Others

సాధన - శోధన ( ప్రసాదం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘సాధన చేయమురా నరుడా సాధ్యం కానిది లేదురా?’’ అని అన్నారు పెద్దలు.
సాధనతో మనం దేనినైనా సాధించగలం. సమకూర్చుకోగలం. సమస్న్నా స్వంతం చేసుకోగలం. సాధనతో మనిషి ‘మనీషి’ అవుతాడు. మహాత్ముడవుతాడు. అందుకనే అన్ని ధనాలలోను విశిష్టమైన ధనం, విలక్షంమైన ధనం సాధనం అని అన్నారు మహనీయులు.
పూర్వం ఒక ఊరిలో ఒక గొప్ప శిల్పి ఉండేవాడు. ఓ గొప్ప శిల్పాన్ని తయారుచేసి తన జీవితాన్ని సార్థకం చేసుకవోలనేది అతని కోరిక.
పక్క ఊర్లోని రచ్చబండ తను చెక్కబోయే శిల్పానికి తగిన రాయి అని అనుకున్నాడు. ఆ రచ్చబండని పగలగొట్టడానికి ఆ గ్రామస్తులు ఒప్పుకోరని కూడా తెలుసా శిల్పికి. అందుకని ఓ అర్థరాత్రి మెల్లగా ఆ రచ్చబండని (రాయిని) రహస్యంగా, దగ్గరలో వున్న ఓ మారుమూల రహస్య స్థావరానికి తరలించేడు. తర్వాత మెల్లగా శిల్పాన్ని ఎక్క పనిలో నిమగ్నమైపోయేడా శిల్పి. రాత్రింబవళ్ళు కష్టపడి, ఆ పెద్ద రాయిని ఆంజనేయస్వామి విగ్రహంగా అద్భుతంగా మలిచేడు. విగ్రహం జీవకళ ఉట్టిపడుతూ, అద్భుతాల్లో మరో అద్భుతంగా తయారైంది.
ఆ విగ్రహాన్ని ఎవరికీ తెలియకుండా అతి రహస్యంగా ఏ ఊర్లోనైతే ఆ విగ్రహాన్ని పెడదామనుకున్నాడో ఆ ఊరికి తరలించేడు. ఆ విగ్రహాన్ని మెల్లగా ఆ ఊర్లో వదలిసి పొరుగు దేశనాకి అదృశ్యంలోకి వెళ్లిపోయేడా శిల్పి.
ఆ ఊర్లో అకస్మాత్తుగా దర్శనమిచ్చిన ఆ విగ్రహాన్ని చూసిన గ్రామస్తులు భక్తిప్రపత్తులకి లోనయ్యేరు. ఆలయం కట్టించి విగ్రహాన్ని ప్రతిష్ఠించేరు.కాలక్రమంలో ఆ గ్రామం ఓ గొప్ప పుణ్యక్షేత్రగా మారిపోయింది. కొనే్నళ్ళు గడిచిపోయేయి. ఆ విగ్రహాన్ని ఏం చేసాలో అనే ఉత్సాహం కలిగింది. ఆ ఊరు వెళ్లి విగ్రహం గురించి తెలుసుకోవాలనుకుని ఆ ఊరు వెళ్ళేడు. అం చూసి ఎంతో సంతోషించి తన జన్మ చరితార్థమంది అని అనుకున్నాడు శిల్పి.
ఆ ఊరిలోని ఓ వయసు మళ్లిన ఓ రైతు ఈ శిల్పిని గుర్తుపట్టేడు. ఆలయ కమిటీకి పరిచయం చేసేడు. ఆ శిల్పే ఆ విగ్రహం అంత అద్భుతంగా రావడానికి కారణమని అంతా తెలుసుకున్నారు. అంతటి ప్రాభవానికి వైభవానికి కారకుడైన ఆ శిల్పిని సన్మానించాలనుకున్నారు కమిటీ సభ్యులు.
సన్మాన కార్యక్రమం మొదలైంది. ముఖ్య వక్తతో సహా కార్యక్రంలో పాల్గొన్నవారందరూ ‘ఇంద్రుడు.. చంద్రుడు’ అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. ఆకాశానికి ఎత్తేసారు ఆ శిల్పిని.
చివరగా సన్మాన గ్రహీత, శిల్పి మాట్లాడటం మొదలుపెట్టేడు. ఆ గ్రామస్తుల్ని ఉద్దేశించి ‘‘మీరంతా ఒఠ్ఠి మూర్ఖులు’’ అన్నాడు. ‘‘క్షమించండి, మిమ్మల్ని అవమానపరచాలని నేనలా అనలేదు. మీరంతా ఆ విగ్రహాన్ని నేను అద్భుతంగా తీర్చిదిద్దానని పొగుడుతున్నారు. నిజానికి నేను కొత్తగా చేసిందేమిటి? ఆలోచించండి! ఆ రాయిలోని అక్కరలేని వ్యర్థ పదార్థాన్ని కొంచెం నైపుణ్యం జతచేసి తీసిపారేశాను. అంతే, ఆ రాయి ఓ అద్భుతమైన కళాఖండంగా.. ఓ విగ్రహంగా.. మనం ఆరాధించే దేవుని మూర్తిగా మారిపోయింది’’. అందరూ శిల్పి చెబుతున్న మాటల్ని వింటున్నారు. శిల్ప తన ఉపన్యాసాన్ని కొనగిస్తూ.. మరి మీరో? మనమో? ఒక్కసారి ఎప్పుడైనా ఆలోచించేరా? మనందరిలోను అంతర్లీనంగా ఆ భగవంతుడు దాగి ఉన్నాడు. మనం మనలో ఉన్న ఆ దివ్య చైతన్యాన్ని, అరిషడ్వర్గాలతో కప్పివేస్తున్నాం. మరుగునపరిచేస్తున్నాం. మనతోనే, మనలోనే కాపురముంటున్న కామ, క్రోధ, లోభ, మద మాత్సర్యాలను, అహంభావ, అహంకారం అనే అనవసరమైన వాటిని గురించి, వాటిని నిర్మూలించుకోగలిగితే అంటే మనలోంచి తీసివేయగలిగితే.. మనందరం దివ్యత్వాలుగా ఆవిష్కరింపబడతాం. మనం కూడా దేవుళ్ళుగా ఆవిర్భవిస్తాం. ఈ సూక్ష్మం మీరు గ్రహంచాలనే ఉద్దేశ్యంతోనే మీ కళ్ళు తెరిపించాలనే మిమ్మల్ని ‘మూర్ఖులు’ అనాల్సి వచ్చింది. మిమ్మల్ని నొప్పిస్తే క్షమించండి అని ఉపన్యాసాన్ని ముగించేడా శిల్పి. అందరికీ తమ తప్పు తెలిసొచ్చింది. విషయం అర్థమయింది. సాధనతో జీవుడు, దేవుడిలా ఎలా మారగలడో తెలిసింది.
అవును - సాధన చేయాలి. శోధన చేయాలి. శోధించి సాధించాలి. సాఫల్యం చేసుకోవాలి.

- రమాప్రసాద్ ఆదిభట్ల 9348006669