Others

ఆణిముత్యాల కరదీపిక సారస్వత సరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు, ఆంగ్లం, సంస్కృత భాషలను చక్కగా అధ్యయనం చేసి ఆధ్యాత్మిక, ఇతిహాస, నీతి గ్రంథాల నుంచి ఆణిముత్యాల లాంటి అంశాలను 112 పేజీలలో అందించడం అంటే కత్తిమీద సాము లాంటిదే. సారస్వత సరాలు అనే విలువైన పుస్తకాన్ని డాక్టర్ శ్రీమతి కె అరుణావ్యాస్ అందించారు. ఈ కరదీపికలో 17 అంశాలపై రచయిత్రి చక్కగా విపులీకరించారు. ప్రముఖ సాహితీవేత్త చిలకమర్తి రాసిన రావమ్మా మహాలక్ష్మీ రావమ్మా అనే నాలుగు పంక్తుల అద్భుతమైన పద్యాన్ని అందించారు. ఇంత మంచి పద్యం మన సాహిత్యంలో ఉన్న సంగతి సాహితీవేత్తలకు మాత్రమే తెలుస్తుంది. తెలుగు భాషను సుసంపన్నం చేసిన మహా రచయితల పేర్లు ఈ పుస్తకంలో దర్శనమిస్తాయి. తెలుగు సాహిత్యాన్ని ఔపోసన పట్టినవారే ఇంత చిన్న పుస్తకంలో అనేక అంశాలను స్పృశించగలుగుతారు. తెలుగదేలయన్న దేశంబు తెలుగు, ఆడవాళ్లు- ఆత్మరక్షణ, కొడిగడుతున్న చిరుదివ్వెలు, సదా మీ సంరక్షుణ్ణి, వినిపించని రాగాలు, పువ్వులు విరిసిన నవ్వులు, అతి మధురం అన్నమయ్య పదం, రామాయణ పాత్రల వైశిష్ట్యం, నాటి గుర్తుల నీడలో సాహిత్యంతో సేద, బుల్లితెర విన్యాసాలలో పేర్కొన్న అనేక అంశాలు బాగున్నాయి. మనోవేదనతో తల్లడిల్లే వారికి ఉపశమనం ఇచ్చే విధంగా రచయిత్రి అనేక అంశాలను ఒక్కో శీర్షికలో పొందుపరిచారు. విద్వేషాలతో కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్న ప్రస్తుత సమాజానికి ఉపయోగపడే విధంగా శ్రీరామచంద్రుడి సందేశాన్ని ప్రస్తావించారు. శ్రీరామచంద్రుడు విభీషణుడికి అతని సోదరుడు రావణుని దహన సంస్కారాలు చేయాలని ఆదేశిస్తారు. ‘వైరాలు అనేవి చావుతో ముగుస్తాయ్, మేము అనుకున్న పని పూర్తయింది. ఇతనికి దహన సంస్కారాలు చేయి. ఇతను నీకెంతో నాకూ అంతే అని శ్రీరామచంద్రుడు విభీషణుడికి బోధిస్తారు. రామా ఏమి క్షమాగుణం, ఎంతటి ఔదర్యం, ఆకాశమంత ఎత్తు ఎదిగిన సంస్కారం, అందుకే లక్ష్మణుడు, ‘రిపుణామ పివత్సవ’ అని రాముడిని ప్రశంసించాడు అనే నీతి వాక్యాలను రచయిత్రి సేకరించి రాశారు. శత్రువు, రాక్షసుడైన రావణుడిని పొగడడానికి ఎంత సంస్కారం, నైతిక బలం కావాలని రావణుడు మరణించాక విభీషణుడు దహన సంస్కారాలు చేయనంటే, రాముడు వారించి చేయమంటారు. ఈ పుస్తకంలో నీతి సంబంధమైన అనేక విషయాలు చదువరులను ఆకట్టుకుంటా యనడంలో సందేహం లేదు. ఈ పుస్తకాన్ని తెలంగాణ డిజిపి కార్యాలయంలో ఉన్న తెలంగాణ సురక్ష పబ్లికేషన్స్ ప్రచురించింది.

- కెవిఎస్