తెలంగాణ

విదేశాల్లోనైనా.. నీట్ తప్పనిసరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 14: దేశంలో వైద్య విద్య అభ్యసించాలంటే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష -నీట్ రాయాల్సిందే. దేశంలో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులకు నీట్ ర్యాంకు ఆధారంగానే అడ్మిషన్లు జరుగుతున్నాయి. జాతీయ స్థాయిలో ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లకు నీట్ ర్యాంకే ఆధారం. విదేశాల్లో వైద్య విద్య చదువుతున్న వారి ప్రమాణాలు పెంపొందించాలంటే అర్హత పరీక్ష ఉత్తీర్ణత నిబంధన ఉండాలని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చేసిన ప్రతిపాదనను కుటుంబ ఆరోగ్య శాఖ ఆమోదించింది. ప్రస్తుతం విదేశాల్లో చదువుకుని తిరిగి వచ్చిన వారికి కేంద్ర ప్రభుత్వం ఒక ప్రవేశపరీక్ష నిర్వహిస్తోంది. అది ఉత్తీర్ణులైన వారిని మాత్రమే వైద్యులుగా గుర్తింపు ఇస్తోంది. అయితే ఈ విధానం వల్ల చాలామంది విద్యార్థులు విదేశాల్లో నాసిరకం యూనివర్శిటీలు, విద్యాసంస్థల్లో చేరి పెద్ద ఎత్తున డబ్బు వృధా చేస్తున్నారు. కేవలం ఫీజులు కడితే చాలు నేరుగా కొన్ని విదేశీ యూనివర్శిటీలు అడ్మిషన్లు ఇస్తున్నాయి. విద్యార్థుల్లో ప్రమాణాలు లేకుండానే కోర్సు వ్యవధి పూర్తవుతోందే తప్ప కోర్సులు పూర్తికావడం లేదు. ఈ ఏడాది మే తర్వాత ఎవరైనా విదేశీ డిగ్రీ పొందాలనుకుంటే మాత్రం తప్పనిసరి నీట్ రాయాల్సి ఉంటుందని కేంద్ర కుటుంబ సంక్షేమ శాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం చైనా, రష్యా, ఫిలిప్పీన్స్, కజికిస్థాన్ వంటి దేశాల్లో పెద్ద ఎత్తున భారతీయ విద్యార్థులు ఎంబిబిఎస్ చేయడానికి వెళ్తున్నారు. ప్రతి ఏటా నీట్‌కు 12 లక్షల మంది హాజరవుతుండగా, దాదాపు ఆరు లక్షల మంది నీట్‌లో ఉత్తీర్ణులవుతున్నారు. వారిలో 68వేల మందికి ఎంబీబీఎస్ సీట్లు లభిస్తున్నాయి.