అదిలాబాద్

ఆధార్ అనుసంధానం తప్పనిసరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచిర్యాల, ఫిబ్రవరి 5 : పట్టాదారు పాస్ పుస్తకాలకు సంబంధిత రైతు ఆధార్ తప్పని సరిగ్గా అనుసందానం చేసేలా తహసిల్దార్ లు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో వీడియో కాన్ఫిరెన్స్ ద్వార జిల్లాలోని తహసిల్దార్లు మండల అభివృద్ది అధికారులతో సమిక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణిని సంబందించిన తహసిల్దార్లు పూర్తి స్థాయిలో ఆధార్ అనుసందానం చేయాలని ఆదేశించారు. గ్రామ స్థాయిలోని విలేజ్ ఆఫీసర్లు, ఫీల్డు అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు సంబందిత శాఖల సమన్వయంతో పూర్తి చేయాలని తెలిపారు. భూ రికార్డుల సర్వేలో పని చేసిన రెవెన్యూ అధికారులకు అభినందనలు తెలుపుతూ మునుముందు సమష్టిగా పని చేయాలన్నారు. వ్యవసాయ భూము లు మండల స్థాయిలో తప్పని సరిగ్గా భూ రికార్డుల మ్యాపులు ఏర్పాటు చేసుకుని వాటిని అందుబాటులో ఉంచుకుకోవాలని సబ్ రిజిస్ట్రర్ ప్రత్యేక మైన విభాగంతో పాటు పూర్తి స్థాయిలో ఆదునీకరించేలా తహసిల్దార్లు ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్ అన్నారు. భవనాల మరుమ్మతుల కోసం తప్పని సరిగ్గా తగు ప్రణాళికలు తయారు చేసిపంపించాలన్నారు. మండల అభివృద్ది అధికారులు వ్యక్తి గత మరుగుదొడ్ల లక్ష్యాలను పూర్తి స్థాయిలో చేయాలని జిల్లాను బహిరంగ మల మూత్ర విసర్జన రహిత జిల్లాగా చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. భీమిని, నెనె్నల, వేమనపల్లి, తాండూర్ మండలాల వారిగ మహాత్మ గాంధీ జాతీయ ఉపాది హామీ పథకం కూలీల సంఖ్య పెంచి వారికి ఉపాది కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాలలో వంట గదులను, గ్రామాల్లో డంపింగ్ యార్డులు, మూత్ర శాలలు, స్మశాన వాటికల లక్ష్యాలను సాదించాలని, మండల అభివృద్ది అధికారులకు, సహాయ ప్రాజెక్టు అధికారులకు సోకాను నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వ ఆర్థిక చేయూత పథకాలను లక్ష్యాలనుచేరువలో సాదించాలన్నారు. ఈ నెల 9న బోదకాలు నివారించే మాత్రలు పంపిణి చేయుచున్నందున అంగన్‌వాడీ కేంద్రాల్లో ఏ ఎన్ యంలు ప్రభుత్వ పాఠశాలలో సంబందిత శాఖల సమన్వయంతో పూర్తి చేయాలన్నారు. ఏమైనా రియాక్షన్ కనిపిస్తే వెంటనేస్పందించే విధంగా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ సురేందర్‌రావు, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ రాహుల్ రాజ్, డీ ఆర్ వో ప్రియాంక, గ్రామీణ అభివృద్ది అధికారి శంకర్, ప్రత్యేక అధికారులు జిల్లా సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

