కృష్ణ

మందకొడిగా ఇంటి పన్ను వసూళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, ఫిబ్రవరి 5: గ్రామ పంచాయతీలకు ఆర్థిక వెసులుబాటు కల్పించే ఇంటి పన్నుల వసూళ్లు మందకొండిగా సాగుతున్నాయి. మరో రెండు నెలల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో వసూళ్లు ఏ మేర జరుగుతాయనేది ప్రశ్నార్థకంగా మారింది. లక్ష్య సాధనలో పంచాయతీ అధికారులు ఎటువంటి ప్రణాళికలు అమలు చేస్తారో వేచి చూడాల్సి ఉంది. జిల్లాలో సుమారు వంద కోట్ల రూపాయలు పైబడి ఇంటి పన్నులు వసూళ్లు చేయాల్సి ఉంది. మొత్తం 970 గ్రామ పంచాయతీలు గాను రూ.100కోట్ల లక్ష్యాన్ని సాధించడం అధికారులకు కత్తిమీద సాముగానే కనిపిస్తోంది. సమయం చాలా తక్కువగా ఉండటంతో పాటు ఇప్పటి వరకు వసూళ్లపై పూర్తి స్థాయిలో పంచాయతీ అధికారులు దృష్టి సారించకపోవటం పలు విమర్శలకు దారి తీస్తోంది. ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుండి చడీచప్పుడు లేకుండా ఉండే పంచాయతీ అధికారులు ఆర్థిక సంవత్సరం ముగింపు దశలో ఇంటి పన్ను వసూళ్లపై హడావుడి చేయడం, లక్ష్యాల మేర ఫలితాలు సాధించకపోవడం ప్రతి యేటా పరిపాటిగా మారుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు పంచాయతీ కార్యదర్శుల కొరత నూరు శాతం పన్ను వసూళ్లపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అసలే ఆర్థిక వనరుల లేమితో గ్రామ పంచాయతీలు కునారిల్లుతున్నాయి. ఏ చిన్నపాటి రోడ్డు నిర్మించాలన్నా ఎంపీ, ఎమ్మెల్యే తదితర నిధుల కోసం గ్రామ పంచాయతీ పాలకవర్గాలు పాకులాడాల్సి వస్తోంది. పారిశుద్ధ్య కార్మికుల జీత భత్యాలకే ఆర్థిక వనరులు సరిపోని పరిస్థితి గ్రామ పంచాయతీల్లో నెలకొంది. ఆర్థిక సంఘం నిధులు పంచాయతీలకు కాస్త ఆర్థిక వెసులుబాటు ఇచ్చినా నిబంధనల మేరకు ఆ నిధులు నిర్ధేశిత అంశాకే ఖర్చు చేయాల్సి వస్తోందని పాలకవర్గాలు పేర్కొంటున్నాయి. మిగిలిన అంశాల కోసం పంచాయతీల సాధారణ నిధుల నుండే ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇదిలా ఉంటే గత ఏడాది వసూళ్లకు ఐదు శాతం పెంచి ఈ ఆర్థిక సంవత్సరంలో పన్నులు వసూలు చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలు మరింత గుదిబండగా మారాయి. జిల్లాలో 970 గ్రామ పంచాయతీలకు సంబంధించి రూ.103.67కోట్ల మేర పన్నులు వసూళ్లు చేయాల్సి ఉంది. ఇందులో ప్రధానంగా ఇంటి పన్నులు, గ్రంథాలయ పన్నులు రూపేణా రూ.61.50కోట్లు, చేపల చెరువులు, గడ్డిపాటలు, అశీల వసూలు, నీటి పన్ను, లైసెన్సు తదితర నాన్ టాక్స్ పద్దులో రూ.42.17కోట్లు వసూలు చేయాలి. 970 గ్రామ పంచాయతీలను 516 క్లస్టర్లుగా విభించారు. వీటికి కేవలం 360 మంది కార్యదర్శులు మాత్రమే పని చేస్తున్నారు. 116 మంది బిల్ కలెక్టర్లకు గాను 49 మందే పని చేస్తున్నారు. తీవ్రంగా ఉన్న కార్యదర్శులు, బిల్ కలెక్టర్ల కొరత నేపథ్యంలో సకాలంలో పన్నుల వసూళ్లు ప్రశ్నార్ధకమేనని సంబంధిత పంచాయతీ అధికారులే పేర్కొంటుండటం గమనార్హం.

