క్రీడాభూమి

సింధు సంచలనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెనాంగ్, జనవరి 23: భారత ఏస్ షట్లర్ పివి సింధు ఇక్కడ జరుగుతున్న మలేసియా మాస్టర్స్ గ్రాండ్ ప్రీ బాడ్మింటన్ టోర్నమెంట్ మహిళల సెమీ ఫైనల్‌లో సంచలన విజయాన్ని నమోదు చేసింది. టాస్ సీడఇ జీ హ్యున్ సంగ్ (కొరియా)ను ఆమె 21-19, 12-21, 21-10 తేడాతో ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 12వ స్థానంలో ఉన్న సింధు 2013లో మలేసియా గ్రాండ్ ప్రీని గెల్చుకుంది. ఆతర్వాత వరుసగా మూడేళ్లు మకావూ ఓపెన్ టైటిళ్లను అందుకుంది. రెండోసారి మలేసియా గ్రాండ్ ప్రీని కైవసం చేసుకునే పట్టుదలతో ఉన్న ఆమె రెండో సెట్‌ను హ్యున్ సంగ్ చేతిలో కోల్పోయినప్పటికీ, మూడోసెట్‌లో ఎదురుదాడికి దిగి విజయభేరి మోగించింది. ఫైనల్‌లో ఆమె టైటిల్ కోసం కిర్‌స్టీ గిల్మోర్‌తో తలపడుతుంది. మరో సెమీ ఫైనల్‌లో కిర్‌స్టీ 12-21, 21-18, 21-8 స్కోరుతో యూ హషిమొటోపై గెలిచి ఫైనల్‌లో స్థానం సంపాదించింది.
శ్రీకాంత్ అవుట్
పురుషుల సింగిల్స్ సెమీ ఫైనల్స్‌లో భారత వీరుడు, రెండోసీడ్ కిడాంబి శ్రీకాంత్‌కు పరాజయం ఎదురైంది. ఇక్సందర్ జైనుద్దీన్‌తో తలపడిన అతను మొదటి సెట్‌లో కడవరకూ పోరాడినప్పటికీ ఫలితం లేకపోయింది. ఆ సెట్‌ను 25-37 తేడాతో కోల్పోయాడు. ఈ సెట్ తర్వాత పూర్తిగా అలసిపోయినట్టు కనిపించిన అతను రెండో సెట్‌లో ఏమాత్రం పోటీ ఇవ్వకుండానే 9-21 తేడాతో ఓడాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 51వ స్థానంలో ఉన్న ఇక్సందర్ అనూహ్యంగా ఫైనల్ చేరాడు. టైటిల్ పోరులో అతనికి ప్రపంచ నంబర్ వన్ లీ చాంగ్ వెయ్ ఎదురవుతాడు. మరో సెమీ ఫైనల్‌లో చాంగ్ వెయ్ 21-19, 21-15 స్కోరుతో టామీ సుగియార్తోను ఓడించి ఫైనల్ చేరాడు.