గుడుంబా రహిత జిల్లాగా మారుస్తాం
* ఎక్సైజ్ సూపరింటెండెంట్ నాగేంద్ర రెడ్డి

డుంబారహిత జిల్లాగా మార్చేందుకు ఎక్సైజ్‌శాఖ అధికారులు, సిబ్బంది చిత్తశుద్దితో పనిచేస్తున్నారని జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ నాగేంద్రరెడ్డి తెలిపారు. సోమవారం స్థానిక జిల్లా ఎక్సైజ్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా అక్రమంగా గుడుంబా తయారుచేస్తున్న స్థావరాలపై దాడులుచేసి 232 కేసులను నమోదుచేశామన్నారు. అక్రమంగా బెల్లం, పటికలను రవాణా చేయడంతో పాటు గుడుంబాను తయారుచేస్తున్న దాదాపు 224 మందిని అరెస్ట్‌చేసి కేరసులు నమోదుచేశామన్నారు. ముఖ్యంగా నదీ పరివాహక ప్రాంతాల్లో గుడుంబాతయారీ అధికంగా జరుగుతోందని గుర్తించామని, ఆ దిశగా చర్యలు తీసుకుని ఆయా స్థావరాలపై దాడులు చేశామన్నారు. గోదావరి నది పరివాహక ప్రాంతంలో 110 చోట్ల దాడులుచేశామని, 44278 లీటర్ల బెల్లంపానకాన్ని స్వాధీనం చేసుకుని ధ్వంసం చేయడం జరిగిందన్నారు. అలాగే 7790 కిలోల బెల్లాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇదిలా ఉంటే పలుచోట్ల సాగుచేస్తున్న గంజాయి మొక్కలను గుర్తించి తొలగించడం జరిగిందన్నారు. అలాగే అక్రమంగా నిల్వ ఉంచిన 20 కిలోల గంజాయిని కూడా సీజ్‌చేసి అక్రమార్కులపై కేసులు పెట్టడం జరిగిందన్నారు. గుడుంబా రహిత పునరావాస పథకం కింద జిల్లాలో 22 మంది అర్హులుకాగా వీరిలో 20 మందికి రూ. 2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించి ఉపాధి కల్పించడం జరిగిందన్నారు. అలాగే జిల్లాలోని నిర్మల్, భైంసా, తదితర ప్రాంతాల్లో 8 కల్తీకల్లు కేసులను నమోదుచేశామని వెల్లడించారు. సరిహద్దు రాష్ట్రాల నుండి దేశీదారు రాకుండా పటిష్టమైన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. సమావేశంలో నిర్మల్ ఎక్సైజ్ సిఐ సంపత్‌కృష్ణ, భైంసా సిఐ టివిఎ నాయుడు, ఎక్సైజ్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

బీసీలపై దాడులను నిరసిస్తూ
వినూత్న నిరసన

మంచిర్యాల, ఫిబ్రవరి 5 : బీసీలపై జరుగుతున్న దాడులను నిరసిస్తు మంచిర్యాల పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆర్పీఐ పార్టీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. నల్లగుడ్డలతో కండ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పార్టి జిల్లా అద్యక్షులు గుమ్ముల శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజా స్వామ్య దేశంలో రాష్ట్రంలో కాని కేంద్రంలో గాని బీసీలు రాజ్యాధికారి చేపట్టిన దాఖలాలు లేవని, అన్నారు. తెలంగాణ ఉద్యమంలో అన్ని కులాలు పాల్గొని రాష్ట్రాన్ని సాదించిన బీసీలను కేవలం ఓట్లకోసమే వాడుకుంటున్నారే తప్పా వారికి చేసిందేమీ లేదని అన్నారు. రామగౌడ్ ఆత్మహత్య నల్గొండ జిల్లా సూర్యపేటలో మున్సిపల్ చైర్ పర్సన్ భర్త శ్రీనివాస్ హత్యలను తీవ్రంగా ఖండించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ వ్యతిరేక పాలనను కొనసాగిస్తున్నాయని అన్నారు. రాష్ట్ర జనాభలో 56 శాతం భీసీలు ఉన్నప్పటికీ సమూచిత స్థానం ఇచ్చిన పార్టిలు లేవన్నారు. బీసీలపై దాడులను అరికట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్ష్యంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఆర్‌పీఐ నాయకులు ప్రవిణ్, ప్రసాద్, కాంతికుమార్, నాగరాజు, రాకేష్, తదితరులు పాల్గొన్నారు.

