రాష్ట్రీయం

సాగర్‌ను పరిశీలించిన ఎస్‌పిఎఫ్ కమాండెంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగార్జునసాగర్, జనవరి 23: నాగార్జునసాగర్ ప్రాజెక్టు డ్యాం భద్రతలో తీసుకుంటున్న చర్యలను శనివారం స్పెషల్ ప్రొటెక్షన్‌ఫోర్స్ కమాండెంట్ అన్వర్‌పాషా ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు. ప్రస్తుతం దేశంలో నెలకొని ఉన్న ఉగ్రవాద దాడుల దృష్ట్యా అన్ని రాష్ట్రాలలోనూ భద్రతపై ప్రభుత్వాలు కట్టుదిట్టం చేశాయి. ఇంటెలిజెన్స్ నివేదికతో ఆయా రాష్ట్రాలు సమస్యాత్మకమైన, సున్నితమైన ప్రాంతాలలో వాటికి సంబంధించిన అధికారులను ఇప్పటికే అలర్ట్ చేశారు. దీనిలో భాగంగా అంతర్జాతీయ పర్యాటక కేంద్రం నాగార్జునసాగర్ ప్రాజెక్టును శనివారం ప్రాజెక్టు భద్రత విధులు నిర్వహించే స్పెషల్ ప్రొటెక్షన్‌ఫోర్స్ ఉన్నతాధికారి కమాండెంట్ ఆకస్మికంగా తనిఖీ చేసి పరిశీలించడం ప్రాముఖ్యతను సంతరించుకుంది.
ఈ సందర్శనలో భాగంగా నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలోని ముఖ్య ఎస్‌పిఎఫ్ చెక్‌పోస్టులైన ఎడమకాల్వ ప్రధాన ద్వారం, కుడికాల్వ ప్రధాన ద్వారం, డ్యాం గ్యాలరీల వద్ద, కుడి, ఎడమ కాల్వల ఎర్త్‌డ్యాంల ప్రధాన ద్వారం వద్ద, ప్రధాన డ్యాంపై భద్రత స్థలాల చెక్‌పోస్టులను ఆయన పరిశీలించారు. అనంతరం ఎస్‌పిఎఫ్ కార్యాలయంలో రిపబ్లిక్ డే సందర్భంగా నిర్వహిస్తున్న క్రీడాపోటీలను ఆయన ప్రారంభించారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితిని దృష్ట్యా సాగర్ ప్రాజెక్టుకు భద్రతను కట్టుదిట్టం చేశామని, ప్రస్తుతం ఉన్న సిబ్బంది డ్యాం భద్రతకు సరిపోయేంతగా ఉన్నారని, అవసరమైతే మరింత సిబ్బందిని పెంచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. డ్యాం భద్రత విషయంలో గతంలో నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు భద్రత సిబ్బందికి అన్ని ఏర్పాట్లు చేయడానికి ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. నాగార్జునసాగర్ లాంటి సున్నితమైన ప్రదేశాల వద్ద తమ భద్రత దళాలను అలర్ట్ చేశామని ఆయన తెలిపారు. ఆయనతోపాటు ఎస్‌పిఎఫ్ ఎన్స్‌పెక్టర్ భాస్కర్, జెన్‌కో ఎస్‌పిఎఫ్ ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, ఎఎస్‌ఐ అశోక్‌లు ఉన్నారు.