కరీంనగర్

కార్పొరేషన్‌లో విలీనాన్ని నిరసిస్తూ ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, ఫిబ్రవరి 5: మున్సిపల్ కార్పొరేషన్‌లో తమ గ్రామాన్ని విలీనం చేయడాన్ని నిరసిస్తూ నగర శివారులోని గోపాల్‌పూర్ గ్రామస్థులు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. గంటకుపైగా ప్రధాన ద్వారం ఎదుట ఆందోళన నిర్వహించగా బిజెపీ మహిళామోర్చ జిల్లా ఉపాధ్యక్షురాలు గాజుల స్వప్న వారికి మద్ధతుగా నిలిచి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాలను నగరంలో విలీనం చేసి అడ్డగోలు పన్నులు వసూలు చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నిందని ఆరోపించారు. కనీస వౌళిక వసతులు లేకుండా గ్రామాల్లో ప్రజలు పడుతున్న ఇబ్బందులను పరిష్కరించకుండా నగరంలో కలిపేందుకు నిర్ణయించటం ప్రభుత్వ అనైతిక విధానాలకు నిదర్శనమన్నారు. వెంటనే విలీన నిర్ణయం ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో బిజెపీ ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ధర్నాలో బిజెపీ నాయకురాల్లు గంట సుశీల, అనిత, యశోధతో పాటు వంద మంది గోపాల్‌పూర్ గ్రామ మహిళలు పాల్గొన్నారు.

పిచ్చికుక్కలను నిర్మూలించాలి
* పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మొలుగూరి సదయ్య
* జమ్మికుంట అంబేద్కర్ చౌక్ వద్ద ధర్న,రాస్తారోకో
జమ్మికుంట, ఫిబ్రవరి 5: జమ్మికుంట పట్టణంలోని పిచ్చికుక్క(రాబిస్)లను నిర్ములించాలని జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మొలుగూరి సదయ్య డిమాండ్ చేశారు. సోమవారం జమ్మికుంట మోత్కులగూడెం అంబేద్కర్ చౌరస్తా వద్ద కాంగ్రేస్ పార్టి అధ్వర్యంలో ధర్న,రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్బంగా మొలుగూరి సదయ్య మాట్లాడుతూ పట్టణంలోని పిచ్చి కుక్కల సైర విహరం చేస్తున్న నగరపంచాయతీ పాలక వర్గం, అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ఇటివల బుద్దరపు సాయిరాం అనే విద్యార్థి పిచ్చికుక్కల దాడిలోమృతి చెందిన ,పాలక వర్గం,అధికారులు ,వైద్యలు పట్టించుకోవడం లేదన్నారు. న్యూ జయ భారతి పాఠశాల విద్యార్థులు ధర్నలో పాల్గోని, కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచారు. ఈ కార్యక్రమంలో అమ్మ వెంకటేశ్,సలీం,చంద్రగిరి శ్రీనివాస్, నాగేంద్ర, దిడ్డిరాము, ఎగ్గెని శ్రీనివాస్,అనిల్, బోల్లి వెంకటేశ్‌పాల్గొన్నారు.