బిజినెస్

రెండు పంటల సాగుకు జయంతి రోహు చేపలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, ఫిబ్రవరి 7: ఏడాదికి రెండు పంటలు విధానాన్ని చేపల పెంపకానికి వర్తింపచేయాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటోంది. రెండు పంటలు సాగుచేయడానికి అనువైన వెరైటీ చేప పిల్లలను రైతులకు అందించాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ‘జయంతి రోహు’ చేప ఇందుకు అనువైనదిగా గురించామని రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ రమాశంకర్ నాయక్ చెప్పారు. ముఖ్యంగా ఈ వెరైటీ చేప పెరుగుదల ఇతర చేపల కంటే ఎక్కువగా ఉండటంతోపాటు, ధర కూడా ఇతర వెరైటీల కంటే అధికంగా లభిస్తుందన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో బుధవారం మంచినీటి చేపల హేచరీలు, చేపల పిల్లల ఉత్పత్తిదారులు, ఆదర్శ చేపల రైతులతో మత్స్యశాఖ నిర్వహించిన సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన కమిషనర్ రమాశంకర్ నాయక్ విలేఖర్లతో మాట్లాడారు. రాష్ట్రంలో చేపల రైతులకు మంచి రోజులు తీసుకురావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచన చేస్తున్నారని వివరించారు. రెండు పంటలకు అవసరమైన జయంతి రోహు తల్లి చేపలను భువనేశ్వర్‌లోని ‘సిఫా’ నుంచి తీసుకువచ్చి, రాష్ట్రంలోని హేచరీల్లో పెంచాలని భావిస్తున్నామన్నారు. ఇలా పెంచిన సీడ్‌ను 50 గ్రాముల వరకు పెంచిన సీడ్‌ను రైతులకు పంపిణీచేస్తామన్నారు. దీనివల్ల త్వరగా చేపలు పట్టుబడికి వస్తాయన్నారు. దీనివల్ల ఏడాదిలోనే మరోసారి సాగుకు అవకాశం కలుగుతుందన్నారు. దీనిపై ఇప్పటికే నిష్ణాతులైనవారి అభిప్రాయాలను తీసుకున్నామన్నారు. రైతులకు వీటిపై మరింత అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ఆక్వా కల్చర్‌ని రెగ్యులరైజ్ చేసి, క్లస్టర్ల వారీగా విభజన చేస్తామని కమిషనర్ రమాశంకర్ నాయక్ తెలిపారు.

విలేఖర్లతో మాట్లాడుతున్న మత్స్యశాఖ కమిషనర్ రమాశంకర్ నాయక్