తూర్పుగోదావరి

బీజేపీ అధిష్ఠానం చెప్పిందే నాకు శాసనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ సిటీ, ఫిబ్రవరి 5: తనకు భారతీయ జనతాపార్టీ చెప్పిందే శాసనమని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. నగరంలో నూతనంగా నిర్మించిన ఇనోదయ ప్రైవేటు ఆసుపత్రి ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సోమవారం సాయంత్రం జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం ముగిసిన అనంతరం మంత్రి కామినేని పలు విషయాలపై మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాసుపత్రుల్లో ఆధునిక సౌకర్యాలను మెరుగుపరచడంతోపాటు ప్రైవేటు ఆసుపత్రులను సైతం ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ వైద్యసేవ ద్వారా అడ్వాన్స్‌డ్ చికిత్స రోగులకు అందుతోందని వివరించారు. ఎన్టీఆర్ వైద్యసేవ ద్వారా హైదరాబాద్‌లో రోగులు చికిత్స పొందడానికి కేన్సర్, పీడియాట్రిక్ హార్ట్ సర్జరీలకు సంబంధించి కేవలం 40 ఆసుపత్రులకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్టు స్పష్టం చేశారు. రాష్ట్రానికి చెందిన డబ్బు పక్క రాష్ట్రానికి వెళ్ళడం న్యాయం కాదని ఆయన అభిప్రాయం వ్యక్తంచేశారు. మన డబ్బులను పక్క రాష్ట్రాలకు ఇస్తే ఆంధ్రద్రేశ్‌లో ఉన్న ఆసుపత్రులు అభివృద్ధి చెందవని మంత్రి కామినేని పేర్కొన్నారు. నేడు హైదరాబాద్‌లో ఉన్న బసవతారకం ఆసుపత్రికి రోగులు చికిత్స కోసం వెళ్తుంటే వారు రోడ్డున పడుతున్నట్లు చెప్పారు. నాకు తమ పార్టీ బీజేపీ అధిష్ఠానం చెప్పిందే శాసనమని, ఒక పాలసీ ప్రకారం నడుచుకుంటానని ఆయన పేర్కొన్నారు. నాయకులు ఉండవల్లి అరుణ్‌కుమార్, సోము వీర్రాజు, బుద్ద వెంకన్నలు చేస్తున్న వ్యాఖ్యలపై తాను స్పందించనన్నారు. భారతీయ జనతాపార్టీ కేంద్ర అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు చెబితేనే తాను స్పందిస్తానని వివరించారు. త్వరలోనే అన్ని విషయాలపై కేంద్రం నుండి క్లారిటీ వస్తుందని, ప్రతీ విషయాన్ని రాజకీయం చేయడం మంచి పద్ధతి కాదని మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు, పిల్లి అనంతలక్ష్మి, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.