ప్రకాశం

మార్కాపురం ఎఎంసి బీసీలకేనా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్కాపురం, ఫిబ్రవరి 5 : మార్కాపురం మార్కెట్‌యార్డు కమిటీ చైర్మన్‌గా బీసీలకు చెందిన కాకర్ల శ్రీనివాసులు పేరు ఖరారైనట్లు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. గత కొంతకాలంగా మార్కెట్‌యార్డు పదవి కోసం ప్రముఖ పలకల వ్యాపారి వెన్నా పోలిరెడ్డి, పట్టణపార్టీ అధ్యక్షులు తాళ్ళపల్లి సత్యనారాయణ, జిల్లా సీనియర్ టిడిపి నేత, అధికార ప్రతినిధి శాసనాల వీరబ్రహ్మం పోటీపడ్డారు. అయితే మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఈ పర్యాయం బీసీలకు ఈ పదవి ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈమేరకు అధిష్ఠానంకు సిఫార్సు చేయడం జరిగిందని టిడిపి నేతలు తెలిపారు. ఈయన గతంలో రాయవరం సర్పంచ్‌గా, మార్కాపురం ఎఎంసి ఉపాధ్యక్షులుగా, ప్రస్తుతం మండల పార్టీ అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. అలాగే ఉపాధ్యక్షులుగా మాజీ తెలుగుదేశంపార్టీ మండల అధ్యక్షులు జవ్వాజి వెంకటరెడ్డి పేరును సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. కాగా, గత ఎన్నికల్లో టిడిపిని వీడి వైఎస్‌ఆర్‌సిపిలో చేరి ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి గెలుపునకు కృషి చేశారు. అయితే తిరిగి టిడిపి తీర్థం పుచ్చుకోవడంతో ఉపాధ్యక్ష పదవి కట్టపెట్టాలని మాజీ ఎమ్మెల్యే కందుల ఆ పేరును సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. అయితే దీర్ఘకాలంగా పార్టీలో ఉంటూ పలు నియోజకవర్గాలకు పరిశీలకునిగా వెళ్ళి రాష్టస్థ్రాయి నేతలతో పరిచయాలు ఉండి గత పదేళ్ళుగా జిల్లా టీడీపీ అధికారప్రతినిధిగా పనిచేస్తున్న శాసనాల వీరబ్రహ్మంను కాదని అదే గ్రామానికి చెందిన బీసీ నేత కాకర్ల శ్రీనివాసులుకు మార్కెట్‌యార్డు చైర్మన్ పదవి ఇవ్వడం ఏమిటా అన్న ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. అలాగే గతంలో రెండు పర్యాయాలు పట్టణపార్టీ అధ్యక్షులుగా, మున్సిపాలిటీలో సీనియర్ కౌన్సిలర్‌గా ఉండి ప్రస్తుతం పట్టణ పార్టీ అధ్యక్షులుగా వ్యవహరిస్తున్న తాళ్ళపల్లికి కూడా ఈ పదవి దక్కకపోవడం విశేషం. కాగా, ఎన్నికల అనంతరం రెండవ పర్యాయం మార్కెట్‌యార్డు చైర్మన్ పదవి ఆశించిన ఇమ్మడి కాశీనాథ్‌కు ఆ పదవి ఇవ్వకపోవడంతో ప్రస్తుతం ఆయన పార్టీలో వేరు కుంపటి పెట్టి కందులకు వ్యతిరేకంగా పనిచేయడం విశేషం.

ఘనంగా జీవనమూర్తి తిరునాళ్లు
* వైభవంగా గంధ మహ త్సవం
* కర్ణాటక, చెన్నై రాష్ట్రాల నుంచి భారీగా విచ్చేసిన భక్తులు
గిద్దలూరు, ఫిబ్రవరి 5: నియోజకవర్గంలో తురిమెళ్ళ గ్రామానికి సమీపంలో అనుమలపల్లి గ్రామంలో వెలసిన శ్రీజీవనమూర్తి తిరునాళ్లు సోమవారం అత్యంత వైభవంగా జరిగాయి. తిరునాళ్ల సందర్భంగా మఠాన్ని సర్వాంగసుందరంగా విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఈ తిరునాళకు ప్రకాశంజిల్లా నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలైన కర్ణాటక, చెన్నై నుంచి భక్తులు తరలివచ్చారు. ఈసందర్భంగా స్వామివారి గంధ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే ఎం అశోక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అన్నా వెంకటరాంబాబు స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ప్రతి ఐదేళ్ళకు ఒకసారి మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే సోమవారం నిర్వహిస్తారు. ఈ జెండా మహోత్సవం కన్నులపండువగా సాగింది. జెండాలో చూపిన స్వామిపాదాలను భూమిగా, శిరస్సును ఆకాశంగా, నేత్రాలను సూర్య చంద్రులుగా, నాసికపుటాలను వాయువుగా భావిస్తారు. ప్రకృతి సృష్టికి స్వామిజెండా ప్రతిరూపంగా కనిపిస్తుంది. ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు, బుడత తిప్పయ్య, డాక్టర్ సిహెచ్ రంగారెడ్డి స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించారు. మఠంలోని స్వామివారి సమాధిని పుష్పమాలలతో సర్వాంగసుందరంగా అలంకరించారు.