సబ్ ఫీచర్

అందమె ఆనందం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందమా? వ్యక్తిత్వమా? అంటే చాలామంది పైకి వ్యక్తిత్వానికే ఓటు వేస్తారు కానీ కనిపించకుండా అందానే్న ఇష్టపడతారు. ఎందుకని అని మనల్ని మనం ప్రశ్నించుకుంటే ఆకర్షణ అనే సమాధానం వస్తుంది. అదెలా అంటారా?
మీరు ఓ పెళ్లిచూపులకు వెళ్ళారు. అక్కడ అమ్మాయి, అబ్బాయిని, అబ్బాయి అమ్మాయిని చూసుకుంటారు. ఎక్కువ అక్కడ అందానికే ప్రాముఖ్యత ఇస్తారు. కానీ మంచివారు తెలివికి, వ్యక్తిత్వానికి, మనసుకు ప్రాధాన్యతనిస్తారు. పిల్ల నలుపని, పిల్లాడు చామన ఛాయని వంకలు చెప్పి సంబంధాన్ని వదిలించేసుకుంటారు. అమ్మాయి అందంగా ఉండి రోజంతా వంకర మాటలు మాట్లాడితే మీ బ్రతుకు ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. అదే అబ్బాయి హాండ్‌సమ్‌గా ఉండి కూడా మిమ్మల్ని అనుక్షణం వేధిస్తుంటే నరకం ఇక్కడే చక్కగా రోజూ చూడవచ్చు. కొందరు ఎలా దంపతులయ్యారో మనకి అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళు కాకి ముక్కుకి దొండపండు చందంలో ఉంటారు. అక్కడ మనసు పాత్ర ఎక్కువుందని అర్థం. అంటే వాళ్ళు మనిషిని కాక మనసుని ప్రేమించారనే చెప్పెయ్యవచ్చు. మరి ఎర్రగా అందంగా ఉన్నవాళ్ళు నల్లగా ఉన్నవాళ్ళని చేసుకుంటే ఇలా ఉంటారు మరి. కొందరితో రెండు నిముషాలు మాట్లాడగానే మనకి ఎంతో ముచ్చటవేస్తుంది. వారి స్వభావం అర్థమవుతుంది కాబట్టి. అందులో ముఖ్యమైనది ఎవరినుంచి ఏమీ ఉచితంగా ఆశించని స్వభావం. అంతా స్వయంశక్తితోనే సాధించుకోవాలనే దృఢత్వం అలాంటివారిలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.
కళ్ళు మనసులో భావాలకు అద్దాలు అంటారుగా, మీరేమిటి ఇలా చెబుతున్నారని మీకు సందేహం రావచ్చు. అది ఒకప్పటి మాట. ఇప్పుడు అందరిలో నటనలు ఎక్కువైపోయాయి. అసలు జీవించటం మానేసి నటనలో జీవించేస్తున్నారు. అందుకే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో, ఎవరితో కలవాలో ఎవరితో కలవకూడదో అర్థంకాక జనాలు తలలు పట్టుకుంటున్నారు. మాట కలపాలన్నా, స్నేహం చెయ్యాలన్నా అయోమయంలో పడిపోతున్నారు. మరి మేక వనె్న పులులు ఎక్కువైపోయారు. ఎవరైన మనల్ని నచ్చి ఆప్యాయంగా ఇంటికి పిలిచినా ఏంటంట? ఎందుకు పిలిచారు? కొంపతీసి ఏమైనా ఆర్గాన్స్ అమ్మేసుకుంటారేమో అనెయ్యటం వినిపిస్తోంది. ఇది వినటానికి ‘బాబోయ్’లా అనిపిస్తున్నా ఒకరకంగా చేదు నిజం. అలాంటివీ ఈ లోకంలో జరుగుతున్నాయి. కానీ అప్పుడు పరిచయాలు ఎలా పెరుగుతాయి? అందులో తీయని అనుబంధాలను ఎలా రుచి చూస్తాం? కొన్ని సంబంధాలు దూరపువి అయినా మనసులని దగ్గర చేస్తాయి. అలాంటివి అంటే నాకు చాలా ఇష్టం. మా చెల్లిగారి అబ్బాయికి ఈమధ్యే పెళ్లి అయింది. అతని అత్తగారు, మా చెల్లి వియ్యపురాలు. మేము హైదరాబాద్ వచ్చామని తెలిసి వెంటనే వారింటికి ఆహ్వానించాను. సమాధానం చెప్పే అవకాశం కూడా ఇవ్వలేదు. రమ్మని చెప్పటమే. మా తమ్ముడి ఇంట్లో ఉంటే మా మరదలుకు ఫోన్ చేసి భోజనాలని ఇక్కడకు పంపెయ్యండి అని చెప్పారు. ఆ దంపతులు ఫోనులో చూపిన అభిమానం, ఆ తర్వాత వారితో గడిపిన ఆ రోజు జీవితాంతం ఇలాంటి వ్యక్తిత్వాలు. బంధువులయినా ఆ క్షణాలన్నీ స్నేహితుల్లా పంచుకున్నాం. అవన్నీ వారు చూపిన ప్రేమ ఆప్యాయతలకు చిహ్నాలే!
కాని, ఇలాంటి వాళ్లు కాస్త తక్కువే. కొంతమంది లో నిస్వార్థత మచ్చుకి కూడా కనిపించటం లేదు కాబట్టి. రక్తసంబంధీకులు కూడా ముందు ఒక మాట, వెనుక ఒక మాట. నిజాయితీ ఉండటం లేదు అని ఎందరో వాపోతున్నారు. ఎదుటే అంటే బాధపడరా అనవచ్చు. వెనక అంటున్నారని వింటే అది ఇంకా బాధ కదా! అసలు ఇదంతా ఎందుకు? హంస పాలూ నీళ్ళను వేరుచేసినట్లు మనం ఎదుటి మనిషిలో మంచిని మాత్రం గ్రహించి చెడును పట్టించుకోకపోతేనన్నా ఇలాంటి మానవ సంబంధాలు కాస్త పెరిగే అవకాశముంటుందని నా అభిలాష. అయినా ఇప్పుడు అందంగా ఉన్నారని పెళ్లిచేసుకున్నారు. పెళ్ళైన తరువాత ఏదైనా అనుకోనిది జరిగి అందవికారమైతే ఏం చేస్తాం? వదిలేస్తామా? పెళ్లికి కట్టుబడే సాంప్రదాయం కదా మనది! అప్పుడు మన ప్రేమను నిలిపేది మాత్రం వ్యక్తిత్వమే!
అందం అయితే వయసు పెరగడంతో వడిలిపోతుంది. కానీ వ్యక్తిత్వం ఎప్పటికీ అలా కాదు. మనం నిలబెట్టుకున్నన్నాళ్ళూ అది నిలబడే ఉంటుంది. దిగజారిస్తే తప్ప దిగజారదు. తరిగిపోయే అందానికంటే తరగని, చెరగని వ్యక్తిత్వానికే ఓటు వేసి ఆనందంలో తేలియాడాలని మనసారా కోరుకుందాం.