హోదా రాకపోవటానికి బాబే కారణం
మైలవరం, ఫిబ్రవరి 5: రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోవటానికి ముఖ్యమంత్రి చంద్రబాబే కారణమని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్ ఆరోపించారు. ప్రత్యేక హోదాపై వైసీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో సోమవారం మైలవరం పట్టణ వెలుపల 221 జాతీయ రహదారిపై వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జోగి రమేష్ మాట్లాడుతూ అసమర్థ ముఖ్యమంత్రి పాలనవల్లే రాష్ట్ర పరిస్థితి అధ్వాన్నంగా తయారైందని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా భిక్ష కాదని, మన హక్కని పేర్కొన్నారు. నాలుగేళ్ళుగా బాబు మోసపూరిత మాటలు విని ప్రజలు విసిగి పోయారన్నారు. ఇంకా ఎన్నాళ్ళు ఈనాటకాలు ఆడతారని ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసు నుండి బయట పడటానికి రాష్ట్రాన్ని తాకట్టుపెడతారా అన్నారు. ఆంధ్ర రాష్ట్ర ద్రోహులుగా చరిత్రలో మిగిలిపోక తప్పదని హెచ్చరించారు. కేంద్రంలో భాగస్వాములుగా ఉండి ప్రత్యేక హోదా తీసుకురాలేకపోగా బడ్జెట్‌లో రాష్ట్రానికి తీరని ద్రోహం జరిగినా కనీసం నోరు మెదపక పోవటం శోచనీయమన్నారు. కేంద్రంలో భాగస్వామ్యం నుండి బయటకు వచ్చి పోరాటం చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం అక్కడే భోజనం చేసి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పామర్తి శ్రీనివాసరావు, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు డి అంజిరెడ్డి, పార్టీ నేతలు తిరుపతిరావు, ఆజాద్, విద్యార్థులు పాల్గొన్నారు.

క్రమశిక్షణతో చదవాలి
* ఉపసభాపతి బుద్ధప్రసాద్
అవనిగడ్డ, ఫిబ్రవరి 5: క్రమశిక్షణతో విద్యను అభ్యసిస్తే ఉన్నత శిఖరాలను అధిరోహించే అవకాశం ఏర్పడుతుందని శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. స్థానిక ప్రగతి విద్యా సంస్థల ఆవరణలో సోమవారం 2014 డీఎస్సీలో రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు పొందిన పలువురు విద్యార్థులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ప్రథమ ర్యాంక్ సాధించిన నరేంద్ర తల్లిదండ్రులను కూడా సన్మానించారు. ఈ సందర్భంగా బుద్ధప్రసాద్ మాట్లాడుతూ మార్కులతో పాటు రిమార్కులు లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రిమార్కులు వస్తే జీవితం సర్వనాశనం అవుతుందన్నారు. విద్యార్థులు మంచి పౌరులుగా ఎదిగితేనే దేశం అభివృద్ది చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సనకా పూర్ణచంద్రరావు, విద్యా సంస్థల అధినేతలు వి సుందరరాం, కె చంద్రశేఖర్, కె శ్యాంసుందర్, పి హనుమంతరావు, బాలాజీ, నరసింహారావు, నాయుడమ్మ పాల్గొని విద్యార్థులకు మార్గదర్శనం చేశారు. విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

