జాతీయ వార్తలు

ఉజ్వల్ యోజనతో మహిళా సాధికారత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మంగా అమలుచేస్తున్న ‘ఉజ్వల యోజన’ మహిళల సాధికారతకు దోహదపడుతోందని రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ స్పష్టం చేశారు. రాష్టప్రతి భవన్‌లో మంగళవారం ‘ఎల్‌పీజీ పంచాయత్’ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద మహిళలకు ఉచితంగా ఎల్‌పీజీ కనెక్షన్ ఇవ్వాలన్న పథకం వారి అభివృద్ధికి మరింత ప్రోత్సాహకరంగా ఉంటుందని అన్నారు. కేంద్ర పెట్రోలియం, సహజవాయువుల మంత్రిత్వశాఖను రాష్టప్రతి అభినందించారు. మహిళ ఆరోగ్యం, సంక్షేమం, సాధికారితకోసం చేస్తున్న కృషిని కోవింద్ ప్రశంసించారు. ఎల్‌పీజీ పంచాయత్‌లు ఎంతో ప్రయోజనకారిగా ఉంటాయన్న అభిప్రాయం ఆయన వ్యక్తం చేశారు. తమ అభిప్రాయాలను ఇతరులతో పంచుకోవడంతోపాటు సాదకబా ధకాలు పై అధికారులకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో చమురు మంత్రిత్వశాఖ ‘ఎల్‌పీజీ పంచాయత్’ను ఏర్పాటు చేసింది. వినియోగదారులు నివసిస్తున్న ప్రాంతాల్లోనే వంద మందికి ఒకటి చొప్పున ఏర్పాటు చేస్తున్నారు. ఎల్‌పీజీ వినియోగంలో ఇబ్బందులు, భద్రత అలాగే వంటగ్యాస్ వాడకం వల్ల ప్రయోజనం వంటి విషయాలు చర్చిస్తారు. దేశవ్యాప్తంగా లక్ష ఎల్‌పీజీ పంచాయత్‌లు నిర్వహించనున్నట్టు సంబంధిత అధికారులు వెల్లడించారు. వచ్చే ఏడాది మార్చి 31నాటికి వీటిని పూర్తిచేస్తారు.

మంగళవారం రాష్టప్రతి భవన్‌లో జరిగిన ఎల్‌పీజీ పంచాయత్ కార్యక్రమంలో
పాల్గొన్న మహిళలతో రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్