ఉత్తరాయణం

విద్యార్థులకు స్కాలర్‌షిప్ వెంటనే ఇవ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన తెలుగు రాష్ట్రాల్లోని లక్షలాది మంది విద్యార్థులు స్కాలర్‌షిప్ రాక ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు విద్యార్థులకు స్కాలర్‌షిప్ సరియైన కాల వ్యవధిలో అందడంలేదు. మైనారిటీ విద్యార్థులు ఆర్థిక భారంతో చదువుకు స్వస్తిచెప్పే పరిస్థితి వస్తోంది. మన తెలంగాణా ముఖ్యమంత్రి జిల్లా అయిన మెదక్‌లో చాలాచోట మైనారిటీలకు స్కాలర్‌షిప్ రావడం లేదు. మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్ ఇస్తామన్న మన కె.సి.ఆర్.గారు రూ.1200 ఉపకార వేతనం ఇవ్వటంలేదు. 6,7,8,9,10 చదువుతున్న విద్యార్థులు ఉపకార వేతనం అందక చాలా ఇబ్బంది పడుతున్నారు. వారికి ఉపకార వేతనంతోపాటు సైకిళ్లు, ఇతర దుస్తులు ప్రభుత్వం సరఫరా చేయాలి.
- ముత్తన్నగారి రాజేందర్‌రెడ్డి, వరంగల్

కాల్‌మనీ
1) పేలెను- కాల్‌మనీ బాంబులు
కాలిన హృదయాలు నలుగగమనించినదై
పాలక బృందము నిలబడి
జాలిని నందించుటాయె! జాగృతులందున్!
2) వడ్డీ చక్కర వడ్డీ
నడ్డి విరుగంగ జేయ- నయవంచనతో
గుడ్డిగ కాగితముల్ గన?
అడ్డంగా నోటులన్ని నన్యాయాలే!
3) అవసరాల కొరకు అప్పులు జేయంగ
ధరలు బెరుగుచుండ? వరలు టెట్లు?
నమ్మినట్టి దొరలు నట్టేట ముంచగ
ఆశ! ఆశయాలు- నాశనంబె!
4) దొంగలవలె దొరబాబులు
అంగనలకు నాశబెట్టి నధికారులుగా
లొంగగ జేసెడి మోసపు
సంగతులీనాడు బెరిగె! సంపదవోలెన్!
- కె.ఈశ్వరప్ప, ఆలూరు
ఖమ్మం కార్పొరేషన్ సిబ్బంది బాధ్యతారాహిత్యం
ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోగల గృహ పన్ను విధించే బిల్లుల విషయంలో ఇంటి యజమాని పేర్లు తప్పుల తడకలుగా ఉన్నాయి. గతంలో మ్యాన్యువల్ బిల్లులను క్రమంగా ఉన్నా వాటిని చూసి కంప్యూటరీకరణ చేయటంలో అలసత్వం వహిస్తూ ఇంటి యజమానులను ఇబ్బందులపాలు చేస్తూ కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటున్నారు. గతంలో కార్పొరేషన్‌కు కట్టిన బిల్లులు రిజిస్టర్‌లో ఉన్నప్పటికీ సక్రమంగా కట్టలేదని ఉన్నాయి. కంప్యూటరీకరణ పేరుతో అనేక తప్పులు దొర్లుతున్నాయి. బిల్లుల విషయంలో ఇంటి నెంబర్ల విషయంలో ఒకటేంటి అన్ని విషయాల్లో ఓటర్ల జాబితా విషయంలో, జనాభా గణాంకాల విషయంలో ఇది సక్రమంగా ఉందని లేదు. ఏదో ఒక లోపంతో కార్పొరేషన్ సిబ్బంది ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. ఇకనైనా తప్పులు దొర్లకుండా చూడాలి.
- ఎ.ఆర్.ఆర్.ఆర్, ఖమ్మం