ప్రాజెక్టును సందర్శించిన మాజీ ఎంపీ
* స్థానిక నేతలతో కలిసి బోటు విహారం

కడెం,్ఫబ్రవరి 5: నిర్మల్ జిల్లాలోని కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టును ఆదిలాబాద్ మాజీ ఎంపీ టీ ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు రాథోడ్ రమేష్ సోమవారం కడెం మండల నాయకులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా కడెం ఫ్రాజెక్టు రిజర్వాయర్ నీటిమట్టాన్ని, ప్రాజెక్టు నీటి పరిస్థితిని తదితర విషయాలపై ఆయన ఆడిగి తెలుసుకున్నారు. అనంతరం కడెం ఫ్రాజెక్టు సమీపంలో గల పర్యాటక కేంద్రంకు చెందిన బోటులో స్థానిక నాయకులతో కలిసి కడెం జలాశయంలో బోటువిహారం చేస్తూ కడెం ప్రకృతి అందాలను మాజీ ఎంపి రాథోడ్ రమేష్ తిలకించారు. అనంతరం పలు విషయాలపై మాట్లాడారు. కార్యక్రమంలో కడెం నాయకులు కోల శ్రీనివాస్, శ్రీనివాస్‌రెడ్డి, మల్లేష్, సంజీవ్‌పటేల్, రాజమల్లు, రాజు, దీటి సత్యం, ఇస్లావత్ మోహన్‌నాయక్, వేణు, తదితరులు పాల్గొన్నారు.

ప్రజాసేవకు ఎల్లవేళలా సిద్ధం
* ఎమ్మెల్యే కోనప్ప

కౌటాల, ఫిబ్రవరి 5 : నియోజకవర్గంలో ప్రజలకు ఎటువంటి అవసరాలు ఉన్నా.. తనవంతుగా సేవ చేసేందుకు ఎల్లవేళలా సిద్ధంగా ఉం టానని సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో రాందేవ్ ట్రస్ట్ సహాకారంతో సోమవారం నిర్వహించిన ఉచిత కం టి వైద్యశిబిరంలో ఎమ్మెల్యే గతంలో వైద్యశిబిరాల్లో పాల్గొన్న వారికి కళ్ళజోళ్లను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన నివాసం వద్ద ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో ఎమ్మె ల్యే మాట్లాడారు. గ్రామంలో అనేక విధాల సమస్యలతో సతమతం అయ్యే ప్రజలను ఆదుకునేందుకు ఎల్లవేలల కృషి చేస్తానని, సమస్యలు ఏవైనా తనవంతుగా పరిష్కరించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తానన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వయోభారం కారణంగా వృద్దులు కంటి జబ్బులతో అవస్తలు పడుతున్నారని, మారిన కాలానుగూనంగా వచ్చిన మార్పులతో ఈ ఇబ్బంది చిన్నవారు, మద్య వయస్సు వారిలో కూడా పెరుగుతుందని, ఈ తరుణంలో ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహించడం వల్ల కొంత వరకు కంటి జబ్బులు దూరం చేసే అవకాశం దక్కుతుందన్నారు. ఇ ప్పటి వరకు మూడు సార్లు ఈ శిభిరాలు కౌటాలలో నిర్వహించగా కౌటాల, చింతల మానపల్లి మండలాల ప్రజలు అధిక సంఖ్యలో హాజరై కంటి పరీక్షలు నిర్వహించుకోవడం సంతోషదాయకం అన్నారు. మంచిర్యాలకు చెందిన రాందేవ్ ట్రస్ట్ సంచార నేత్ర వైద్యవాహనం ద్వార సిబ్బంది ఉచిత వైద్యపరీక్షలకు ముందుకు రావడం ప్రసంశ నీయం అని కొనియాడారు. ఇప్పటి వరకు నిర్వహించిన రెండు వైద్య శిభిరాల్లో 138 మందికి ఉచిత కళ్లజోలు అవసరం కాగా రాందేవ్ ట్రస్ట్ కార్యదర్శి ఉత్తమ్, ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్, జెడ్పీటీసీ నానయ్య, ఉపాధ్యక్షుడు డుబ్బు ల వెంకయ్య, ఐటీడీఏ డైరెక్టర్ మాం తయ్య, కో ఆప్షన్ సభ్యులు సయ్యద్ నాజీం ఉస్సేన్, నాయకులు విశ్వనాథ్, రవిందర్ గౌడ్, శ్రీ్ధర్, రాంచందర్, రవి, బాజీరావు, సంతోష్, గట్టయ్య, రమేష్, రాంచందర్, ప్రమోద్, తదితరులు ఉన్నారు.

