సబ్ ఫీచర్

అంతా ఋషిసంపదే.. పురాణాల్లో శాస్తవ్రిజ్ఞానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బోధాయన మహర్షి: ఈయన ధాతు సర్వస్వమను గ్రంథమును రచించెను. ఈ గ్రంథము లోపలి రకముల ధాతువులను తయారుచేయు విధానము, ఆయా ధాతువులు లభించు గనులు, గనుల నుండి తీసిన ముడి ధాతువును శుద్ధి చేయు విధానము, గంధకము తయారుచేయు విధానము, అనేక రకముల విషయములు, వాటి దోష నివారణ పద్ధతులు, పాదరసోత్పత్తి మొదలగు విషయములు కలవు. వివరణాచార్యులు- ఈయన ‘లోకసంగ్రహము’ అను గ్రంథమును రచించెను. ఈ గ్రంథములో 1714 భాషలకు చెందిన వివరములు కలవు. వివిధ జీవజాతులు, వాటి పుట్టుక వివరములు, వాటి ఆహార వివరములు, ప్రపంచమందలి వివిధ విషయ పరిజ్ఞానము వివరించబడింది.
నారద మహర్షి: ‘విశ్వానరతంత్రము’ అను గ్రంథాన్ని రచించారు. ఈ గ్రంథంలో 128 రకాల అగ్నులు వివరింపబడ్డాయి. ఆ అగ్నుల గుణములు, రంగులు ఉష్ణ్భేదములు, ప్రయోజనములు, తరతమ భేదములు వివరించబడ్డాయి. నారద మహర్షి ‘్ధమ్రప్రకరణము’ అను గ్రంథం రచించారు.
దీనియందు సృష్టిలోని వివిధ రకములైన వస్తువులను దహించినపుడు వెలువడే ధూమములను, వివిధ రకములైన అద్దములపై పట్టి ఆ ధూమములను కొన్ని రకముల యాసిడ్స్ (ఆమ్లములు) ద్వారా పరిశీలించి అందలి విష గుణములను (టాక్సిన్‌లను) మంచి గుణములను కనుకొని, వాటిని శరీరము, బుద్ధి మొదలగు వాటి చికిత్సకు ఉపయోగించు వివరములు తెలిపెను.
శక్త్యాన మహర్షి: ఈయన ‘వాయుతత్వ ప్రకరణము’ అను గ్రంథమును రచించెను. దీనియందు ఎనభై నాలుగు వేల వాయువులు వాటి వివరములు భూమిపై వాటి ప్రభావములు, లక్షలకొలది ఓషధులు, వృక్ష సంపదపై వాటి ప్రభావము, ఈ వాయువుల రకములు లేక తత్వములను పరిశీలించుటకు కావలసిన యంత్ర పరికరములు కూడా వివరింపబడినవి. నేడు మనకు తెలిసిన వాయువులు ‘ఆక్సిజన్, నత్రజని వాయువు, హైడ్రోజన్, క్లోరిన్ మొదలైన వాయువులు రెండంకెలను దాటి వుండకపోవచ్చు.
ఆశ్వలాయన మహర్షి: ఈయన ఆప్‌తత్వ ప్రకరణము (నేటికి సంబంధించిన శాస్తమ్రు)ను రచించెను. ఈ గ్రంథమునందు నీటియొక్క రకములు, ప్రయోజనములు, గుణములు, విశిష్ట గుణములు, స్నాన ప్రయోజనములు మొదలగు అనేక విషయములను వివరించెను.
వశిష్ఠ మహర్షి: ఈయన ‘ప్రపంచ లహరి’ అను గ్రంథములు రచించెను. ఈ గ్రంథమునందు పరమాణు సిద్ధాంతము వివరింపబడింది. అంతేకాక ఈ బ్రహ్మాండముల సృష్టికి కారణము పరమాత్మా! లేక అణువులా యను అతి సంక్లిష్ట విషయము చర్చించబడినది. బ్రహ్మాండ విజ్ఞానమును గురించి చాలామంది మహర్షులు రచనలు చేశారు.
పరాశర మహర్షి: ఈయన ‘అండకౌస్థ్భుము అను గ్రంథమును రచించెను. ఈ గ్రంథమునందు, అణు సిద్ధాంతము, బ్రహ్మాండము యొక్క అనేక వివరములు, అందలి జీవరాశి వాటి వివరములు మొదలగు అనేక విషయములు చర్చించారు.
వ్యాసమహర్షి: అష్టాదశ పురాణములు భాగవతాది గ్రంథములే కాక బ్రహ్మాండ సారము అను గ్రంథమును రచించెను. దీనియందుగూడ ‘అణు సిద్ధాంతము’ బ్రహ్మాండ చరిత్ర వివరింపబడెను.

డా॥ గుడిపాటి వి.ఆర్.ఆర్.ప్రసాద్