విజయవాడ

రాష్ట్ర బంద్‌కు సర్వసన్నద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), ఫిబ్రవరి 7: రాష్ట్ర విభజన హామీల అమలు, ప్రత్యేక హోదా కల్పనలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలకు వ్యతిరేకంగా వామపక్షాలు పిలుపునిచ్చిన రాష్ట్ర బంద్‌కు విపక్ష పార్టీలు సమాయత్తమయ్యాయి. బంద్ విజయవంతానికి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తికాగా శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా నగర పోలీసులు విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఎన్‌డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగో బడ్జెట్‌లోనూ విభజన హామీల ప్రకారం రాష్ట్రానికి నిధులు కేటాయించకపోవడంతో పాటు రాజధాని నిర్మాణం, పోలవరం వంటి బహుళార్థ సాధక ప్రాజెక్టు విషయంలోనూ నిర్లక్ష్యం వహించడం, కేంద్రంలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రయోజనాలను కాకుండా రాజకీయ స్వప్రయోజనాలకే పరిమితమై రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు నష్టం చేకూర్చటాన్ని నిరసిస్తూ వామపక్షాలు పిలుపునిచ్చిన రాష్ట్ర బంద్‌కు కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ బహిరంగంగా మద్దతు పలకడమే కాకుండా బంద్‌లో భాగస్వాములవుతున్నాయి. విపక్ష పార్టీలకు చెందిన వివిధ కార్మిక, మహిళా, విద్యార్థి, ప్రజా సంఘాలు కూడా సంపూర్ణ మద్దతు తెలిపాయి. ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య నగర శాఖ, భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ), ఏపీ బీసీ సంఘం, బెజవాడ బార్ అసోసియేషన్, వస్తల్రత క్లాత్ మర్చంట్స్ అసోసియేషన్, కృష్ణవేణి క్లాత్ అసోసియేషన్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, ఫిలిమ్ ఛాంబర్ అండ్ ఇండస్ట్రీ, లారీ ఓనర్స్ అసోసియేషన్, హోటల్ ఓనర్స్ అసోసియేషన్, ఆటోనగర్ టెక్నీషియన్స్ అసోసియేషన్, ఐలా, తదితర సంస్థలు కూడా బంద్‌కు మద్దతిచ్చాయి. విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, రవాణా, వ్యాపార సంస్థలపై తీవ్ర ప్రభావం చూపే ఈ బంద్‌కు ప్రజలు కూడా సహకరించాలని విపక్షాలు కోరుతున్నాయి. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా బంద్ విజయవంతానికి రాష్ట్ర ప్రభుత్వం, అధికార టీడీపీ నేతలు, ప్రజాప్రతినిధులు కూడా సహకరించాలని విపక్షాలు కోరుతున్నాయి.

21న శ్రీకాకుళంలో పవన్‌కళ్యాణ్
పర్యటనను అడ్డుకుంటాం
* ఏపీ గిరిజన సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు రవి
విజయవాడ (ఎడ్యుకేషన్), ఫిబ్రవరి 7: శ్రీకాకుళంలో మత్స్యకారుల మీద దాడి చేశారని 200మంది అమాయక గిరిజన నాయకుల మీద రాష్ట్ర ప్రభుత్వం అక్రమకేసు నమోదు చేయడం దారుణమని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘాల జేఏసీ అధ్యక్షుడు పాలకీర్తి రవి అన్నారు. బుధవారం ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గిరిజనులపై కేసులు ఎత్తివేయకపోతే 13జిల్లాల్లో ఏపీ గిరిజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఇతర కులాలను గిరిజన తెగలలోకి తీసుకువచ్చి ఆదివాసీల బతుకులను చీకటి చేయాలని కుట్ర చేస్తున్నారన్నారు. నిన్న కాక మొన్న రాజకీయాల్లోకి వచ్చి రాజకీయం అంటే ఏమిటో తెలియని జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ మత్స్యకారులను గిరిజన తెగల జాబితాలో చేర్చడంపై మద్దతు ప్రకటించడం హాస్యాస్పదమన్నారు. బోయ సామాజిక వర్గాన్ని తమ జాబితాల్లో చేర్చడానికి ఒక పక్క కుట్ర జరుగుతుందని దానిని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేస్తూంటే మరో పక్క ప్యాకేజీల పవన్‌కళ్యాణ్‌గా పేరుతెచ్చుకున్న ఆయన మత్య్సకారులను ఎస్టీ జాబితాలో చేర్చాలని తాను మద్ధతు తెలుపుతానని అనడం దారుణమని తక్షణం తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని లేకుంటే 21న శ్రీకాకుళంలో జరగనున్న పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించారు. అటవీ ప్రాంతాల్లో నాగరికతకు ఎంతో దూరంగా జీవిస్తున్న గిరిజన తెగలకు అన్యాయం చేయాలని కుట్రలు చేయడం దారుణమన్నారు. ఈ సమావేశంలో ఉపాధ్యక్షుడు బాబూరావు, టీడీఏ చైర్మన్ నాగేశ్వరరావు, కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రయ్య, శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