అప్పుల బాధతో..
యువ రైతు ఆత్మహత్య

కుంటాల, ఫిబ్రవరి 5: మండలంలోని లింబా (కే) గ్రామానికి చెందిన మాన్‌కారి చంద్రకాంత్ (30) అనే యువరైతు అప్పులబాధతో ఆత్మహ త్య చేసుకున్నట్టు ఎస్సై యూనుస్ తెలిపారు. కుటుంబ సభ్యులు, పోలీసుల వివరాల ప్రకారం.. చంద్రకాంత్‌కు ఆరు ఎకరాల భూమి కలదు. వర్షాధారంపై ఆధారపడి పత్తి, మొక్కజొన్న వేసి వ్యవసాయం చేసుకుంటున్నాడు. అయతే సమయానికి వర్షాలు కురవక పోవడంతో పంటలు పండక అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. గత సం వత్సరం నుంచి వ్యవసాయ భూము ల్లో 6 బోర్లువేయగా తగినంత నీరు లేక పంటలు ఎండిపోయి, రూ.6 లక్షల వరకు అప్పులుచేశాడని, చేసిన అప్పులు ఎలా తీర్చాలన్న బెంగతో ఆ దివారం ఉదయం 6 గంటలకు పొలా నికి వెళ్లొస్తానని తన భార్య సంధ్యారాణికి చెప్పి వెళ్లి, రాత్రి వరకు తిరిగి రాకపోవడంతో భావ సూర్యకాంత్‌కు సంధ్యారాణి చెప్పడంతో పోలీసులకు బంధువులకు ఫోన్ ద్వారా సమాచా రం ఇచ్చారు. ఊరి పొలిమేరలో గల చెరువు గట్టుపై వెతకగా అక్కడ చెప్పు లు, బట్టలు కనిపించాయి. సోమవా రం మధ్యాహ్నం చంద్రకాంత్ శవమై తేలాడు. మృతుడికి భార్య ముగ్గురు కుమారులు ఉన్నారు. మృతుడి అన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు వివరించారు.

ఆధ్యాత్మిక చింతనతో ఉపశమనం
* డెయిరీ కార్పొరేషన్ చైర్మన్ భూమారెడ్డి

తలమడుగు, ఫిబ్రవరి 5: ఆధ్యాత్మిక చింతనతో ఉపశమనం పొందవచ్చని రాష్ట్ర డెయిరీ కార్పొరేషన్ చైర్మెన్ లోక భూమారెడ్డి అన్నారు. సోమవారం తలమడుగులోని శ్రీ వెంకటేశ్వర ఆలయ వార్షికోత్స వేడుకల్లో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా భూమారెడ్డి మాట్లాడుతూ మనిషి జీవితంలో ఒత్తిళ్ళు సహాజమని, వీటిని అధిగమించేందుకు భక్తిమార్గం దోహదపడుతుందని అన్నారు. యువత సైతం భక్తిమార్గంలో నడిచి చెడు రుగ్మతలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం కన్నుల పండగగా నిర్వహించడం అభినందనీయమని, ఆలయ అభివృద్దికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కాగా రెండు రోజులుగా కొనసాగుతున్న శ్రీ వెంకటేశ్వర ఆలయ వార్షికోత్సవ వేడుకలకు చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై మొక్కులు తీర్చుకుంటున్నారు. భక్తుల సౌకర్యా ర్థం ఆలయ కమిటీ అధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేపట్టారు. టీఆర్‌ఎస్ నాయకులు బాలూరి గోవర్దన్ రెడ్డి, నారాయణ, శ్రీనివాస్ రెడ్డి, అశోక్ రెడ్డి పాల్గొన్నారు.

