క్రీడాభూమి

కోర్టుకు హాజరైన బెన్ స్ట్రోక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంగ్లాండ్, ఫిబ్రవరి 13: ఇంగ్లాండ్ క్రికెట్ ఆల్‌రౌండర్ బెన్ స్ట్రోక్ మంగళవారం ఇక్కడి కోర్టుకు తొలిసారి హాజరయ్యాడు. ఆస్ట్రేలియాలోని యాషెష్ టూర్ సందర్భంగా గత ఏడాది సెప్టెంబర్ 25న నైట్‌క్లబ్ బయట జరిగిన గలాటాపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అతనిపై కొంతకాలం పాటు నిషేధం విధించారు. ఈ సంఘటన కారణంగా వెస్టిండీస్‌తో ఇంగ్లాండ్ జట్టు ఆడాల్సిన వనే్డ ఇంటర్నేషనల్ మ్యాచ్ కొన్ని గంటల పాటు జరగలేదు. ఆరోజు జరిగిన ఘర్షణలో 27 ఏళ్ల వ్యక్తికి కంటికి తీవ్ర గాయమైంది. జనసమూహంలో ఫైటింగ్‌కు దిగినట్టు స్ట్రోక్‌పై ఆరోపణలు రావడంతో ఈ 26 ఏళ్ల ఆల్‌రౌండర్‌తోపాటు మరో ఇద్దరు బ్రిస్టన్‌లోని సౌత్ వెస్ట్రన్ సిటీ కోర్టు మేజిస్ట్రేట్ ఎదుట హాజరయ్యారు. బెన్ స్ట్రోక్‌తోపాటు అతని సహచర క్రికెటర్ అలెక్స్ హలెస్‌పై కూడా తొలుత ఆరోపణలు వచ్చినా అవి రుజువు కాకపోవడంతో అతనిపై కేసు దాఖలు కాలేదు. విచారణ అనంతరం బెన్ స్ట్రోక్‌పై ఆరోపణలు రుజువైన పక్షంలో అపరాధ రుసుం లేదా ఆరు నెలల జైలుశిక్ష పడే అవకాశం ఉంది. యాషెష్ సిరీస్‌ను ఇంగ్లాండ్ 4-0 తేడాతో కోల్పోయింది.