విజయనగరం

1.06 కోట్ల మొక్కల పంపిణీ లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, ఫిబ్రవరి 5: జిల్లాలో ఈ ఏడాది వనం-మనం కార్యక్రమం కింద రూ1.06 కోట్ల మొక్కల పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు జిల్లా సామాజిక వన అటవీశాఖాధికారి సిహెచ్ వేణుగోపాలరావు తెలిపారు. సోమవారం ఆయన ‘ఆంధ్రభూమి’తో మాట్లాడుతూ వనం-మనం కార్యక్రమంలో రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచామని వివరించారు. శ్రీకాకుళం జిల్లా మొదటి స్థానంలో నిలవగా, రెండో స్థానంలో విజయనగరం జిల్లా నిలిచిందన్నారు. చివరి స్థానంలో ప్రకాశం జిల్లా ఉందని వివరించారు. విజయనగరం జిల్లా 73.25 శాతం మొక్కలను పంపిణీ చేయడం ద్వారా రెండో స్థానంలో నిలిచిందని వివరించారు. ఈ ఏడాది వర్షాకాలంలో సామాజిక అటవీ శాఖ ద్వారా మొక్కలు పంపిణీ చేసేందుకు నర్సరీలలో మొక్కల పెంపకం చేపట్టామన్నారు. ఇందులో గత ఏడాది పంపిణీ చేయగా మిగిలిపోయిన మొక్కలను ఈ ఏడాది పంపిణీ చేయనున్నామన్నారు. ఈ ఏడాది పంపిణీకి ఎత్తయిన మొక్కలు సిద్ధం చేస్తున్నామన్నారు. ఇళ్లల్లో మొక్కలు పెంచుకునేందుకు ఉపయోగపడే మొక్కలు ఉన్నాయని వివరించారు. మిగిలినవి రైతులు పొలం గట్టలపైన, జాతీయ రహదారులపైన పెంచుకునేందుకు ఉపయోగపడగలవని వివరించారు. ఎత్తయిన మొక్కలలో రావి, మర్రి, తెల్లమద్ది, వేప, కానుగ, నేరెడు, బాదం, తురాయి మొక్కలు ఉన్నాయన్నారు. ఇళ్లల్లో పెంచుకునే వాటిలో తులసి, వాము, బచ్చలి, కరివేపాకు, సీతాఫల్, దానిమ్మ, జామి, సువర్ణగనే్నరు, గోరింట రకాలు ఉన్నాయని తెలిపారు. కాగా, ఈ ఏడాది ఇప్పటి వరకు 30వేల మొక్కలను జియోట్యాగ్ చేశామన్నారు. ఈ ఏడాది జాతీయ రహదారులు, కాలువల పక్కన, రైల్వే లైను పక్కన, తీర ప్రాంతాల్లో మొక్కల పెంపకం పెద్ద ఎత్తున చేపట్టనున్నట్టు తెలిపారు. ఈ దఫా పెద్ద సంఖ్యలో నాటిన మొక్కలను జియో ట్యాగింగ్ చేయనున్నామన్నారు. ఇప్పటి వరకు 837 ప్రాంతాల్లో మొక్కలను జియో ట్యాగింగ్ చేశామన్నారు. గత ఏడాది ఆంధ్రా విశ్వవిద్యాలయం పిజి కేంద్రంలో చేపట్టిన మొక్కలపై మంచి స్పందన వచ్చిందన్నారు. ఆ క్యాంపస్‌లో మొత్తం 3వేల మొక్కలు నాటగా, అవి అన్ని పెద్ద చెట్లుగా ఎదిగాయన్నారు. అలాగే బొబ్బిలి గ్రోత్ సెంటర్‌లో కూడా ఒకే చోట మొక్కలు పెంపకం చేపట్టామన్నారు.
వనమిత్ర కేంద్రాలు ఏర్పాటు
జిల్లాలో రెండు చోట్ల వనమిత్ర కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. వాటిలో కెఎల్ పురంలో ఒకటి, కంటకాపల్లిలో మరొకటి ఏర్పాటు చేయనున్నట్టు డిఎఫ్‌ఒ వేణుగోపాలరావు వెల్లడించారు. ఈ కేంద్రాల్లో గిరిజనులు పండించే వస్తువులను విక్రయించడంతోపాటు మొక్కల పెంపకం ఆవశ్యకత తదితర వాటిపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు ఈ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు ఆయన వివరించారు.