సంతల్లో దొంగల హల్‌చల్
* వెళ్లేందుకు భయాందోళన చెందుతున్న ప్రజలు
* పనిచేయసి సీసీ కెమెరాలు

లక్సెట్టిపేట, ఫిబ్రవరి 1 : మండలంలో గత ఆరు దశాబ్దాలుగా వారాంతపు సంతం ఆదివారం నాడు భారీ స్థాయిలో నిర్వహిస్తారు. ఈ సంతలో పలు రకాల సరుకులు కొనుగోలు చేయడానికి మండలం నుండే కాకుండా ఇతర మండాలల నుండి కూడా ప్రజలు భారీ సంఖ్యలో వస్తారు ఆ కాలం నుంచి కూడా ఇప్పటి వరకు సంతకు ప్రత్యేక స్థలం కేటాయించక పోవడంతో ఆదివారం పాత బస్టాండ్ వద్ద గల అంగడీ బజార్‌లో ఇరుకు స్థలంలో ఈ సంత నిర్వహిస్తారు. అలాగే గత ఆరు నెలలుగా ఊత్కూర్ చౌరస్తాలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో జాతీయ రహదారి పక్కన వారాంతపు సంతను ప్రతీ గురువారం నిర్వహిస్తున్నారు. ఈ సంతకు సైతం భారీగా ప్రజలు వస్తుంటారు. ఇదే అదునుగా భావించిన దొంగలు తమ చేతివాటాన్ని చూపిస్తున్నారు. ప్రజల నుండి సెల్ ఫోన్లు, డబ్బులు దొంగిలిస్తున్నారు. గత ఆదివారం సంతలో ఓ వ్యక్తికి చెందిన సుమారు 30 వేలు విలువ చేసే ఫోన్ దొంగిలించారు. అంతే కాకుండా గత గురువారం సంతలో ఒకరి వద్ద నుండి 18 వేల రూపాయలు దొంగిలించారు. అంతే కాకుండా సాయంత్రం చీకటయ్యే సమయంలో విపరీతంగా దొంగతనాలు జరుగుతున్నాయని ఆగ్ర హం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు సైతం సంతల్లో నిఘా పెట్టినా లాభం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. దీనికి తోడు గత పది రోజులుగాపట్టణంలోని ఊత్కూర్ చౌరస్తా, పాత బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పని చేయక పోవడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఇప్పటికైనా పోలీసులు గట్టి నిఘా పెట్టి వారాంతపు సంతల్లో దొంగతనాలు అరికట్టాలని కొనుగోలు దారులు అభిప్రాయ పడుతున్నారు.

సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి
* 9న కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా

శ్రీరాంపూర్ రూరల్ ఫిబ్రవరి 5: అసంఘటిత రంగ కార్మికులకు సమగ్ర చట్టాలను సామాజిక భద్రత, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 9 జిల్లా కలెక్టరేట్ కార్యక్రమాన్ని విజవంతం చేయాలని ఏ ఐటియుసి నాయకులు దోడ్డి రవిందర్ పిలుపునిచ్చారు. సోమవారం శ్రీరాంపూర్ సీసీసీ హామాలి కార్మిక సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలోఆయన మాట్లాడారు. ఉద్యమ సమయంలో కెసిఆర్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం అచ్చదిన్ ఆయేగా పేరుతో దేశంలో కార్మిక చట్టాలను సవరిస్తు కార్పొరేట్ కంపనీలకు దేశ సంపదను దోచిపెడుతున్నారని ఆరోపించారు. సింగరేణిలో కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ కార్మికులకు మొదటి క్యాటగిరి వేతనం చెల్లించాలని, హమాలీ, అసంఘటిత కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, అడ్డ కార్మికులకు వేటింగ్ హాల్ ఏర్పాటు చేసి వౌలిక వసతులు కల్పించాలని కోరారు.