అరెస్టులతో బంద్‌ను ఆపలేరు
* నాన్ పొలిటికల్ జెఏసీ
విజయవాడ (ఎడ్యుకేషన్), ఫిబ్రవరి 7: అరెస్టులతో గురువారం జరగనున్న రాష్ట్ర బంద్‌ను ఎవ్వరూ ఆపలేరని, బంద్‌తో కేంద్ర ప్రభుత్వానికి చెమటలు పట్టిస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి ఎం మధు అన్నారు. బుధవారం ప్రెస్‌క్లబ్‌లో ఆంధ్రప్రదేశ్ నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా, బడ్జెట్, విభజన చట్టంలో పొందుపరచిన అంశాలపై రాష్ట్ర సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో శాసనమండలి సభ్యుడు బొడ్డు నాగేశ్వరావు, సీపీఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్, మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు మల్లాది విష్ణు, మాజీ శాసనమండలి సభ్యుడు లక్ష్మణరావు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు కొలనుకొండ శివాజీ, పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు. 8న జరగనున్న బంద్‌ను అందరూ జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి వారితో పోరాటం చేయిస్తామన్నారు. బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని, విభజన చట్టంలో ఉన్న హామీలను తుంగలో తొక్కుతున్నారని వారు ధ్వజమెత్తారు.

ఆధ్యాత్మిక శిఖరం.. గుణదల కొండ
* గుణదలమాత 91వ ఉత్సవాలకు విస్తృత ఏర్పాట్లు
* విద్యుత్ కాంతులీనుతున్న పుణ్యక్షేత్రం
* రేపటి నుండి తిరునాళ్లు ప్రారంభం
పటమట, ఫిబ్రవరి 7: క్రైస్తవ మత విశ్వాసానికి నిలువెత్తు ఆధ్యాత్మిక శిఖరం గుణదల కొండ. భక్తుల ఆధ్యాత్మిక పవిత్ర పుణ్యక్షేత్రంగా గుణదలమాత విరాజిల్లుతోంది. దేశవ్యాప్తంగా ప్రఖ్యాతి పొందిన ఈ పుణ్యక్షేత్రానికి ఎంతో ఘన చరిత్ర ఉంది. 91 మహోత్సవాలకు పుణ్యక్షేత్రం సన్నద్ధమైంది. ఈ నెల 9, 10, 11 తేదీల్లో జరగనున్న ఉత్సవాలకు దేశ, విదేశాల నుండి కులమతాలకు అతీతంగా లక్షలాది మంది భక్తులు తరలివచ్చి గుణదలమాతను దర్శించుకుంటారు. 3రోజులు జరిగే ఉత్సవాలకు గుణదలకొండ, మరియమాత పుణ్యక్షేత్రాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. దేశంలో ప్రసిద్ధ క్రైస్తవ పుణ్యక్షేత్రాలలో ఇదొకటి. సెయింట్ జోసెఫ్స్ ఇన్‌స్టిట్యూట్ రెక్టర్ ఆర్లాటి స్వాములవారు 1925లో గుణదల కొండపై ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన గుహలో మరియతల్లి స్వరూపాన్ని ప్రతిష్ఠించారు. 1927 నుండి విజయవాడ కతోలిక క్రైస్తవులు ఏటా ఫిబ్రవరి 11న గుణదలమాత ఉత్సవాలు జరుపుతూ వస్తున్నారు. క్రమేపీ భక్తుల రాక పెరగటంతో భక్తుల రద్దీ మేరకు ఉత్సవాలను ఫిబ్రవరి 9, 10, 11 తేదీల్లో నిర్వహించటం సంప్రదాయంగా వస్తోంది. ఈ ఏడాది 91వ ఉత్సవాలకు గుణదలమాత పుణ్యక్షేత్రం ముస్తాబైంది. కొండ దిగువ భాగంలోని గుణదలమాత ప్రధాన చర్చి, బిషప్ గ్రాసి హైస్కూల్ గ్రౌండ్, సెయింట్ జోసఫ్స్ ఐటీటీ గ్రౌండ్, గుణదల కొండను విద్యుత్ దీపాలతో అలకరించటంతో పుణ్యక్షేత్రం పరిసరాలన్నీ విద్యుత్ ధగధగల మధ్య ఉత్సవ శోభతో మెరిసిపోతున్నాయ. గుణదలమాత పుణ్యక్షేత్రం కతోలిక పుణ్యక్షేత్రం అయినప్పటికీ ఇక్కడ భారతీయ సంస్కృతి, సంప్రదాయలు దర్శనమిస్తాయి. గుణదలమాతను దర్శించుకునే భక్తులు తల్లివద్ద కొబ్బరికాయలు కొట్టటం, తలనీలాలు సమర్పించుకోవటం, పసిపిల్లలకు అన్నప్రాసన చేయించటం, కొత్త వాహనాలకు ఫాదర్ల చేత ఆశీర్వచనాలు, పిల్లలు లేనివారు కొండపై చెట్లకొమ్మలకు ఊయలు వేయటం వంటివి ఇక్కడ దర్శనమిస్తాయి. ఈ సంవత్సరం గుణదలమాత తిరునాళ్లకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని విజయవాడ కతోలిక పీఠం బిషప్ తెలగతోటి జోసఫ్ రాజారావు, మోన్సిగ్నోర్ మువ్వల ప్రసాద్ సూచనలతో గుణదలమాత పుణ్యక్షేత్రం రెక్టర్ యేలేటి విలియం జయరాజు గుణదల ఏలూరు రోడ్డు నుండి పుణ్యక్షేత్రం వరకు నూతనంగా విశాలమైన సీసీ రోడ్డును నిర్మించారు. బిషప్ గ్రాసి హైస్కూల్ గ్రౌండ్‌కు ఆధునికతను జోడించి కొత్తగా విశాలమై ఆధ్యాత్మిక, కళావేదికను నిర్మించారు.