Others

కాగిత్తప్పడవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ రోజంతా అచ్చంగా నాదే
ఇంటికి వచ్చీ రావటంతోనే
రారమ్మని పిలిచే సన్నజాజి తీగెలు
పెరట్లోకి ఇంకా తొంగి చూడలేదనే కోపంతో
తూనీగల దండులా చేసే దాడిని
మురిపెంగా వారిస్తుంటే
కొన్ని అలకలుః
మరికొన్ని వేడుకోళ్లు
వెక్కిరిస్తూ కొన్ని
వేదనలో ఇంకొన్ని

ధనుర్మాసపు మంచులో
నువ్వూ నేను తడిసిన సందర్భాలన్ని
ఒక్కో మొక్కా పట్టి చూపిస్తుంటే
ఒక్కో పూవూ ఒక్కో తలపుల
పేజీల్ని తిప్పుతుంటే
ఆ ఊసుల్లో ప్రవహించటం
మనం నదులమని గుర్తు చేయటమేగా

మత్తో మైకమో
ఏకాంతపు రుచిని
మరిగిందిక్కడే మరి
నీదో జీవితం
నాదో జీవితం
మనదొక్కటే జీవితమనే
ఊహల లోకంలోకి ఎగిరేలా నేర్చింది
ఈ గూటిలోనేగా

ఒక ఆనందాన్ని
ఒక వేదనను
ఒక సంతోషాన్ని
ఒక ఆసక్తిని
చినుకుల్లా చల్లిన
ఈ అక్షర నక్షత్రాల్లో
మనసు గిరికీలు కొడుతుంటే
ఒక క్షణం ఆశ్చర్యం
ఒక క్షణం నిస్సారం
కాలపు పిట్టకెంత ఆవేశమో
మనకింత నిస్సహాయితల్ని రాలుస్తూ

ఇప్పుడు
ఇదో ఘనీభవించిన సరస్సు
సాగిపోలేని కాగిత్తప్పడవలతో

-లాస్య ప్రియ కుప్పా 9640551664*