Others

ఆమె నవ్వింది (గోరాశాస్ర్తి గారి రేడియో నాటిక)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

(రైలుబండి ఫ్లాటుఫారం వదిలి క్రమంగా వేగం హెచ్చించుకుంటూ చివరికి అతి జోరుగా పరిగెత్తుతున్నట్లు చప్పుడు)
ఒక పురుష కంఠం: (కంగారుగా) అరెరె! అరె! అమ్మాయ్- అటు చూడు చూడు. ఎంత సాహసం! (కంఠం హెచ్చింది) ఏయ్ అబ్బీ-
యువతి కంఠం: (కొంచెం కంగారుగా) ఏమిటి నాన్నా!
పు: (అదే కంగారుతో) పడిపోతావ్! (కంఠం తగ్గించి) అమ్మాయ్, ఆ తలుపు తియ్యి! ఎవడు వాడూ? పిచ్చివాడా? దొంగా?
యువతి: ఉండు నాన్నా, తలుపు తీస్తాను.
యువ కంఠం: (లోపలికి ప్రవేశిస్తూ) హమ్మయ్యా! పడిపోతాననుకున్నాను.
పు: అనుకోవడవేమిటి నీ మొహం! పడిపోదువు; అమాంతంగా చచ్చివుందువు. అమ్మాయేగనుక తలుపు తియ్యకపోతే!
యువకుడు: అంతే అంటారా?
పు: కాకపోతే? నడుస్తున్న రైలా మాటలా?
యువతి: పోనీలే నాన్నా! ప్రమాదం జరుగలేదుగా!
పు: ఉండుండు- ఇంతటితో అయిందా? ఏం అబ్బాయ్! ఏవిటి నీ గమ్మత్తు! ఆ.. టికెట్ లేని బాపతా? లేక జేబులు కత్తిరించే ఉద్యోగమా?
యువతి: (నాన్న ధోరణి తప్పు అన్నట్లు) నాన్నా! ఏమిటిది నాన్నా!
యువకుడు: క్షమించండి, పొరపాటు-
పు: అంటే?
యువకుడు: అంటే మరేం లేదు, పొరపాటున మీ పెట్టెలోకి వచ్చాను.. అంతే.
పు: టిక్కెట్టు ఉందా అంటే సమాధానం చెప్పవేం?
యువకుడు: ఉంది. టిక్కెట్టులేకుండా ప్రయా ణం చేసే ధైర్యం ఎక్కడేడిసింది నాకు?
పు: మరి? జేబులు కాజేసే ధైర్యం ఉందా?
యువ: అదీ లేదు.. ఏం సార్? నేను చూస్తే దొంగలా కనబడుతున్నానా?
పు: (వ్యంగ్యంగా) అబ్బే! దొరబిడ్డలా వున్నావు! నువ్వూ, నీ బట్టలూ, నీ వాలకం!
యువకుడు: మన్నించండి. బీదవాణ్ణి. అందుకే ‘నిర్ధనస్య మృతస్య’ అన్నాడు. కట్టుకుందికి ఇంతకంటే మంచి బట్టలు లేవు. చెప్పుకుందికి ఇంతకంటే మంచి మాటలూ లేవు.
పు: అబ్బో! సంస్కృతం వెలిగిస్తున్నావ్! చదువుకున్నవాడివేనా?
యువకుడు: చిత్తం. ఏదో కొంచెం న్యూస్‌పేపరు భాషలో అన్నట్టు- నేనూ ఓ పట్ట్భద్రుణ్ణి.. నీరసంగా ఉంది. కాస్త ఈ ట్రంకుమీద కూర్చోనిస్తారా?
యువతి: కూర్చోండి ఫర్వాలేదు!
యువకుడు: మళ్లీ రైలాగగానే దిగిపోతాలెండి.
పు: ఉద్ధరిస్తావ్! ఎవరికోసం దిగుతావ్! లేకపోతే సుఖంగా రాత్రంతా సెకెండ్ క్లాసులో ప్రయాణం చేద్దామనుకున్నావా?
యువకుడు: లేదండి, ఇందాకనే చెప్పాను.. అంత ధైర్యం లేదు. అలాంటి ఆశలూ లేవు. నేను సుఖాన్ని వెతుక్కుందికి బయలుదేరలేదండి. దుఃఖాన్ని తప్పించుకుంటూ వస్తున్నాను. అంతే
పు: బాగుంది.. ఉంటారు- నీలాంటి ప్రయోజకులు చాలామంది ఉంటారు లోకంలో. (హా- అని ఆవులించి చిటికెలు వేసుకుంటూ) శ్రీరామచంద్రా! అమ్మాయ్ వైదేహీ! ఈ సోదంతా దేనికిగాని- అర్ధరాత్రి దాటింది నేను కాసేపు నడుం వాలుస్తాను.
యువతి: సరే నాన్నా! నువ్వు పడుకో నేను కాసేపు చదువుకుంటాను. ఎంచేతో నిద్రపట్టడంలేదు.
పు: జాగ్రత్త! వచ్చే స్టేషన్‌లో అతగాడు దిగిపోయాక కంపార్ట్‌మెంట్ తలుపులు లోపల గడియపెట్టెయ్! కాని కాలం, కాని రోజులూనూ!
యువతి: అలాగే నాన్నా!
పు: హా! శ్రీరామచంద్రా
(రైలు ఒక్కసారి కూతవేస్తుంది. ఉవ్వెత్తుగా ఒక్కసారి చప్పుడు లేచి మళ్లీ సన్నబడి అలాగే వినబడుతూ ఉంటుంది)
(క్షణం విరామం)

- సశేషం
(ఆకాశవాణి సౌజన్యంతో...)