తెలంగాణ

లంకలో కిడ్నీ మార్పిడి ఆపరేషన్ల నిలిపివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, జనవరి 22: సంచలనం రేపిన కిడ్నీ రాకెట్ వ్యవహారంలో శ్రీలంక ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న కొలంబోలోని నాలుగు ఆసుపత్రుల్లో విదేశీయులకు కిడ్నీ మార్పిడి ఆపరేషన్లను నిలిపివేస్తున్నట్లుగా శ్రీలంక వైద్య శాఖ మంత్రి రజిత సేనరత్నే ప్రకటించారు. శ్రీలంకలోని నవలోక్ ఆసుపత్రి, హేమా ఆసుపత్రి, వెస్టర్న్, లంకన్ ఆసుపత్రుల్లో తక్షణమే విదేశీయులకు సంబంధించిన కిడ్నీ ఆపరేషన్ల ప్రక్రియను నిలిపివేస్తున్నట్లుగా వెల్లడించారు. అక్రమ కిడ్నీ మార్పిడి కేసులో తెలంగాణ, భారత పోలీస్ విభాగాలు అందించిన సమాచారంపై తమ దేశ నేర పరిశోధన సంస్థలు విచారణ చేపట్టాయన్నారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆసుపత్రులపై, ఆరుగురు వైద్యులపై నిందితులుగా తేలితే లంక చట్టాల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. బాధ్యులైన వైద్యులను మెడికల్ కౌన్సిల్ జాబితా నుండి తొలగిస్తామన్నారు.