కూరగాయల పంటలపై రైతుల ఆసక్తి

లక్సెట్టిపేట, ఫిబ్రవరి 5 : మండలంలోని ఇటిక్యాల, మోదెల గ్రామాల్లో రైతులు కూరగాయాల పంటలపై ఆసక్తి చూపి సాగు చేస్తున్నారు. ఆకుకూరలైన పాలకూర, తోట కూర, చుక్క కూరా లతో పాటు క్యాబేజీ, మిర్చీ, టమాట పంటలను ఎక్కువగా సాగు చేస్తు లాభాలుగడిస్తున్నారు. వరి సాగు చేయాలంటే నీరు ఎక్కవ అవసరం ఉన్నందున వాణిజ్య పంటలపైనే దృష్టిసారిస్తున్నారు.వీరంతా ఎక్కువగా కూరగాయాలు పండించి వారాంతపు సంతల్లో దిగుమతి చేస్తున్నారు. అలాగే అలచంత, బెండకాయ, బీరకాయ, తదితర కూరగాయలను సైతం సమయాన్ని బట్టి సాగు చేస్తామని వారంటున్నారు. ప్రస్తుత తరుణంలో మార్కెట్ లో కూరగాయలకు ధర ఎక్కువగా పలుతుకున్నందువల్ల వాటిపై ఎక్కువ శ్రద్ధ చూపుతున్నామని తెలుపుతున్నారు. ఈ పంటలకు రసాయన ఎరువులు ఎక్కువ అవసరం ఉండదని, తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి వస్తుందంటున్నారు. అం తే కాకుండా సమయాన్ని బట్టి ఎలాంటి ఊరగాయలు పండించాలో వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు తీసుకుని పంటలు పండిస్తున్నామని తెలిపారు.

సింగాపూర్ భూనిర్వాసితులకు
68 జీఓను అమలు చేయాలి

శ్రీరాంపూర్ రూరల్ ఫిబ్రవరి 5: శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ భూనిర్వసితులకు పూర్తి స్థాయి నష్టపరిహారం చెల్లించాలని, 18 సంవత్సరాలు నిండిన యవతి యువకలకు 68 జి ఓ అమలు చేయాలని సింగాపూర్ ఓపెన్ కాస్టు నిర్వాసితులు డిమాండ్ చేశారు. సోమవారం శ్రీరాంపూర్ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. సింగాపూర్ ఓపెన్ కాస్ట్ కోసం తమ భూములను దారదత్తం చేసిన ప్రభేత్వం సింగరేణి యాజమాన్యం ఇప్పటి వరకు సర్వేల పేరుతో కాలయాపన చేస్తున్నారే తప్ప పూర్తి స్థాయి నష్ట పరిహారం చెల్లించడం లేదని విమర్శించారు. మిస్సింగ్ అయిన ఇండ్లకు,వృద్ధులకు,స్టూడెంట్స్ నష్టపరిహారం చెల్లించాలని, పంచాయతీలో 54 ఎకారాల లావాణి పట్ట భూమికి సంబంధించిన నష్టపరిహారం చెల్లించలేదన్నారు. నస్పూర్‌లో ఆర్ అండ్ ఆర్ ప్లాంట్‌లో ఇంటి నంబర్ ప్రకారం 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువతి యువకునికి ఇంటి స్థలం కెటాయించాలని డిమాండ్ చేశారు. సింగాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకొని అన్ని విధాల అభివృద్ధి చేయాలని కోరారు. లేనిపక్షంలో ఓసిపి సమస్యల పరిష్కరాంకోసం ఈనెల 12 నుండి ఆందోళన కార్యక్రమాలు చేపట్టి ఉత్పత్తిని స్థ్భింపజేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సింగాపూర్ భూ నిర్వాసితులు అగ్గు మల్లేష్, జనార్దన్, రంగు రమేష్, నరేష్, అగ్గురవి, కుంట నరేష్, సాయి కిరణ్, తదితరులు పాల్గొన్నారు.