వైరస్ తెగుళ్లతో రైతు దిగాలు
మోపిదేవి, ఫిబ్రవరి 5: మండల పరిధిలోని కోసూరువారిపాలెం, నాగాయతిప్ప, మోపిదేవిలంక తదితర గ్రామాల్లో కూరగాయల సాగు చేస్తున్న రైతులు వైరస్ తెగుళ్లతో ఆందోళనకు గురవుతున్నాడు. సుమారు 300 ఎకరాల్లో వివిధ రకాల కూరగాయల సాగు చేస్తున్నారు. ముందుగా నాటిన మిర్చి కోతకు వచ్చినప్పటికీ పది కేజీలు రూ.100లు మాత్రమే ధర పలుకుతోంది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వంద ఎకరాల్లో మిర్చి సాగు చేశారు. తాజాగా సాగు చేసిన మిర్చి పంటకు వైరస్ తెగుళ్లు సోకటంతో ఆ ప్రభావం దిగుబడుల మీద పడే ప్రమాదం ఉందని రైతులు వాపోతున్నారు. మరో 150 ఎకరాల్లో టమాటా సాగు జరుగుతోంది. గత నెల రోజుల నుండి వైరస్ తెగులు ఉధృతం కావటంతో రైతులు లబోదిబోమంటున్నారు. కొంత మంది దళారులు 30కేజీల టమాటా బాక్స్‌లను రూ.100 నుండి రూ.120లు కొనుగోలు చేస్తున్నారు. ఒక వైపు ధర లేమి, మరో వైపు వైరస్‌తో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

ఎటువంటి క్రీడల నిర్వహణకైనా రాజధాని సిద్ధం
ఇబ్రహీంపట్నం, (జి.కొండూరు), ఫిబ్రవరి 5: రాజధాని అమరావతి ఎటువంటి క్రీడల నిర్వహణకైనా సిద్ధంగా ఉందని శాప్ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బంగార రాజు పే ర్కొన్నారు. ఇబ్రహీంపట్నం మండలం మూలపాడులో జరిగిన ఆల్ ఇండి యా సివిల్ సర్వీసెస్ క్రికెట్ టోర్నమెం ట్ ముగింపు సభలో ఆయన మాట్లాడుతూ సివిల్ సర్వీసెస్ టోర్నమెంటు ను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా, సమర్థవంతంగా నిర్వహించామన్నారు. ఎటువం టి లోటుపాట్లకు తావులేకుండా క్రికెట్ టోర్నమెంటును నిర్వహించి శక్తిసామర్థ్యాలను చాటామన్నారు. జనవరి 27 నుంచి ఫిబ్రవరి 5వరకూ 10రోజుల పాటు 34 జట్లు, 680 మంది క్రీడాకారులు పాల్గొన్నారన్నారు. ఏసీఏ మైదానాల నిర్వహణ బాగుందన్నారు. ఫైనల్ మ్యాచ్‌లో ఆర్‌ఎస్‌బీ ముంబైకు, సెంట్ర ల్ సెక్రటేరియట్‌కు జరిగిన ఉత్కంఠభరితమైన పోరులో 4వికెట్ల తేడాతో ముంబై విజయం సాధించింది. హిమా న్షు జోషికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అత్యత్తమ బ్యాట్స్‌మన్‌గా 5మ్యాచ్ ల్లో 423 పరుగులు సాధించిన ముంబై జట్టు సభ్యుడు అమీయా షీరికండే ఎంపికయ్యారు. శాప్ ఓఎస్‌డీ రామకృష్ణను ప్రత్యేకంగా అభినందించారు. ఏసీఏ సెక్రటరీ సీహెచ్ అరుణ్‌కుమార్, మేనేజరు దుర్గాప్రసాద్, సెంట్రల్ అబ్జర్వర్ ఏ సిద్ధు, డీటీసీలు ఇ మీరాప్రసాద్, రాజారత్నంలు పాల్గొన్నారు.