Others

సదాలోచనే సన్మార్గానికి దారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనసులో మంచి సంకల్పం అనే బీజం పడితే అది మొలకై, మొక్కై ఎదగడానికి గట్టి కృషి, పట్టుదల, కార్యదీక్ష కలిసి సమిష్టిగా పనిచేస్తాయి.
‘‘మనుషులు ఎదుటివారు చేసిన పనులే చూస్తారు - భగవంతుడు మన మనసులోని సంకల్పాన్ని చూస్తాడు’’. ఒక్కొక్కసారి మంచి సంకల్పంతో మొదలుపెట్టిన పనులు కూడా వెంటనే మంచి ఫలితాన్ని ఇవ్వవు. ఫలితం సరిగా లేదు కనుక నీవు చేసే పనులన్నీ చెడు పనులే అని అనేయకూడదు. అతని సంకల్పమేమిటో చూడాలి. అందులో ఉన్న నిజాయితీచూడాలి. చేతనైతేఅవతలి వారి సంకల్పాన్ని నెరవేర్చడానికి చేయూతనివ్వాలి.
పాండవుల సంకల్పం, వారి ధర్మనిరతి చూశాడు కనుక శ్రీకృష్ణుడు వారితో పాటు నిలిచాడు. పాండవ పక్షపాతి అని అన్నా చిరునవ్వు నవ్వాడు. ఎక్కడైనా భగవంతుడు మంచికి తోడుగా ఉంటాడు.
మంచి వ్యక్తిత్వం ఉంటే మంచి మనుషులుగా ఎద గగలుగుతారు.
రాముడు ధర్మపథంలో నడిచాడు. తండ్రి మాటను నిలబెట్టడానికి పదు నాల్గేండ్లు వనవాసం చేశాడు. అన్యాయంగా రావణుడు రాముని భార్యను అపహరించాడు. ఆమెను ఎన్నో బాధలు పెట్టాడు. కాని రాముడు సీత ఎక్కడుందో కనుగొన్నాడు. అపుడు అంగదుని సంధిచేసుకోమని పంపించాడు.
సీతను నాకు అప్పగించకపోతే యుదాధనికి రమ్మని ఫిలిచాడు. అపుడు కూడా రావణుడు దుష్ట ఆలోచనలతో కూడి ఉన్నాడు కనుక రామరావణ పోరు జరిగింది. లోకకల్యాణ కారకుడైన అగస్త్యుడు వచ్చాడు. రామునికి సూర్యోపాసన చేయమని ఆదిత్యహృదయం బోధించాడు. రామరావణ పోరులో అధర్మపరుడైన రావణుడు నశించాడు. రాముడు విజేతగా నిల్చాడు. త్రేతాయుగం వాడైన రాముణ్ణి నేడుకూడా ప్రశంసిస్తారు. రామునిలాగా జీవించాలని అనుకొంటారు.
పోత పోసిన ధర్మస్వరూపమని కొనియాడుతారు. దీనికంతటి కారణం మాత్రం మంచి సంకల్పం రామునికి ఉండే కనుకనే. అతను నేటికి రాణింపబడుతూనే ఉన్నాడు. దుష్ట సంకల్పాలు ఎవరికైతే ఉంటాయో వారంతా మట్టిలో కలిసిపోవాల్సినవారే. వారి ఆనవాలు కూడా ఎవరూ పట్టించుకోరు. రాముని చరిత్ర చూసి మనం ధర్మాచరణ ఏవిధంగా చేయాలో నేర్చకోవాలి.