క్రీడాభూమి

వింటర్ ఒలింపిక్స్ రియామ్, కిమ్ పట్టుదల!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాంగ్‌న్యుంగ్, ఫిబ్రవరి 14: ఉత్తర కొరియా స్కేటర్లు రియామ్ తయే ఒక్, కిమ్ జూ సిక్ పట్టుదలకు మారుపేరన్న ముద్ర వేయించుకున్నారు. నిజానికి ఉత్తర కొరియా నుంచి వింటర్ ఒలింపిక్స్‌లో పాల్గొనడానికి వచ్చిన 22 మంది బృందంలో ఎవరికీ ఒలింపిక్స్ స్థాయి ఈవెంట్స్‌లో పోటీపడే స్థాయి లేదు. కనీస అర్హతా ప్రమాణాలు కూడా వారికి లేవు. 20 మందికి తమతమ విభాగాల్లో మెయిన్ డ్రా చేరడం అసాధ్యమని ఉత్తర కొరియా అధికారులే ఉంటున్నారు. మిగతా ఇద్దరు రియామ్, కిమ్. వీరిద్దరు కూడా ట్రయల్స్ నుంచే నిష్క్రమిస్తారన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ, దక్షిణ కొరియాతో కలిసి సంయుక్త జట్టుగా పోటీపడుతున్న కారణంగా, రెండు దేశాల ప్రజలంతా ఒక్కటేనని చాటి చెప్పేందుకు కంకణం కట్టుకున్న వారు బుధవారం నాటి హీట్స్‌లో సర్వశక్తులు ఒడ్డారు. తమ జాతీయ రికార్డును బద్దలు చేశారు. డ్యుయెల్ స్కేట్ క్వార్టర్ ఫైనల్స్ చేరారు. వీరు ఎంత ముందుకు వెళతారు? పతకాన్ని సాధిస్తారా? లేదా? అనే ప్రశ్నలను పక్కకు ఉంచితే, వింటర్ ఒలింపిక్స్ వంటి మెగా ఈవెంట్‌లో ముందంజ వేయడం, ఉభయ కొరియా దేశాల ప్రజలంతా ఒకటేనని చాటిచెప్పడం వారిని ఇప్పటికే విజేతలుగా నిలబెట్టింది. పట్టుదలతో ప్రాక్టీస్ చేస్తూ, తమ కెరీర్‌లోనే ఉత్తమ ప్రదర్శనలతో ఈ జోడీ ఆకట్టుకుంటున్నది.