Others

నమస్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనం నిత్యం పాటించే సంప్రదాయాల్లో ‘నమస్కారం’ ప్రధానమైంది. మనలోని వినయాన్ని చాటుకోవాలంటే ‘నమస్కారా’న్ని అవతలి వారి హృదయాన్ని తాకేలా నమ్రతతో కూడుకొని ఉండాలి. సంప్రదాయంలో ‘నమస్కారం’ అనే మాటకు యోగఫలసిద్ధికి చేసే ప్రణామమనే అర్ధం ఉంది. ప్రణామమంటే ‘నమస్కారమ్’ ప్రణిపాతం అని భగవద్గీత దీనే్న ప్రస్తావించింది. నమస్కారంలో మనిషి నిజాయితీ వ్యక్తవౌతుంది. ‘సర్వదేవ నమస్కారః కేశవం ప్రతిగచ్చతి’ అన్నారు. భక్తితో ఏ దేవుని మదిలో తలచుకొని నమస్కారం చేసినా అది ఆ ఆదినారాయణుడికే చెందుతుంది. అందుకు మనం చేయాల్సింది భక్తిగా నమస్కారం. తల్లిదండ్రులను, ఆచార్యునికి, గురువులకు, అతిథులకు, మిత్రులకు నమస్కరించడం మన భారతీయ సంప్రదాయమైంది. భగవంతుని ముందు తలవంచి నమస్కరించడం నవవిధ భక్తిమార్గాలలో ‘వందనం’ ఒకటి. అంటే భగవంతుని శరణాగతి పొందడం. ‘నమః మహద్భ్యో, నమో యువభ్యో, నమః శిశుభ్యో సర్వేభ్యోనమః’ అని ఋషుల వాక్కు. నమస్కార ప్రక్రియలో పలు రకాలున్నాయి. అష్టాంగయోగంలో యమ-నియమ, ఆసన, ప్రాణాయాన, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధులు ఎనిమిది అంశలు వీటిలో ఆసనమంటే కూర్చునే విధానం, అలాగే నమస్కరించే విధానం కూడా సాష్టాంగ నమస్కార పద్దతిగా చెప్పబడింది. ధార్మిక చైతన్యాన్ని గుర్తించేలా చేసే అద్భుతమైన శక్తి నమస్కారానికి ఉంది.