శ్రీవిరించీయం

సర్వరోగనివారిణి సంగీత విభావరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సప్తస్వరాల సంగీత సమ్మేళనంలో ఎన్నో వేలాది కృతులను రచించిన త్యాగయ్య, రామదాసు, ముత్తుస్వామి దీక్షితార్, పురందరదాసు, స్వాతి తిరునాళ్ వంటి మహానుభావులను స్మరించుకుంటూ ప్రతినిత్యం ఉభయ సంధ్యా సమయంలో సంగీత సాధన పూర్వజన్మ సుకృతం, భగవంతుని వరం అని సంగీత విద్వాంసురాలు కావూరి హేమలక్ష్మి అన్నారు. శాస్ర్తియ సంగీత గాత్రంలోను, వీణ వాయిద్యంలోను తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న హేమలక్ష్మి ఆంధ్రభూమితో తన అనుభవాలను పంచుకుంది. చిరుప్రాయంలోనే సంగీత శిక్షణ ప్రారంభించి తొలుత గాత్రం తరువాత వీణా వాయిద్యంలోను శిక్షణ పొందారు. తన స్నేహితులు పద్మాచక్రవర్తి, నాగలక్ష్మిలతో కలిసి వీణత్రయంగా కచేరీలు చేస్తూ అశేష ప్రజల ఆదరాభిమానాలు పొందారు. శ్రీకాళహస్తి క్షేత్రంలో జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామి సన్నిధిలో తమ వీణాగానంతో కనుల ముందు పార్వతీ పరమేశ్వరుల సాక్షాత్కారం లభించినంత గొప్పగా కచేరీ చేశామని చెప్పారు. 2013లో సింహపురి సాహిత్య సంగీత సభ వారిచే ‘జీవిత సాఫల్య పురస్కరం’, జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ వారిచే ‘ఔట్‌స్టాండింగ్ ఫెర్‌ఫార్మెన్స్’ అవార్డు అందుకున్నానని తెలిపారు. ఈ పురస్కారాలు తమ బాధ్యతను పెంచాయని తెలిపారు. స్ర్తిలు కళల్లో శిక్షణ తీసుకుని ఉన్నత శిఖరాలు అందుకోవాలంటే చిన్నతనంలో తల్లిదండ్రుల ప్రోత్సాహంతోపాటు వివాహమైన తరువాత భర్త ప్రోత్సాహం లభించాలని, ఈ విషయంలో తాను చాలా అదృష్టవంతురాలనని చెప్పారు. సాయంత్రం సమయంలో భర్త ఆఫీసు నుండి వచ్చే సమయంలో తాను శిష్యులతో సంగీత సాధన చెయ్యడం చూసి తన భర్త మాతోపాటు కూర్చొని సంగీతాన్ని ఆస్వాదించడం తనకెంతో ఆనందాన్ని సంతృప్తిని కలిగిస్తుందని హేమలక్ష్మి చెప్పారు. శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ద్వారా ఎం.ఏ (సంగీతం)లో బంగారు పతకాన్ని సాధించానని, ఈ గొప్పతనం తన భర్త కావూరి వెంకట సత్యనారాయణమూర్తికే దక్కుతుందని ఆమె అన్నారు. 1995లో ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయంలో సంగీత ఉపాధ్యాయురాలిగా బాధ్యతలు స్వీకరించి 12 సం.లు ఉద్యోగ బాధ్యతలు తను నిర్వహించి సంగీత సాధనకు సమయం వీలు దొరకనందున ఆ ఉద్యోగానికి రాజీనామా చేశానని హేమలక్ష్మి చెప్పారు. తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి సన్నిధిలో బెజవాడ కనకదుర్గ, శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి సన్నిధిలో తదితర కళావేదికలపై ఎన్నో వేలాది ప్రదర్శనలు ఇచ్చానని, సంగీత కళా ప్రదర్శనలలో సంతృప్తి, దైవం అనుగ్రహం లభించింది కనుకనే తాను ఇంకా సంగీత సాధన చేస్తూ కొత్త పోకడలకు శ్రీకారం చుడుతున్నానని హేమలక్ష్మి చెప్పారు. ప్రస్తుతం ఆన్‌లైన్ ద్వారా విదేశాలలో వుండే సంగీతాభిమానులకు శిక్షణ ఇస్తున్నానని, ఎంతోమంది విద్యార్థులకు సంగీత శిక్షణతో పాటు ప్రదర్శనలు కూడా ఇప్పించానని చెప్పారు. తన ప్రదర్శనలతో గవర్నర్, ముఖ్యమంత్రి, గతంలో కేంద్ర మంత్రిగా వున్న వెంకయ్య నాయుడు, సినీ గాయకులు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం చేతులమీదుగా సన్మానం, అవార్డు అందుకున్నానని హేమలక్ష్మి సంతోషంగా చెప్పారు. సంగీతం పరమ ఔషధం అనీ, సంగీతంతో మూర్ఖునికి జ్ఞానోదయం కలిగించవచ్చునని, పామరుడిని కూడా విద్వాంసునిగా మార్చవచ్చునని నమ్మిన తాను విజయవాణి సంగీత విద్యాలయం స్థాపించి ఎంతోమందికి సంగీతాన్ని నేర్పిస్తూన్నాని చెప్పారు.

- మురళీధర్