తెలంగాణ

థళారీల బాధ నుంచి రైతులను కాపాడండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 13: దళారీల చర్యలతో తీవ్రంగా నష్టపోతున్న రైతులను కాపాడాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. సుబుబాబులు, జామాయిల్ రైతులను దళారులు శ్రమదోపిడీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రమదోపిడీకి వ్యతిరేకంగా ఈనెల 16న సారపాకలోని ఐటీసీ పరిశ్రమ ముందు నిర్వహించనున్న ధర్నాకు సీపీఐ(ఎం) సంపూర్ణ మద్దతు నిస్తుందని చెప్పారు. ఖమ్మం జిల్లాలో లక్షా, 10వేల ఎకరాలలో సుబాబులు, జామాయిల్ పంటలు సాగు చేస్తున్నారని, ధరలు పడిపోయి గిట్టుబాటు ధరలు అందడం లేదని అన్నారు. ఫ్యాక్టరీకి ముడి సరుకు అందిస్తున్న రైతుల పట్ల ఐటీసీ యాజమాన్యం ఇష్టానుసారంగా వ్యవహరిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఏకంగా ఫ్యాక్టరీలోనే దళారులు తిష్టవేసి టన్నుకు రూ. 4,600 ఉంటే రైతుకు మాత్రం రూ. 2,300 మాత్రమే చెల్లిస్తున్నారని అన్నారు. దీనికి తోడు రైతులే యంత్రాలతో ముక్కలుగా కటింగ్ చేసుకొని, తొక్క వలిచి ఫ్యాక్టరీకి తీసుకురవాలని కొత్త నిబంధనలు పెడుతూ రైతులపై మరింత భారం మొపుతున్నారని వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత దళారీ వ్యవస్థ అంతం అవుతుందని భావించినా వారి కార్యకలాపాలు మరింత హెచ్చుమీరుతున్నాయని వాపోయారు. కాగజ్‌నగర్‌లోని ఫ్యాక్టరీ మూతపడిందని, రాష్ట్రంలో ఒక్క ప్యాక్టరీ మాత్రమే కొనసాగుతుందని, తాము చెప్పిన ధరకు విక్రయించాలని రైతులపై ఒత్తిడి తెస్తున్నారని చెప్పారు. మొత్తం 100 మంది దళారులు పొగై రైతుల పొట్టగొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో మంత్రుల కమిటీ సూచనల మేరకు జీ ఓ నెంబర్ 31ని తీసుకువచ్చి ఒకే ధరకు కొనుగోలు చేస్తున్నారని, అదే పద్దతిని తెలంగాణలో సైతం అవలంభించాలని రాష్ట్ర మంత్రులు తుమమల నాగేశ్వరరావు, హరీష్‌రావుకు విన్నవించినా స్పందన లేకుండా పోయిందన్నారు. ఇప్పటికైనా భ్రుత్వం స్పందించి రైతులను రక్షించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. రైతులకు న్యాయం చేయాలన్న డిమాండ్‌తో ఈనెల 16న సారపాక ఫ్యాక్టరీ ఎదుట నిర్వహించతలపెట్టిన ధర్నలో తమ పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొంటారని తెలిపారు.