తెలంగాణ

ప్రజాథనాన్ని దుర్వినియోగం చేస్తారా హైకోర్టు ఆగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 13: గుంటూరు జిల్లా ఎడ్లపాడుగ్రామ పంచాయితీ సభ్యులు పంచాయితీ కార్యాలయం కొత్త భవనాన్ని సగం నిర్మించి ఆ తర్వాత దానిని వదిలేసి కొత్త భవనాన్ని నిర్మించాలన్న ప్రతిపాదనపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తారా అని హైకోర్టు ప్రశ్నించింది. కొత్త భవనం నిర్మాణంపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ స్టే మంజూరు చేశారు. ఈ భవనం నిర్మాణంపై జిల్లా కలెక్టర్ విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే ఇటువంటి చర్యలను అనుమతించరాదని, ప్రజాప్రతినిధులు ఇటువంటి చర్యలకు పాల్పడితే అనుమతించమని హైకోర్టు స్పష్టం చేసింది. పంచాయితీకి కొత్త భవనాన్ని నిర్మించాలన్న గ్రామ పంచాయితీ తీర్మానాన్ని సవాలు చేస్తూ ఎం శిరీష పిటిషన్ దాఖలు చేసింది. గతంలో సగం నిర్మించిన భవనం విషయాన్ని కూడా ఆమె పిటిషన్‌లో తెలిపారు. పిటిషనర్ తరఫున న్యాయవాది పి రాయ్ రెడ్డి వాదనలు వినిపిస్తూ, కోర్టు ఆదేశాల మేరకు పంచాయితీకి కొత్త భవనం నిర్మాణంలో ఉందని, దీనిని పక్కనపెట్టి కొత్త భవనం నిర్మించడానికి తీర్మానం చేయడం సరికాదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా హైకోర్టు జోక్యం చేసుకుని ప్రజాధనం దుర్వినియోగం చేయడం ఇదే అని వ్యాఖ్యానించింది. ఎనిమిది వారాల్లోగా కలెక్టర్ నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.