పర్యాటకం

తవ్వినకొలదీ తరగని గనులెన్నో (పురాణాల్లో శాస్తవ్రిజ్ఞానం )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారద్వాజ మహర్షి: బృహస్పతి పుత్రుడు ద్రోణాచార్యుని తండ్రి అయిన ఈయన అనేక శాస్త్రగ్రంథాలను రచించారు. అందు ‘అంశుబోధిని’ అను గ్రంథమొకటి. ఈ గ్రంథమందు గ్రహములకు చెందిన సమాచారము - కాంతి (లైట్) ఉష్ణము (ఉష్ణశక్తి -నేడు హీట్ అంటున్నాం), ధ్వని శాస్తమ్రు (సౌండ్), విమాన నిర్మాణ విధి విధానములు, విద్యుచ్ఛక్తి దాని ప్రయోగ విషయముల వంటి అనేక శాస్త్ర విషయాలు చెప్పబడ్డాయి. భరద్వాజ స్మృతి పేరిట ధర్మశాస్త్రాన్నందించారు. భారద్వాజ మహర్షి ‘ఆకాశతంత్ర’ మను మహాగ్రంథాన్ని రచించారు. దీనియందు నేటి శాస్త్ర విజ్ఞానానికి తెలియని అనేక విశేషాలను వివరించారు. ఏడు విధములైన ఆకాశములను, ఆకాశ నేత్రా విభాగాలను, ఆకాశంలో జరిగే అనేక శక్తి సంయోగ వివరాలు, ఆకాశమునందలి భూములు (సూపర్ ఎర్త్- ఇటీవల శాస్తజ్ఞ్రులు చెప్పే మహాభూమి) ఆకాశంలోని కాంతి, శక్తి, అగ్ని, గ్రహములు, గ్రహ కక్ష్యలు తంత్రివార్త శాస్తమ్రు (టెలిఫోన్) వివరించబడ్డాయి. మనవారికి ఆకాశ తత్వము, దాని ఆద్యంతములే పూర్తిగా అవగతమగుటలేదు.
పురాణకాలంలో 32 రకాల విమానాల గురించి వివరించారు. భారద్వాజ మహర్షి యుద్ధ విమానాల గురించి కూడా తన బృహత్ విమాన యంత్ర శాస్త్రంలో వివరించారు. ఏ లోహాలతో విమానాన్ని తయారుచేయాలి, ఎటువంటి ఇంధనాన్ని వాడాలి, పైలట్లు ఆహార వస్తధ్రారణ నియమాల వంటివి తెలియజేశారు మయుడు, భారద్వాజ మహర్షి 16 రకాల విమానలను చెప్పి వాటిని మరలా ఒక్కొక్కదానిని 8 తెగలుగా విభజించి 128 రకాలు చెప్పారు.
ఆధునిక కాలంలో తొలి విమాన నిర్మాతలు రైటు సోదరులు కాదు. వారు 1903 డిసెంబర్ 14న వారి విమానానికి రూపకల్పన చేశారు. కానీ అంతకుపూర్వమే 8 సంవత్సరాల పూర్వం అంటే 1895లో ముంబయి చౌపాతి సముద్ర తీరంలో శివరాంబాపూజి తల్వాడి అనే భారతీయ వేదపండితుడు తయారుచేసిన విమానం గాలిలో 1500 అడుగుల ఎత్తువరకు లేచింది. ఈ విమానానికిఆయన మరుత్యభ అని పేరు పెట్టారు. వేదాలు చెప్పిన తంత్ర విజ్ఞానం ఆధారంగా పాదరసం, సూర్యరశ్మిల సహాయంతో దీనిని నిర్మించారు. బొంబాయి ఆర్టు సొసైటీ ఆధ్వర్యంలో ఆకాశయానం చేయించారు. ఈ విమానాన్ని అప్పటి బరోడా మహారాజు మహాదేవ్ గోవింద రాణా మొదలగు ప్రముఖులు వీక్షించారు. శివరాం బాపూజీ తల్పాడే మరాఠీ భాషలో ప్రాచీన విమాన విద్యేఛాశోధి అనే గ్రంథాన్ని రచించారు. తన భార్య మరణానంతరం నైరాశ్యంలో తన పరిశోధన విరమించుకొన్నారు. ఈయన వారసులు మరుత్సభి విమాన ప్లాన్‌ను ఒక ఆంగ్లేయ కంపెనీకి అమ్మివేశారు.
సనాతన భారతీయ మహర్షుల విజ్ఞానమొక మహా సింధువని చెప్పక తప్పదు. మన ఊహకందని విశ్వ విజ్ఞానాన్ని అందించారు. యుగయుగాల చరిత్రను తవ్వినకొద్దీ తెలిసేదేమంటే, నేటి విజ్ఞాన శాస్త్రానికి విభిన్నమైన పద్ధతిలో ఎనె్నన్నో చిత్ర విచిత్రమైన ఆవిష్కరణలు దర్శనమిస్తాయి. ఈజిప్టులో గ్రీస్‌లో, చైనాలో బయటపడ్డ ఆవిష్కరణల గురించి ఆరాటపడేవారు. భారత ఉపఖండంలో వెలుగు చూసిన అద్భుత వైజ్ఞానిక ఆవిష్కరణలపై దృష్టి సారించి, నేటి పరిశోధనలకు అనుసంధానం చేసుకుని పురోగమిస్తే వైజ్ఞానికంగానే కాక సర్వతోముఖాభివృద్ధి సాధించుకోవచ్చు. ఏదో సింధులోయలో హరప్పా, మొహంజదారో నాగరికతను గురించి ఇంకేవో తవ్వకాలలో దొరికిన వాటి గురించి నాలుగు మాటలు విని మురిసిపోవటం కాదు. భరతభూమిలోని ప్రతి నదీ తీరంలోను, ప్రతి పర్వత శ్రేణిలోను, విజ్ఞాన విభావరులు కాంతులీనిన దాఖలాలనేకం కనిపిస్తాయి. కాలగర్భంలో కలిసిపోయినవిగా మన మహర్షులందించిన విజ్ఞానమపారం. మహర్షులందించిన విజ్ఞాన గ్రంథాలను కొన్నింటిని చూద్దాం.
- ఇంకా ఉంది

డా॥ గుడిపాటి వి.ఆర్.ఆర్.ప్రసాద్