కృష్ణ

లోక కల్యాణార్థం శ్రీనివాస హోమాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూచిపూడి, ఫిబ్రవరి 15: లోక కల్యాణార్ధం ప్రజా సంక్షేమానికై ముముక్షుజన మహాపీఠాధిపతులు శ్రీ ముత్తీవి సీతారాం గురుదేవ దంపతులు చేపట్టిన శ్రీనివాస హోమాలు, మాఘ బహుళ అమావాస్యను పురస్కరించుకుని శ్రీ అనంత ఆదిశేష భగవానుణ్ణి అభిషేకించేందుకు శ్రీకృష్ణాశ్రమానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన పెదముత్తేవి శ్రీకృష్ణాశ్రమంలో గురవారం పండితుల వేద మంత్రాలు, శ్రీసూక్త, పురుష సూక్త, రుద్ర సూక్తాలు, భక్తుల వాసుదేవనామస్మరణల నేపథ్యంలో శ్రీ అనంత ఆదిశేష భగవానుణ్ణి అభిషేకించేందుకు భక్తులు బారులుతీరారు. అంతకుముందుగా ఆశ్రమంలోని దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ అభయ వీరాంజనేయ స్వామివారికి వడమాలలు, పూలమాలలు సమర్పించారు. గురుదేవులు భక్తులనుద్దేశించి అనుగ్రహభాషణ చేశారు. ముత్తీవి గౌరాకృష్ణ, తుర్లపాటి రాధాకృష్ణ, ఆత్మకూరి లక్ష్మణదాసు, తుర్లపాటి ఆనందసాగర్ పర్యవేక్షణలో యతీంద్ర సేవా సమితి సభ్యులు భక్తులకు అన్నసమారాధన నిర్వహించారు.