ్గరకు చేర్చి నిటారుగా నిల్చోవాలి.
2.రెండు చేతులు ముందుకు చాచాలి.
3.వీలైన ఎక్కువ శ్వాస తీసుకొంటూ, చేతులు పైకెత్తి నడుమును వెనుకకు వంచాలి.
ఉపయోగం:
1.శరీరంలోని కండరాలకు శక్తి
2.జీర్ణశక్తి వృద్ధి.

ఆసన విధానం: 1.నిటారుగా నిలబడి శ్వాస ఎక్కువగా తీసుకోవాలి.
2.తీసుకున్న శ్వాసను బిగబట్టి, శ్వాస వదులుతూ శరీరం ముందుకు వంచాలి.
3.మోకాళ్లు వంచకుండా, నుదుటితో మోకాళ్లు తాకుతూ, అరచేతులను పాదములకు రెండు వైపులా వుంచాలి.
ఉపయోగం: 1.కాళ్లు చేతులకు బలం 2.జీర్ణకోశ వ్యాధులు నయం 3.సన్నని నడుముకు అవకాశం.

సూచన: యోగ నిపుణుల ఆధ్వర్యంలో యోగా చేయాలి.

అశ్వచాలనాసనము
(కుడి)
ఆసన విధానం: 1.మోకాళ్లు వంచి కూర్చొని, ఎడమ కాలిని వెనుకకు చాచాలి.
2.నేలపైన చేతులు పెట్టి, ఛాతిని, ముఖాన్ని పైకి ఎత్తాలి. తల వీలయినంత వరకు వెనక్కి పెడుతూ శ్వాస తీసుకోవాలి.
ఉపయోగం
1.పొట్ట తగ్గి, నాజూగ్గా మారేందుకు దోహదం చేస్తుంది.
2.కాలి కండరాలను శక్తివంతం చేస్తుంది.
3.నాడీ మండల వ్యవస్థని ఉత్తేజపరచగలదు.

పర్వతాసనము
ఆసన విధానం: 1.రెండు కాళ్లు దగ్గరకు చేర్చి, నిశ్చలంగా నిలబడి శ్వాస తీసుకోవాలి.
2.శ్వాస వదులుతూ, కటి భాగాన్ని పైకెత్తి, తలను రెండు చేతు మధ్యకు పోనిచ్చి, అరచేతులతో నేలను తాకాలి. మీ చేతులు, మోకాళ్లు వంచకూడదు.
ఉపయోగం
1.అనవసరపు కొవ్వు కరిగి, నడుము సన్నబడుతుంది.
2.ఉదర సంబంధ వ్యాధులు గలవారికి నివారణకు దోహదం చేస్తుంది.

సాష్టాంగ
నమస్కారాసనము
ఆసన విధానం: 1.శ్వాసను మామూలుగా తీసుకొంటూ, బోర్లా పడుకొని ఛాతిని, మోకాళ్లను నేలకు ఆనించి ఉంచాలి.
2.కటి భాగము మాత్రం కాస్త పైన వుంచాలి.
3.శ్వాసను బంధించి, వదులుతూ ఉంచాలి.
ఉపయోగం..
1.్ఛతి విశాలమవుతుంది.
2.శరీరంలోని చెడు వాయువులు తొలగిపోతాయి.

భుజంగాసనము
ఆసన విధానం: 1.కాలి బొటనవేళ్లు, మడమలను కలిపి, బోర్లా పండుకొని, చుబుకాన్ని నేలకు ఆనించాలి. అరికాళ్లు పైవైపునకు తిరిగి ఉండాలి.
2.మోచేతులను వంచి, అరచేతులతో, ప్రక్కటెముక ప్రక్కన వుంచాలి.
3.అరచేతుల సహాయంతో పాము పడగ ఎత్తినట్లు శరీరాన్ని నెమ్మదిగా పైకెత్తి ఉంచాలి. నాభి భాగం తాకీ తాకనట్లు ఉండాలి. వీలైనంత శ్వాస తీసుకోవాలి.
ఉపయోగం
1.కాళ్లు, మెడ నరములకు బలం
2.పొట్ట తగ్గి, ఛాతి విశాలమవుతుంది.
3.ముఖంలో తేజస్సు
తరువాత ముందు చేసిన కొన్ని ఆసనాలు రీపిట్ చేస్తూ మొదట ఆసన స్థితి ప్రణామాసనము చేరుకోవాలి.

8.పర్వతాసనము.. 9.అశ్వ సంచాలనాసనము (ఈసారి ఎడమవైపు)
10.పాద హస్తాసనము.. 11.ఉత్థిత హస్తాసనము
12.ప్రణామాసనము

-డా.శ్రీనివాస్ మద్దూరు.. 7799110304