సబ్ ఫీచర్

సదాస్మరణీయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానవత్వం మచ్చుకైనా లేకుండా పోతుంది. మమతానురాగాలు, మనిషిలో కరవైపోతున్నాయ. ఎక్కడ చూసినా అన్యాయాలు, అక్రమాలు. నేటికాలంలో దోపిడి ఎక్కువైందిబలహీనులను బల వంతులు కొట్టి తింటున్నారు. ఇలా ఎందుకు? జరుగుతోంది. మనిషిలోని భూతదయ కనిపించకుండా పోతోంది. సొంతలాభం కొంత మానుకు పొరుగువాడికి తోడుపడవోయ్ అనే ని నాదం ఇచ్చినవారు మన మధ్యలేరని వారి నినాదానికి తిలోదకాలు ఇచ్చేసినట్టు కని పిస్తున్నారు. కాని ఇక్కడ కూడా పొరుగువారికి పెట్టిందే తినని వారు ఉన్నారు. సాయం చేసేవారు ఉన్నారు. అన్ని భూతాలను అన్ని ప్రాణులన్నింటినీ సమానంగా చూసేవారు నేటి కాలంలో ఉన్నారు. వారి సంఖ్య తగ్గిపోతోంది. ఇలాఎందుకు జరుగుతోంది. ఆధునికత పెరిగింది. ఎక్కడ చూసినా భోగ భాగ్యాలతో తులతూగాలన్న ఆశ కలవాళ్లే కనిపిస్తున్నారు. ఆశే మానవుడిని నిలబెడుతుంది. ఆశే రేపటి కోసం ఆలోచింపచేస్తుంది. అయతే దానికోసం కష్టపడే వాళ్లు ఎంతమంది ఉన్నారు. మనకష్టానికి తగ్గ ఫలితం మనం తినాలి అనుకొనేవారి సంఖ్య తగ్గుముఖం పడుతోంది. అందుకే ప్రకృతి వైపరీత్యాలు జరుగుతున్నాయ. నేటి సమాజంలోని మానవులు సర్వదా తెలివితేటలు కలిగి విద్యావంతులుగా, ధనవంతులుగా భోగభాగ్యాలు అనుభవించు అదృష్టవంతులుగాను తమకు తామే కృత్రిమ స్వర్గం నిర్మించుకుని, మహదానంద పడిపోతున్నారు? కానీ ఇదే సమయంలో కొంతమంది దురదృష్టవంతులుగా, దిక్కులేని వారుగా, అనాధలుగా సంతానం ఉండి కూడా కొందరు వృద్ధ తల్లిదండ్రులు రోడ్లమీద భిక్షగాళ్లుగా, వృద్ధుల ఆశ్రమాలలో కడు దీనావస్థలో పడి కొట్టుమిట్టాడుతున్నారు? ఎందుకు ఇంకా లోతుగా ఆలోచిస్తే- యువత (స్ర్తి, పురుష)ముందుకు పోతున్నామనే భ్రమలో తిరోగమనానికి దారి ఏర్పరుచుకుంటున్నారు. భవిష్యత్తు అంటే ఏమిటో తెలియని- చదువుకున్న మూర్ఖులుగా బ్రతుకుతున్నారు.
వివాహ వ్యవస్థ నవ్వులపాలవుతోంది., అనాధ శిశువులుగా పుట్టిన అభాగ్యులు చెత్తకుండీలలో, ముళ్ల పొదలలో- మురికి కాలువలలో పడి హృదయవిదారకంగా జుగుప్సా పరిస్థితులలో కనబడుతున్నారు.
