Others

ఆరున్నొకటి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొందరికి కొన్ని సంఖ్యలు అంటే ఇష్టం మరికొన్ని అంటే అయిష్టంగా ఉంటుంటాయి. చాలామందికి కొన్ని సంఖ్యలపట్ల కొన్ని నిర్దుష్టమైన అభిప్రాయాలుంటాయి. ‘ఏడు’సంఖ్యను కాదు ఏడు అన్న పదాన్ని పలుకడానికి కూడా ఇష్టపడరు. ఏడు అని చెప్పడానికి జానపదులు ఆరున్నొకటి అంటుంటారు. ఇది వ్యాపారస్థుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఏపని చేయని వాళ్లను ‘సాడేసాత్‌గాడు’అని అనడానికి ఏడు అన్న పదం పనికి రాదని భావం. జానపదంలోను, పురాణాల్లోను ఏడుకు ప్రాముఖ్యత ఉంది. సంస్కృతంలో ఏడు ను ‘సప్త’, లాషిన్ ‘స్టెపెటమ్’ అని, ఇంగ్లీష్‌లో ‘సెవెన్’అని హిందిలో ‘సాత్’అని ‘స’ పరమైన అక్షరంతో ప్రారంభిస్తారు. గణిత శాస్త్రంలో ఏడు బేసి సంఖ్య. సరి సంఖ్యకన్నా బేసి శుభప్రదం. కాని మనకు మాత్రం ఏడు అంటే ... ఆరున్నొకటే...

రచనో, చిత్రమొ నాట్యమొ
రుచి పెంచెడి కర్మమొకటె ఋతమై నిలుచున్
శుచి ప్రేరణ నొసగచు
కాచుచుబ్రోచుచు మనుజుల కాంక్షలు తీర్చున్