జాతీయ వార్తలు

ఓబీసీల సంక్షేమానికి పెరిగిన కేటాయింపులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13: కేంద్ర బడ్జెట్‌లో ఓబీసీల సంక్షేమానికి కేటాయింపులు 41 శాతం పెంచినట్టు కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత మంత్రి థావర్‌చంద్ గెహ్లాట్ వెల్లడించారు. 2016-17 బడ్జెట్‌లో 12.10 శాతం అంటే 6,908 కోట్ల రూపాయలు కేటాయించగా 2018-19 బడ్జెట్‌లో 41 శాతానికి పెంచినట్టు మంత్రి స్పష్టం చేశారు. అంటే 7,750 కోట్ల రూపాయలు ఓబీసీల కోసం కేటాయించినట్టు ఆయన తెలిపారు. అంటే వివిధ పథకాలకోసం గత బడ్జెట్‌తో పోల్చుకుంటే 11.57 శాతం ఎక్కువని ఆయన అన్నారు. షెడ్యూల్డ్ కులాల వెంచర్ కేపిటల్ ఫండ్ మాదిరే ఓబీసీలకు మొదట 200 కోట్లతో కార్పస్ ఫండ్ ప్రారంభించనున్నట్టు మంత్రి తెలిపారు. ఓబీసీ విద్యార్థులకు ఉపకారవేతనం పొందడానికి ఆదాయ పరిమితిని పెంచినట్టు ఆయన వెల్లడించారు. 44,500 వార్షికాదాయం రెండున్నర లక్షల రూపాయలకు పెంచినట్టు గెహ్లాట్ తెలిపారు. ఎస్సీ విద్యార్థులకు ప్రీమెట్రిక్ స్కాలర్‌షిప్‌లకు ఆదాయ పరిమితిని 2 లక్షల రూపాయల నుంచి రెండున్నర లక్షల రూపాయలకు పెంచినట్టు సామాజిక న్యాయశాఖ మంత్రి పేర్కొన్నారు. ఫ్రీ కోచింగ్ శిక్షణ కోసం ఎస్సీ, ఓబీసీ విద్యార్థుల ఆదాయ పరిమితిని 4.5 లక్షల నుంచి ఆరు లక్షల రూపాయలకు పెంచినట్టు మంత్రి వివరించారు. స్థానిక విద్యార్థుల స్టయిఫండ్ 1,500 నుంచి 2,500 రూపాయలకు, స్థానికేతర విద్యార్థులకు 3,000 నుంచి 5,000 రూపాయలకు పెంచినట్టు మంత్రి స్పష్టం చేశారు.