మానవ సత్సంబంధం ప్రేమ, అనురాగం వుండవలసినచోట కక్షలు, కాఠిన్యాలు, స్వార్ధం పెరిగి ఒకరినొకరు నరుక్కుని చస్తున్నారు. ఇందులో తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు, రక్తసంబంధం వున్న బంధువర్గం అందరిలోను స్వార్ధం పెరిగింది. ఇరుగుపొరుగు ఏమైనా ఫర్వాలేదు, తమకు అన్నీ సుఖాలు వుంటే చాలు. ఈ జడత్వం పట్టుకుని మనిషి మనిషిని చూసి భయపడే స్థితి ప్రపంచమంతటా అలముకొంటోంది. ప్రశాంత వాతావరణంలో అందరం కలిసి కులమతాలు, తారతమ్యాలు లేకుండా మనుషులంతా ఒకటిగా కలిసిమెలిసి ప్రేమానురాగాలు పంచుకుని శాంతి సౌభాగ్యాలతో బ్రతకలేమా? మనిషి ఇలా దిగజారిపోవడానికి మానవజాతిలో ఆధ్యాత్మిక చింతన కొరవడడమే కారణం! మనిషి ఆధ్యాత్మికంగా, భూతదయాపరుడుగా, పరోపకారిగా తమ జన్మను సార్ధకం చేసుకోవడానికి ప్రయత్నించకపోవడమేనని చెప్పాలి. ప్రతి యుగంలో మన పూర్వీకులు- మహాత్ములుగా వెలిగారు. మహర్షులుగా మనకు మార్గదర్శకులైనారు. సమాజాన్ని సక్రమమార్గంలో నడిపించారు. మానవతావాదులుగా వనె్నకెక్కారు. ధర్మాన్ని తు.చ తప్పకుండా నిర్వహించి ధీరులుగా చరిత్రకెక్కారు. ఉమ్మడి కుటుంబాలుగా తరతరాలు శిశువులు దగ్గరనుంచి వృద్ధాప్యం వరకు సుఖశాంతులతో జీవించారు. ఈ అనర్ధాలను ఆపడానికి సమాజంలో గత మానవ విలువలు నెమరేసుకోవాలి. 6వ శతాబ్దంలో జగద్గురువు శ్రీ శంకరాచార్యులు జన్మించి మానవ సమాజాన్ని అద్వైత మత మార్గంలో నడిపించారు. 2వ శతాబ్దంలో ఆచార్య సిద్ధ నాగార్జునుడు జన్మించి మానవతకు అర్థం చెప్పాడు. ఆ తరువాత అనేకమంది పుణ్యపురుషులు జన్మించారు. వారి బోధనలు సమాజానికి మార్గదర్శకాలైనాయి. శ్రీ గురు రాఘవేంద్రస్వామి, పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి, యోగి వేమన, సనారి విశ్వనాథస్వామి, షిరిడి సాయిబాబా, సంతు జ్ఞానేశ్వర్, భక్తతుకారాం, రామదాసు, తులసిదాసు- మరెందరో మహానుభావులు జన్మించి సమాజానికి మార్గదర్శకులైనారు.నేడు మనిషికి కావలసింది, ఆచరించవలసింది ఆధ్యాత్మికంగా దైవధ్యానం కావాలి- ఆచరించాలి, పిన్నలు, పెద్దలు మందిరాలకు వెళ్లాలి. గురువులను ఆశ్రయించాలి? దైవసాధన చేయాలి- జ్ఞానయోగసాధన- వేదపఠన- ఆధ్యాత్మిక చింతన- సత్సంగం అందరు అలవరచుకోవాలి. ఎవరో వస్తారని వారు చెప్పితే ఆచరిద్దామనుకోకుండా మనకై మనం ఏం చేస్తున్నామో ఒక్కసారి పునఃసమీక్షించు కోవాలి. మన వల్ల నలుగురు ఆనందిస్తు న్నారా లేదా అని పరిశీలించుకోవాలి. ఒక్కరికి నష్టం వచ్చే పని యైనా దాన్ని మానుకోవాలి. ఒక్కరికి లాభం కలుగుతున్నా అది మనకు నష్టం వచ్చేది కాకపోతే దాన్ని నిర్వర్తించడమే మంచిది. మన జాతి పూర్వవైభవాన్ని నిలబట్టడానికి ఎవరికి వారు శాయశక్తులా కష్టపడాలి. మనిషిలోని దుర్లక్షణాలని రూపుమాపి శాంతి సౌభాగ్యాలతో కూడిన సమాజ నిర్మాణం చేయాలి. సమాజం అంటే మనుషుల సమూహాలే కదా. ఆ మనుషుల ల్లో మానవత్వం పరిమళించేదిశగా పనిచేయాలి. వేదం నలుమూలలనుంచి శాంతిభావనలు మనదరికి చేరాలని కోరుకోమంటుంది. నలుగురి మంచి చేయమని ప్రబోధిస్తుంది. కనుక అలాంటిసత్సంగం- జ్ఞానసాధన, వేదపఠన జరగాలి. నిత్యం వేద పఠనం సాగిస్తే మనస్సు నిర్మలవౌతుంది. ఆ తరువాత సనాతన ధర్మసంస్థాపన దానికదే జరుగుతుంది.

- కూకుట్ల యాదయ్య