Others

ఆశ ఖరీదు అణా (గోరాశాస్ర్తి గారి రేడియో నాటిక)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇం: అలాగే వుంది. ఆయాసం పొద్దున్నకంటే ఎక్కువైంది.
కృ: అయ్యో పాపం! లక్ష్మేదీ?
ఇం: అమ్మ గదిలో ఉంది. పిలవనా?
లక్ష్మి: (ప్రవేశిస్తూ) ఏం కృష్ణవేణీ! ఇంకా నిద్రపో లేదేం? పగలల్లా ఆఫీసులో కష్టపడి మళ్లీ సాయంత్రం అందరికీ వండి వార్చి-
కృ: ఏవుందీ మామూలు గొడవే! రాను రాను బతుకంటే అసహ్యం వేస్తోంది.
లక్ష్మి కొత్తగా ఇప్పుడేం వచ్చింది? అన్నయ్య పురాణమేనా?
కృ: అదే. వాడు సరిగ్గా రెండువందల యేళ్ళ క్రితం పుట్టవలసినవాడు. ఆ పొరపాటుకి శిక్ష అనుభవిస్తున్నది నేను. అమ్మ సరేరి. తన పక్షవాతం జబ్బు తలుచుకుని మురి సిపోతూ మంచంమీద ఉంటుంది. మరో ప్రపంచ యుద్ధం వస్తేగాని అన్నయ్యకి ఉద్యోగం దొరికేటట్టు లేదు. అంచేత వాడికెందుకో నామీద కసి. నా జీతం అంటే మళ్లీ అభిమానమే.
ఇం: ఊరుకుందూ- వింటాడేమో!
కృ: లేదులే, పెట్టవలసిన శాపాలన్నీ పెట్టేసి ఇప్పుడే నిద్రపోయాడు. మళ్లీ పొద్దున్న కాఫీవేళకిగాని లేవడు.
లక్ష్మి: దేనిమీదొచ్చినదీ రభస?
కృ: ఆ మేడ గదిలో ఎవరో ఆయన కొత్తగా దిగలేదూ? ఆయన ప్రసంగం తీసుకొచ్చే సరికి వచ్చింది దుమారం. వాడి గొడవ నాకెందుకంటాడు. అని మళ్లీ మా పురాణం అంతా ఏకరువు పెట్టి తను సంసారాన్ని పోషించగలిగిన ఉత్తర క్షణం నన్ను ఉద్యోగం మానిపించేస్తానంటాడు.
ఇం: పోనీ, అప్పటి సంగతి అప్పుడే చూసుకుందాం అనలేకపోయావా?
కృ: (కోపంగా) అంటానంటాడు. అనను మరీ! ఆడవాళ్లకి సహగమనం మాన్పించారే అని విచారించే మనిషి వాడు.. (కంఠం మార్చి).. అంతే ఇందిరా.. మనం ఎంత అభిమానంగా చేతులు చాస్తామో అంత స్వార్థంగా వెనక్కు నెట్టేస్తారంతా.
లక్ష్మి: ఎప్పుడూ ఇలాంటి విషయాలు లెక్కచే యకుండా నిబ్బరంగా తరిగేదానివి కదా, ఇవాళేం ఇంత బాధపడిపోతున్నావు?
ఇం: కృష్ణవేణికి ముసలితనం వచ్చేసింది.
కృ: ఎంతకాలమని పోట్లాడుకురాను చెప్పు లక్ష్మీ! ఏనాటికైనా వాళ్ళునన్ను అర్థం చేసుకోకపోతారా అన్న ఆశతో యిన్నాళ్ళూ నెట్టుకొచ్చానరు, అవస్థలు పడుతూనే. కాని ఇందాకటితో వెనె్మక విరిగిపోయింది.
ఇం:అన్నీ మరిచిపోయి హాయిగా నిద్రపోదూ! తెల్లారేసరికి మళ్లీహాయిగా వుంటావు.
కృ:
ఆశ పూర్తిగా పోయింది. వీళ్ళు నాకేమేనా అదృష్టం వుంటే దాన్ని పెంచుకోనివ్వరు. దురదృష్టాన్ని తుంచుకోనివ్వరు. సగం చచ్చిన నల్లిలా ఇలా బతకమంటారు. పైపెచ్చు కుటుంబం కోసం ఆ మాత్రం త్యాగం చెయ్యలేవా అంటారు. ఎవరి త్యాగం? దేనికి త్యాగం? జల్లెడలో పోసిన నీరులాగా ఆ త్యాగం గాలిలో హరింపోతుందిగాని ఎవరికీ తులమెత్తు లాభం చెయ్యదు.
లక్ష్మి: ఇందిరా! మఅమకి నిద్రపట్టిందా?
ఇం: ఆ, కాస్త కన్నుమూసి నిద్రపోయిది.
కృ: అన్నట్లు మరచిపోయాను. ఏమిటో నా గొడవ నాది. ఎలా వుంది అమ్మగారికి?
ఇం: చెప్పానుగా ఇందాక! అలాగే ఉంది. ఆయాసం కాస్త ఎక్కువైంది.
ల: అన్నయ్యింకా రాలేదు0- ఎంచేతో?
కృ: అదేవిటీ? ఇంత రాత్రయినా రాకపోవడ మేమిటీ?
ల: ఏం చెప్పను? వాడి ధోరణి అంతా అదో మారిది. ఇంకా మేమే నయం. వాడు బొత్తిగా పిరికి. అడుగడుగునా మేమే ధైర్యం చెపుతూ ఉండాలి. నాన్నని తలచు కొని, అన్యాయంగా జైలుకెళ్లిపోయాడే అన ఏడుస్తాడు. అమ్మని తలచుకొని బాధపడతాడు. ఇటు మమ్మల్నిద్దరినీ చూని కన్నీళ్లు కారుస్తాడు. ఎక్కడైనా కాస్త టెంపరరీ ఉద్యోగమైనా దొరుకుతుందే మోనని అలా తిరుగుతున్నాడు.
కృ: పాపం! ఇంతరాత్రయిందికదా, భోజనం లేకండా ఎక్క తిరుగుతున్నాడో?
ఇం: లక్ష్మీ! నేను కాస్త వీధి దాకా వెల్లి చూసి రానా?
లక్ష్మి: చూసిరా! కాస్త బయటి ప్రపంచమేనా కనబడుతుంది. నేనుఅమ్మ దగ్గరుం టాను.
కృ: పద ఇందిరా! నేనూ వస్తాను!
ఇం: మీ అన్నయ్య కోప్పడరూ?

- సశేషం
(ఆకాశవాణి సౌజన్యంతో...)

................................................................
రచనలు పంపవలసిన చిరునామా: ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్, సికింద్రాబాద్-500 003